ఎంత బడ్జెట్?
ప్యానిండియానా, జస్ట్ తెలుగేనా?
పెద్ద బ్యానరా, ఇండిపెండెంట్ సినిమానా?
ప్యానిండియా డైరెక్టరా, కొత్త డైరెక్టరా?
హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు?
... ఇవ్వన్నీ ఇప్పుడెవ్వరూ పట్టించుకోవడం లేదు.
థియేటర్‌కు వెళ్ళి సినిమాలు చూసే అలవాటు క్రమంగా తగ్గిపోతోంది.
అంత టైం లేదు ఎవ్వరికీ.
అంత టైం లేదు ఎవ్వరికీ.
ఈ మార్పు ఒక్క తెలుగులోనే కాదు,
ప్రపంచం అంతటా ఇంతే.
హాలీవుడ్‌లో కూడా.
కట్ చేస్తే -
సినిమా ఎక్కడికీ పోదు.
జస్ట్ ఇదొక సంధి కాలం.
ఓటీటీల్లో సుకూన్‌గా సినిమా చూసే అలవాటు కూడా ఎంతోకాలం ఉండకపోవచ్చు. మనిషి జీవనశైలిని పూర్తిగా మార్చేసిన సోషల్ మీడియా అంటే మొహం మొత్తే రోజు కూడా త్వరలోనే రావచ్చు.
ఏఐతో సినిమాకు ఎలాంటి ప్రమాదం లేదు. టెక్నికల్‌గా ఏఐని మించిన ఇంకేదో ఒక కుదుపు తప్పక వస్తుంది. అప్పటిదాకా బహుశా ఇంతే.
సినిమా బిజినెస్ మాత్రం ఉంటుంది.
బయటికి చెప్పే లెక్కలు నిజమా అబద్ధమా అన్నది ఆ లెక్కలు చెప్పేవాళ్ళ సొంత విషయం.
ఎంటర్‌టైన్మెంట్ ఒక్కటే పాయింట్.
- మనోహర్ చిమ్మని

ఎంటర్‌టైన్మెంట్ ఒక్కటే పాయింట్. ఈమాట నిజమే. కాని దాని రూపస్వభావాలు కాలానుగుణంగా మారతాయి. నాటకాలు పోయి సినిమా. రేపు సినీమా పోయి మరొకటి రావచ్చును. సినిమాను చిరంజీవి అనుకోవటం పొరపాటు కావచ్చును. ఏఐ కారణంగా సినీమా కొద్దోగొప్పో మారవచ్చును. ఏఐ పోయి మరొకటి వస్తే అది సినీమాపై మరింత ప్రభావం చూపవచ్చును. సినీమాను జనం రిసీవ్ చేసుకొనే విధానం మారుతోంది కాబట్టి సినీమా టేకింగ్ కూడా కాలానుగుణంగా మారకతప్పదు.
ReplyDeleteఇకపోతే ఎక్కువ పెట్టుబడి లేదా ఎక్కువ స్క్రీన్స్ మీద రిలీజ్ ఐనంత మాత్రాన పెద్దసినిమా కాలేదు. జనాదరణే కొలబద్ద. కలెక్షన్ డివైడెడ్ బై ఇన్వెష్ట్మెంట్ విలువే నిజమైన సక్సైస్ ఇండెక్స్.
మార్పులు తప్పవు.
DeleteChange is the only constant.