పెద్ద గ్రూపు, చిన్న గ్రూపు, కొత్తగా ఎదుగుతున్న గ్రూపు అని ముఖ్యంగా మూడు గ్రూపులు అనుకుందాం.
చిన్న గ్రూపుతో అసలు గొడవే లేదు. దాన్నసలు పట్టించుకోదు పెద్ద గ్రూపు. ఎప్పుడు ఎక్కడ ఎలా వీలైతే అలా ఆ గ్రూపుని తొక్కుకుంటూపోతుంటుంది. లాభపడుతుంటుంది. అది పెద్ద గ్రూపు నైజం.
ఎదుగుతున్న గ్రూపుతోనే పెద్దగ్రూపుకు భయం. ఎందుకంటే - ఈ పెద్ద గ్రూపులోనివాళ్ళు ఇన్నేళ్ళుగా నిర్మించుకున్న సామ్రాజ్యపు సౌధాల్ని ఈ ఒక్క ఎదుగుతున్న గ్రూపు మాత్రమే బద్దలు కొట్టగలదు కాబట్టి.
అందుకే ఎక్కడలేని ఈగో కావచ్చు. మనకు ఎదురేది అని అహంకారం కావచ్చు. ఒకరో ఇద్దరో కాదు, ఈ గ్రూపులోని అందరూ కామన్ సెన్స్ కోల్పోతారు.
కట్ చేస్తే -
సినిమా ఇండస్ట్రీ నుంచి ఒక పెద్ద హీరో ఒక రాష్ట్రానికి ఉపముఖ్యమంత్రి అయ్యాడు. ఆ హీరో నటంచిన సినిమా ఒకటి త్వరలో రిలీజ్ కాబోతోంది. ప్రచారకార్యక్రమాలు కూడా ప్రారంభించారు. ఆ సినిమా నిర్మాత కూడా బచ్చా ఏం కాదు. దశాబ్దాల క్రితం ఆయన భారీ హిట్స్ ఇస్తున్నప్పుడు వీళ్ళంతా బచ్చాలు.
ఇలాంటి నేపథ్యంలో "సినిమా థియేటర్స్ బంద్" అన్న ప్లాన్ ఎలా వేయగలుగుతారు? ఎలా ప్రకటించగలుగుతారు?
ఇప్పుడేమైంది?
ఇప్పుడే ఏమైంది?
ఇంక చాలా ఉంది...
- మనోహర్ చిమ్మని
100 Days, 100 Posts. 32/100.
100 Days, 100 Posts. 32/100.
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani