Wednesday, 27 May 2026

నిజంగా మార్కెట్లో మనీ లేదా?


నాకు ఊహ తెలిసినప్పటినుంచి "మార్కెట్" గురించి నేను వింటున్న ఒకే ఒక్క స్టేట్మెంట్:

"అస్సల్ మార్కెట్ల పైసల్లేవ్. రొటేషన్ బిల్‌కుల్ లేదు. ఎవ్వని దగ్గర ఒక్క పైసా లేదు. బిజినెస్ ఇంత డల్‌గా ఎప్పుడు లేదు" అని. 

కట్ చేస్తే -

సంవత్సరానికి 200+ సినిమాలు ఎప్పట్లాగే తెలుగులో తయారవుతున్నాయి. 

స్కూళ్ళు, హాస్పిటళ్ళు ఫుల్ బిజీగా ఉన్నాయి. ఒక్కసారి కూడా మూతపడలేదు. 

బిజినెస్‌లన్నీ మామూలుగానే నడుస్తున్నాయి. ల్యాండ్ రిజిస్ట్రేషన్స్ ఆగలేదు. రిజిస్ట్రేషన్ ఆఫీసులు మూతపడ్లేదు.

ఫారిన్ టూర్స్ వెళ్తున్నారు. 
బ్రహ్మాండంగా పెళ్ళిళ్ళు అవుతున్నాయి.
రిసార్ట్స్, హోటల్స్ పిచ్చి బిజీగా ఉంటున్నాయి.
మాల్స్ అన్నీ నిండుగానే ఉంటున్నాయి.
ఊబర్లు, ర్యాపిడోలు అరగంటగ్గాని దొరకట్లేదు.

ఒకవైపు "మార్కెట్" ఇంత బిజీగా ఉంటే, మరెందుకిలా చాలామంది "మార్కెట్ల మనీ లేదు" అంటారు?  

అలా అనేవాళ్ళలో కొందరు తప్పించుకోడానికి అంటారు. 
ఇంకొందరికి పని చేతకాక అంటారు. 

సో, మన పని కోసం మనం ఎన్నుకోవాల్సింది అల్లాటప్పా మైండ్‌సెట్ ఉన్న కోతలరాయుళ్ళని కాదు. పాథలాజికల్ లయ్యర్స్‌ని కాదు. 

గట్స్ ఉన్న సమర్థుల్ని.  

There may be fluctuations in the market.
But that never means you stop creating.

With the right mindset, courage, and clarity, you can build something meaningful in any situation.

That’s guts.

- మనోహర్ చిమ్మని   

No comments:

Post a Comment

Thanks for your time!
- Manohar Chimmani