ఈమధ్య నటుడు, దర్శకుడు రవిబాబు ఇంటర్వ్యూ ఒకటి అక్కడక్కడా బైట్స్ చూశాను. కుండ బద్దలు కొట్టినట్టు బాగా చెప్పాడు రవిబాబు.
ఒక్క ముక్కలో రవిబాబు మాటల్లో చెప్పాలంటే:
"మొత్తం పెంట పెంట చేసేశారు వీళ్ళంతా!"
"మొత్తం పెంట పెంట చేసేశారు వీళ్ళంతా!"
కట్ చేస్తే -
ఇప్పుడు సినిమా ప్రమోషన్ కోసం ఎన్ని కథలు పడుతున్నారంటే:
ఫస్ట్ లుక్
మోషన్ పోస్టర్
ఫస్ట్ గ్లింప్స్
ఫస్ట్ లిరికల్
సెకండ్ లిరికల్ (ఇలా ఎన్ని పాటలుంటే అన్ని)
హీరో బర్త్‌డే గ్లింప్స్
హీరోయిన్ బర్త్‌డే గ్లింప్స్
ఫస్ట్ టీజర్
సెకండ్ టీజర్ (అనుకుంటే మూడో టీజర్)
ప్రి-ప్రిరిలీజ్
ప్రిరిలీజ్ గ్లింప్స్
ప్రిరిలీజ్ ఈవెంట్
ట్రయలర్
100 ఇంటర్వ్యూలు, చాట్స్, బైట్స్
సక్సెస్ మీట్ (ఇది రిలీజ్ కంటే ముందే ప్లాన్ చేస్తారు)
మళ్ళీ ఇంకో 100 ఇంటర్వ్యూలు, చాట్స్, బైట్స్
ఇంక బయట పోస్టర్లు, ఫ్లెక్సీల పబ్లిసిటీ మామూలే.
... ... ...
నేను రాసింది అన్నీ కాదు. ఇంకొన్ని కూడా ఉంటాయి.
ఐడియా వచ్చిందే ఆలస్యం... దానికో పేరు పెట్టి చేసెయ్యడమే.
ఇవన్ని చేసినా 95% సినిమాలు ఫెయిల్ అవుతాయి. 5% లోపు సినిమాలు మాత్రమే సక్సెస్ అవుతాయి.
నిజంగా ఈ "పెంట ప్రమోషన్" ఎఫెక్ట్ అంటూ ఏదైనా ఉంటే, అన్ని సినిమాలూ సక్సెస్ అవ్వాలి కదా?
నిజంగా ఈ "పెంట ప్రమోషన్" ఎఫెక్ట్ అంటూ ఏదైనా ఉంటే, అన్ని సినిమాలూ సక్సెస్ అవ్వాలి కదా?
సినిమాకు ప్రమోషన్ అవసరమే కానీ...
ఇంత నాన్సెన్స్ అనవసరం.
ప్రేక్షకులకు నచ్చితేనే ఏ సినిమా అయినా హిట్ అయ్యేది.
వాళ్లకు నచ్చేలా, నచ్చి థియేటర్‌కు వచ్చేలా చెయ్యగలిగే ఒక్క ట్రయలర్ చాలు. ఆ ట్రయలర్‌ను ఆన్‌లైనంతా స్ప్రెడ్ చెయ్యగలిగే సోషల్ మీడియా & యూట్యూబ్ స్ట్రాటెజీ చాలు.
మిగిలిందంతా వృధా.
అంత వృధా ఖర్చుతో,
ఏకంగా ఒకటో రెండో చిన్న బడ్జెట్ సినిమాలు
చాలా ఈజీగా చెయ్యొచ్చు.
- మనోహర్ చిమ్మని

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani