సోషల్ మీడియా లేని కాలంలోనే, 2007లో, నా రెండో సినిమా "అలా" ఈ పధ్ధతిలోనే తీశాను.
2011లో ఆర్జీవీ "దొంగల ముఠా" కూడా ఇదే పద్ధతిలో తీశాడు.
కోపరేటివ్ ఫిలిం మేకింగ్ పద్ధతిలో - పాతవాళ్లయినా, కొత్తవాళ్లయినా... ఆర్టిస్టులు, టెక్నీషియన్లకు రెమ్యూనరేషన్ ముందు ఇవ్వటం అనేది ఉండదు.
సినిమా పూర్తయ్యి, రిలీజయ్యి, లాభాలు వచ్చాకే ఆ లెక్కలు! దీనికి ఒప్పుకున్నవాళ్లే సినిమాలో పనిచేస్తారు!!
సినిమాలో పనిచేసే ప్రతి ఒక్కరి ఇన్వెస్ట్‌మెంట్ కంట్రిబ్యూషన్ ఏదో ఒక రూపంలో ఎంతో కొంత ఉంటుంది.
ఎందుకంటే - దీనికి ప్రొడ్యూసర్ ఉండడు.
ఇండిపెండెంట్ ఫిలిం.
ఎందుకంటే - దీనికి ప్రొడ్యూసర్ ఉండడు.
ఇండిపెండెంట్ ఫిలిం.
అనుకున్న బడ్జెట్‌ను నలుగురయిదుగురు లైక్‌మైండెడ్ ఇన్వెస్టర్స్ తలా కొంత షేర్ చేసుకుంటారు.
సినిమా బడ్జెట్ కోటి కావచ్చు, రెండు కోట్లు కావొచ్చు. మేం పూల్ చేసుకున్న ఆ బడ్జెట్‌ను మేకింగ్‌కు, ప్రమోషన్‌కు మాత్రమే వాడతామన్నమాట!
నో కాల్ షీట్స్.
నో టైమింగ్స్.
అంతా రెనగేడ్ ఫిల్మ్ మేకింగ్.
గెరిల్లా ఫిల్మ్ మేకింగ్.
నో టైమింగ్స్.
అంతా రెనగేడ్ ఫిల్మ్ మేకింగ్.
గెరిల్లా ఫిల్మ్ మేకింగ్.
చాలా మంచి కాన్‌సెప్ట్ ఇది. ముఖ్యంగా చిన్న బడ్జెట్ సినిమాలకు సంబంధించి మాత్రం ఇదే చాలా చాలా కరెక్టు.
భారీ బ్యానర్స్, స్టార్స్ లేని ఇండిపెండెంట్ సినిమాల విషయంలో, ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ ఈ ఒక్క పద్ధతే ఎక్కువగా విజయవంతంగా నడుస్తోంది.
భారీ బ్యానర్స్, స్టార్స్ లేని ఇండిపెండెంట్ సినిమాల విషయంలో, ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ ఈ ఒక్క పద్ధతే ఎక్కువగా విజయవంతంగా నడుస్తోంది.
హాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా, ఈ పద్ధతిలో తీసిన ఎన్నో సినిమాలు అద్భుత విజయం సాధించాయి.
ఈ సినిమాలు మంచి బజ్ క్రియేట్ చేస్తాయి, మంచి బిజినెస్ చేస్తాయి.
ప్రొవైడెడ్, సరైన స్ట్రాటజీతో చేస్తే!
ఇప్పుడు నేను చేస్తున్న రెండు ఫీచర్ ఫిలిమ్స్ ఈ పద్ధతిలో చేస్తున్నవే. ఈ రెండు సినిమాల ప్రిప్రొడక్షన్ వర్క్ కూడా ఇప్పుడు ఏక కాలంలో జరుగుతోంది.
కట్ చేస్తే -
చిన్నమొత్తంలో అయినా సరే... ఇన్వెస్ట్ చేసి, ఫీల్డులోకి రావాలనుకొనే ప్యాషనేట్ ఇన్వెస్టర్‌లకు కూడా వెల్‌కమ్!
ఈ సిస్టమ్‌లో నాతో కలిసి పనిచేయాలనుకొనే కొత్త ఇన్వెస్టర్లు, ఆర్టిస్టులు, టెక్నీషియన్లు మీ పూర్తి వివరాలు తెలుపుతూ నాకు ఈమెయిల్ చెయ్యొచ్చు: richmonkmail@gmail.com.
"It's a kind of fun to do the impossible!"
- Walt Disney
- మనోహర్ చిమ్మని
100 Days, 100 Posts. 24/100.
100 Days, 100 Posts. 24/100.
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani