అందమైన ముఖచిత్రంతో పాలపిట్ట మ్యాగజైన్ హౌజ్ నుంచి ఈమధ్యే విడుదలైన "పాలపిట్ట కథ-2025" కొత్తగా ఉంది. మా ఆలిండియా రేడియో లైబ్రరీలో నేను చదివిన ఒకప్పటి ఇంగ్లిష్ "కథ" సీరీస్ బుక్స్ గుర్తుకొచ్చాయి.
ఎన్నిక చేసిన 31మంది కథకులు రాసిన 31 కొత్తకథలు ఇందులో ఉన్నాయి. అన్నీ వేటికవే విలక్షణమైన కథావస్తువు, విభిన్నమైన శిల్పంతో కూడిన కథలు. ఇలాంటి ఒక కొత్త ఆలోచన చేసి, వెంటనే ఆచరణలో పెట్టిన "పాలపిట్ట" మ్యాగజైన్ ఎడిటర్, నా మిత్రుడు గుడిపాటికి అభినందనలు.
272 పేజీలు, 200 రూపాయలు. పాలపిట్ట బుక్స్, మలక్‌పేట్ (9848787284), నవోదయ బుక్ హౌజ్, కాచిగూడ (9000413413) లకు ఆర్డర్ పెట్టి కాపీలు తెప్పించుకోవచ్చు.
కట్ చేస్తే -
సినిమాలు, ఇంకో అరడజన్ ఫ్రీలాన్సింగ్ పనుల్లో మునిగిపోయి, ఊపిరాడక కొట్టుకుపోతున్న నాచేత చాలా కాలం తర్వాత మళ్ళీ కథ రాయించిన క్రెడిట్ గుడిపాటిదీ, ఇంకో ఫ్రెండుది కూడా. వారిద్దరికీ థాంక్స్.
"పాలపిట్ట-2025"లో నా కథ "సముద్రం నాకిష్టం" కూడా ఉంది.
I don’t write to impress. I write to undress the soul—mine first.
I don’t write to impress. I write to undress the soul—mine first.
- మనోహర్ చిమ్మని
100 Days, 100 Posts. 10/100.
100 Days, 100 Posts. 10/100.
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani