Tuesday, 20 May 2025

18 నిమిషాల్లో లిరిక్స్, 45 నిమిషాల్లో AIలో పూర్తి సాంగ్!


ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్లో ఉన్న మా రోడ్-క్రైమ్-థ్రిల్లర్ #EG సినిమా కోసం మూడో పాట పెట్టాలనుకున్నాం. చాలా రోజులుగా పెండింగ్ పడుతూ వచ్చిన ఈ పాటను చివరికి ఈరోజు మా యో ఆఫీసులో నేనూ, మా ఎడిటర్ నాగ్ సృష్టించేశాం. 

ముందు నా ఓయూ కవిమిత్రుల్ని అడిగి, నాకు నచ్చినట్టు పాట రాయించుకుందామనుకున్నాను. అది ఇప్పట్లో తెగదు అనిపించి, ఆ ప్రయత్నం విరమించుకొన్నాను. 

lekhini.org ఓపెన్ చేసి అప్పటికప్పుడు ఒక పాట టైప్ చేసిచ్చాను. 

సరిగ్గా 18 నిమిషాలు పట్టింది. 

నేను కవిని, గొప్పగా రాశాను అని చెప్పను. కాని, మా సినిమాకు కావాల్సిన మాంటేజ్ పాట మాత్రం ఖచ్చితంగా అదే.

మాక్కావల్సింది రాయగలిగాను. వచ్చింది.  

కట్ చేస్తే -  

థాంక్స్ టు AI... ఇంకో 45 నిమిషాల్లో మా నాగ్ ఒక అద్భుతమైన మాంటేజ్ సాంగ్ క్రియేట్ చేశాడు.    

మొన్నటిదాకా, ముందు ఫస్ట్ లిరికల్ వీడియోగా ఫోక్ సాంగ్ రిలీజ్ చేద్దాం అనుకున్నాం. కాని, ఇప్పుడు ముందు ఈ పాటే రిలీజ్ చేస్తున్నాం. తర్వాత ఇంగ్లిష్ లిరికల్, ఆ తర్వాత చివర్లో ఫోక్ లిరికల్ రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యాము. 

- మనోహర్ చిమ్మని 

100 Days, 100 Posts. 27/100.

No comments:

Post a Comment

Thanks for your time!
- Manohar Chimmani