"They no longer want to go to the cinema, and would rather watch movies on streaming services... That they’d like to watch movies at home.”
- Netflix CEO Ted Sarandos
నెట్‌ఫ్లిక్స్ సీఈవో ఈ మాట అనడం వెనుక ఎంతో అధ్యయనం ఉంటుంది. ఏదో తోచింది అనడానికి ఈయన థర్డ్ గ్రేడ్ ఫిలిం క్రిటిక్ కాదు.
ఒక పెద్ద ఎంటర్‌టైన్మెంట్ బిజినెస్ సామ్రాజ్యానికి సారథి.
సో, సినిమా థియేటర్లకు ప్రేక్షకుల డ్రాప్ అనేది ఒక్క ఇండియాలోనే కాదు. ప్రపంచమంతా ఉంది.
అన్నిచోట్లా ఇదే మార్పు.
మామూలు ల్యాండ్‌లైన్ ఫోన్ నుంచి మొబైల్ ఫోన్‌కు, మొబైల్ ఫోన్ నుంచి స్మార్ట్ ఫోన్‌కు ఎలా అయితే మారుతూవచ్చామో, ఇదీ అలాంటిదే. సాంకేతిక అభివృద్ధి నేపథ్యంగా మనిషి జీవనశైలిలో వస్తున్న మార్పును ఎవరైనా సరే ఆహ్వానించక తప్పదు.
కట్ చేస్తే -
ఓటీటీలకు ప్రేక్షకులున్నారు. కంటెంట్ కావల్సినంత ఉంది. వెబ్ సీరీస్‌లు, ఒరిజినల్స్ రూపంలో కొత్త కంటెంట్ వాళ్లే సొంతంగా క్రియేట్ చేసుకొంటున్నారు. సినిమాలు వాళ్లకిప్పుడు ఒక ఆప్షన్ మాత్రమే.
అలాగని, సినిమాలు కూడా ఎక్కడికీ పోవు. అవి ప్రదర్శించే ప్లాట్‌ఫామ్స్ మాత్రమే మారుతూ ఉంటాయి.
ఇండియాలో భారీ ఫ్యాన్స్ బేస్ ఉన్న కొందరు హీరోల సినిమాలు, కొన్ని భారీ బడ్జెట్ విజువల్ వండర్స్ తప్ప, మిగిలిన సినిమాలన్నీ క్రమంగా థియేటర్‌కు వెళ్ళిచూడాలనుకునే ఆలోచన నుంచి దూరమవుతాయి.
ఇక మీదట ఇంకా డ్రాప్ అవుతుంది.
మిషన్ ఇంపాజిబుల్స్, ట్రిపుల్ ఆర్స్ ప్రతి నెలా ఉండవు కదా? క్రమంగా ఈ రేంజ్ సినిమాల లెక్కలు కూడా తప్పుతాయి. అంచనాలు రీచ్ కాలేరు.
ఏదో మాయ చెయ్యటం తప్ప, అసలు పెట్టిన డబ్బులే రావు. ప్రపంచవ్యాప్తంగా చాలా భారీ బడ్జెట్ సినిమాల విషయంలో ఇప్పటికే ఇది జరుగుతోంది.
ఏదో మాయ చెయ్యటం తప్ప, అసలు పెట్టిన డబ్బులే రావు. ప్రపంచవ్యాప్తంగా చాలా భారీ బడ్జెట్ సినిమాల విషయంలో ఇప్పటికే ఇది జరుగుతోంది.
ఈ నేపథ్యంలో - థియేటర్స్ కావచ్చు, ఓటీటీ కావచ్చు - ప్రదర్శించే ప్లాట్‌ఫామ్ ఏదైనా కానీ, పరిమిత బడ్జెట్‌లో నిర్మితమయ్యే కంటెంట్ ఉన్న చిన్న బడ్జెట్ సినిమాలకు మాత్రమే ఎప్పుడూ ఎలాంటి సమస్య ఉండదు.
మీరు గమనించారా... దాదాపు ప్రతి పెద్ద బ్యానర్ ద్వారా ఇప్పుడు చిన్న బడ్జెట్ సినిమాలు కూడా రెగ్యులర్‌గా చేస్తున్నారు.
నిజానికి ఎప్పుడైనా, ఎవరినైనా కాపాడే సినిమాలు... కొత్త ఆర్టిస్టులు, టెక్నీషియన్లకు లైఫ్ ఇచ్చే సినిమాలు... చిన్న బడ్జెట్ సినిమాలే!
- మనోహర్ చిమ్మని
100 Days, 100 Posts. 22/100.
100 Days, 100 Posts. 22/100.
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani