గురువుగారు దర్శకరత్న దాసరి నారాయణరావు గారి దగ్గర ఒకే ఒక్క సినిమాకు డైరెక్షన్ డిపార్ట్‌మెంట్లో అసిస్టెంట్‌గా (బయటినుంచి అబ్జర్వర్‌గా) సుమారు ఒక 4 నెలపాటు పనిచేశాను.
అంత తక్కువ సమయంలో దాసరి గారి దర్శకత్వ శాఖలో నేను నేర్చుకున్నది చాలా తక్కువ.
కాని, ఒక గొప్ప దర్శకుడిగా వారిని అతి దగ్గర నుండి నేను అధ్యయనం చేసింది మాత్రం చాలా ఎక్కువ.
కాని, ఒక గొప్ప దర్శకుడిగా వారిని అతి దగ్గర నుండి నేను అధ్యయనం చేసింది మాత్రం చాలా ఎక్కువ.
"ఒక హిట్ ఇచ్చి కలుద్దాంలే" అన్న సిల్లీ మైండ్‌సెట్‌తో దాసరి గారు బ్రతికున్నప్పుడు మళ్ళీ కలవలేకపోయాను. కాని, ఇప్పుడనిపిస్తోంది... నేను తప్పు చేశానని.
"మనోహర్, హిట్టూ ఫట్టూ తర్వాత... డైరెక్టర్‌గా నువ్వు అసలు ఒక సినిమా తీయడమే నీ పెద్ద సక్సెస్. మిగిలిందంతా బోనస్. డైరెక్టర్ కాకముందే స్క్రిప్ట్ రైటింగ్ మీద నువ్వు అంత మంచి 'నంది అవార్డ్' బుక్ రాశావు చూడు, అది కూడా నీ సక్సెసే. నువ్వలాంటి ఫీలింగ్స్ పెట్టుకోవద్దు. వచ్చి కలుస్తూవుండు. ఈసారి నీ సినిమా నేనే రిలీజ్ చేస్తాను" అని కొంచెం సీరియస్‌గానే చెప్పారు.
కాని, నేను వారిని మళ్ళీ కలవలేకపోయాను.
కాని, నేను వారిని మళ్ళీ కలవలేకపోయాను.
గురువుగారు అంత త్వరగా నిష్క్రమించాల్సింది కాదు. వారు ఇప్పుడున్నట్టయితే, నా ఇప్పటి మైండ్‌సెట్‌తో... నో డౌట్... వారిని తరచూ కలిసేవాడిని.
కట్ చేస్తే -
నిజంగా... గురువుగారికి వందనం, అభివందనం!
నిజంగా... గురువుగారికి వందనం, అభివందనం!
ఒక జీవిత కాలంలో 151 సినిమాలు డైరెక్ట్ చెయ్యటం అంత ఈజీ కాదు. అది దాసరి గారు చేసి చూపించారు.
వీటిలో 50 కి పైగా సినిమాలు ప్రొడ్యూస్ చేశారు, 60 కి పైగా సినిమాల్లో నటించారు, అంతకు ముందు ఘోస్ట్ రైటర్‌గా ఒక 25 సినిమాలకు పనిచేశారు, 1000 పాటలు రాశారు, కొరియోగ్రఫీ చేశారు, కెమెరామన్‌గా చేశారు. సినిమారంగంలో ఆయన ఎన్నెన్నో టచ్ చేశారు.
ఫిలిం నెగెటివ్ వాడిన ఆ రోజుల్లోనే... 1980 లో అనుకుంటాను... గురువుగారు ఒకే ఒక్క సంవత్సరంలో 15 సినిమాలు రిలీజ్ చేశారు. వాటిలో 90% హిట్స్, సూపర్ హిట్స్.
ఫిలిం నెగెటివ్ వాడిన ఆ రోజుల్లోనే... 1980 లో అనుకుంటాను... గురువుగారు ఒకే ఒక్క సంవత్సరంలో 15 సినిమాలు రిలీజ్ చేశారు. వాటిలో 90% హిట్స్, సూపర్ హిట్స్.
ఇప్పటి డిజిటల్ ఫిలిం మేకింగ్ యుగంలో - మనం మన జీవితకాలంలో - కనీసం ఒక 10 సినిమాలైనా చెయ్యకపోతే వేస్ట్ అని నాకనిపిస్తోంది.
గురువుగారి జయంతి సందర్భంగా వారికి నా వినమ్ర నివాళులు.
- మనోహర్ చిమ్మని
100 Days, 100 Posts. 5/100
100 Days, 100 Posts. 5/100
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani