ఇంకెపుడైనా ఇలా అనుకున్నానా?
---చరణం 1-----
నీ ఊపిరి ఉత్సహాలేవీ?
నీ చూపుల సంద్రాలేవీ?
ఆ నడకల నాజూకేదీ?
ఆ మాటల ముత్యాలేవీ?
భూమీ-భూమీ-భూమీ-భూమీ
నిజంగా నువ్వేనా - నిజంగా ఇది నువ్వేనా?
---చరణం 2------
అనుక్షణం ఒక ఆనందం కదా?
ప్రతిక్షణం అది పసిహృదయం కదా?
నిమిషం ఆగని ప్రవాహం కదా?
అనునిమిషం మెరిసిన ఇంద్రధనుస్సు కదా?
భూమీ-భూమీ-భూమీ-భూమీ
నిజంగా నువ్వేనా - నిజంగా ఇది నువ్వేనా?
---
అసలెపుడైనా ఇలా కలగన్నానా?
ఇంకెపుడైనా ఇలా అనుకున్నానా?
- మనోహర్ చిమ్మని
100 Days, 100 Posts. 26/100.
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani