కామేశ్వరరావు దామరాజు తెలుగు సాహిత్యంలో పరిశోధన చేసి పి హెచ్ డి పట్టా అందుకున్న డాక్టర్. మంచి భావుకత్వం ఉన్న కవి, రచయిత, సాహితీ విమర్శకుడు కూడా.
చిక్కడపల్లి అరోరా డిగ్రీ కాలేజ్ లో లాంగ్వేజెస్ డిపార్ట్‌మెంట్ హెడ్. అదొక్కటే కాదు. అరోరా కాలేజ్‌కు సంబంధించిన ఏ సాంస్కృతిక కార్యక్రమమో, ఈవెంటో జరగాలన్నా మన కామేశ్వరరావు లేకపోతే నడవదు.
కట్ టూ సినిమారంగం -
కామేశ్వరరావు మంచి స్క్రిప్ట్ రచయిత కూడా. అయితే - దానిమీద ఏకాగ్రత చూపించి, ఏదయినా సాధించే అవకాశాన్ని మాత్రం క్రియేట్ చేసుకోలేకపోయాడు.
నాకు తెలిసి ఇలా చాలామంది విషయంలో జరుగుతుంది. ముందు బ్రెడ్ అండ్ బట్టర్. తర్వాతే .. ఏ క్రియేటివిటీ అయినా.
సినిమా ఫీల్డు పూర్తిగా వేరే.
ఎవరయినా .. ఏ చిన్న అవకాశం అయినా ఇస్తూ .. పనికోసం పిలుస్తున్నారూ అంటే .. ఎక్కడున్నా వెంటనే వచ్చి వాలిపోవాల్సి ఉంటుంది.
ఎట్‌లీస్ట్ దానికంటూ కొంత సమయం విధిగా కెటాయించాల్సి ఉంటుంది. కెటాయించి తీరాలి. ఏ పనుల్లో ఉన్నా, ఎలా ఉన్నా.
ఫీల్డులో పరిస్థితులు అలా ఉంటాయి.
అయితే, అలాంటి అవకాశం కామేశ్వరరావుకు లేకపోవడంవల్ల స్క్రిప్ట్ రచయితగా ఇప్పటివరకయితే అంతగా ప్రయత్నించలేదు. రాణించలేదు. కానీ, రాయగల సత్తా అతనిలో చాలా ఉంది.
కామేశ్వరరావు మంచి పాటల రచయిత కూడా. పైన చెప్పిన కారణం వల్లనే, లిరిక్ రైటర్‌గా కూడా పూర్తిస్థాయిలో ఏమీచేయలేకపోయాడు. "ముద్దు" అనే ఒక సినిమాకు మాత్రం మొత్తం పాటలు రాశాడు. ఎన్నో ప్రైవేట్ ఆల్బమ్‌స్‌కు రాశాడు.
ఉస్మానియా యూనివర్సిటీలో నా ఎమ్ ఏ క్లాస్‌మేట్ కూడా అయిన ఈ "కాముడు"కి, చాలా గ్యాప్ తర్వాత, నా రెండో చిత్రం "అలా"లో పాటలు రాసే అవకాశం నేనిచ్చాను. ఈ చిత్రంలో .. రష్యన్, ఇంగ్లిష్, హిందీ, తెలుగు భాషల్లో ఉండే ఒక్క ర్యాప్ టైటిల్ సాంగ్ మాత్రం నేను రాశాను. "అలా" చిత్రంలోని మిగిలిన అన్ని పాటలూ మా కాముడు చాలా బాగా రాశాడు.
"అలా" చిత్రం కోసం కామేశ్వరరావు రాసిన పాటలన్నీ యూట్యూబ్‌లో చూడొచ్చు.
వాటన్నిటిలోకీ, "బాడీ చూస్తే బ్రాడీపేట" అనే ఐటమ్ సాంగ్ పిచ్చి హైలైట్ అనుకోండి. అది వేరే విషయం.
కట్ టూ యాక్టర్ కామేశ్ -
కామేశ్‌లో మంచి నటుడు కూడా ఉన్నాడని నాకు బాగా తెలుసు. రచయితగా, పాటల రచయితగా కంటే .. నటుడిగానే కామేశ్ వెండితెరమీద బాగా సక్సెస్ అవుతాడని చాలా రోజులనుంచి నా గట్టి నమ్మకం.
కట్ చేస్తే -
మొన్న స్విమ్మింగ్‌పూల్ లో .. ఒకే ఒక్క సీన్‌లో ఫ్లాష్‌లా కనిపించే ఒక జ్యోతిష్కుని పాత్రలో కామేశ్‌ను తొలిసారిగా వెండితెరకు పరిచయం చేశాను.
ఇంక చెప్పేదేముంది. సూపర్ యాక్టింగ్!
స్విమ్మింగ్‌పూల్ తర్వాత వెంటనే ఒక అగ్రదర్శకుని చిత్రంలో మరో చిన్న క్యారెక్టర్ వేసే అవకాశం వచ్చింది. వేసేశాడు.
ఇక ఇప్పుడు నెమ్మదిగా .. ఒక యాక్టర్‌గా .. ఆ వైపు బిజీ అవుతున్నాడు.
అతనికిప్పుడు తను పనిచేస్తున్న అరోరా కాలేజ్ యజమాన్యం, ప్రిన్సిపాల్, స్టాఫ్, స్టుడెంట్స్ అందరి నుంచి కూడా మంచి ప్రోత్సాహం ఉంది.
జస్ట్ ఒక్క బ్రేక్ చాలు. తెలుగులో ఓ మంచి సపోర్టింగ్ ఆర్టిస్ట్‌గా నిలబడిపోయే సత్తా ఉన్న నటుడు కామేశ్. అతి త్వరలోనే నా మిత్రుడు కామేశ్‌కు ఆ బ్రేక్ కూడా రావాలని ఆశిస్తున్నాను. వస్తుందని నా నమ్మకం.

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani