"ఈ కథ లాస్ట్ పార్ట్ పోస్ట్ చేశాక "సముద్రం నాకిష్టం" పేరుతో ఒక కథాసంకలనం వేస్తున్నారా?" అని.
ఈ ఆలోచన నాకు ఇంతకుముందు రాలేదు.
కాని, మరేం ఆలోచించకుండా చెప్పాను ప్రదీప్‌కి...
"ఇదీ, ఇంకో 11 కథలు కలిపి కథాసంకలనం వేద్దాం ఆగస్టులో" అని.
"ఇదీ, ఇంకో 11 కథలు కలిపి కథాసంకలనం వేద్దాం ఆగస్టులో" అని.
కట్ చేస్తే -
నా యూనివర్సిటీరోజుల నుంచీ కథలు రాస్తున్నాను. కాని, ఎప్పుడూ రచనను నేను నా ప్రధానమైన వ్యాపకంగానో, హాబీగానో తీసుకోలేకపోయాను.
విచిత్రం ఏంటంటే, రాయడమే నాకు అత్యంత ఇష్టమైన పని.
నేను బాగా రాయాలని, కన్సిస్టెంట్గా రాయాలని నాకు అప్పుడప్పుడూ గుర్తుచేసే మిత్రుడు గుడిపాటి. ఈ విషయంలో నన్ను దాదాపు చెడామడా తిట్టిన ఫ్రెండ్ ఇంకొకరున్నారు.
"అసలు రైటింగే మీ ఫస్ట్ క్రియేటివ్ వెపన్. ఎందుకని ఆవైపు మీరు అశ్రద్ధ చేస్తారు?" అని చాలారోజుల కిందటే నాకు చెప్పిన మొట్టమొదటి వ్యక్తి మా ప్రదీప్.
మనం ఏవేవో పనుల్లో ఇరుక్కుపోయి బిజీ బిజీ అనుకుంటాం కాని, ఎవ్వరికీ అంత బిజీ ఏం ఉండదు.
ఈ విషయంలో నేనైనా, ఇంకెవ్వరైనా గుర్తుకు తెచ్చుకోవాల్సిన బెస్ట్ సెల్లర్ ఇంగ్లిష్ రచయిత్రి ఒకరున్నారు. ఆమె వందల్లో నవలలు రాశారు, మిలియన్లలో కాపీలు అమ్మారు. ఆమె రచనలు వివిధ ప్రపంచభాషల్లోకి అనువాదమయ్యాయి. సినిమాలు కూడా తీశారు. 2000లో, ఆమె చనిపోయిన తన 98వ ఏట కూడా రాస్తూనే చనిపోయింది.

ఆ రచయిత్రి పేరు బార్బరా కార్ట్లాండ్.
Thanks to Pradeep for pushing me to write this post first thing in the morning — and for sparking a lovely idea.
Thanks to Pradeep for pushing me to write this post first thing in the morning — and for sparking a lovely idea.
- మనోహర్ చిమ్మని
100 Days, 100 Posts. 34/100.
100 Days, 100 Posts. 34/100.
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani