"నేను చనిపోయిన తర్వాత కూడా బ్రతకాలంటే ఎలా?"
ఈ రొటీన్ చదువులు, ఉద్యోగాలు కాదు. ఇంకేదో చెయ్యాలి, ఇంకేదో కావాలి అన్న ఆలోచనలోంచి పుట్టిందా ప్రశ్న.
ఆలోచిస్తే కళ్లముందు మూడే మూడు ఫీల్డులు కనిపించాయి - క్రికెట్, సినిమా, రాజకీయాలు. ఈ మూడిట్లో మొదటిది, చివరిది మనకు కష్టం అనుకొని సినిమాను ఎన్నుకున్నాడో యువకుడు.
అతనే రుద్రాక్ష్.
పుట్టింది వరంగల్ జిల్లా, జనగాం దగ్గరలోని ఒక ఊళ్లో అయినా - పెరిగిందీ, డిగ్రీదాకా చదివిందీ మాత్రం మహారాష్ట్రలోని భీవండీలో.
కట్ చేస్తే -
భీవండీ-టూ-ముంబై చాలా దగ్గర. ఫస్ట్ స్టెప్ అంటూ ఒకటి వెయ్యాలి కాబట్టి - వెంటనే ముంబైలోని ఓ ఫోటోగ్రాఫర్ దగ్గర అసిస్టెంట్‌గా చేరిపోయాడు రుద్రాక్ష్.
అదీ ప్రారంభం.
సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకముందే సినిమా కష్టాలు మొదలయ్యాయి రుద్రాక్ష్‌కు. ఓ రోజు టికెట్ లేకుండానే ముంబై నుంచి ట్రెయిన్‌లో ఇంటికి బయలుదేరాల్సి వచ్చింది. రుద్రాక్ష్ జీవితంలో అదే ఒక పెద్ద ట్విస్ట్‌కి కారణమయింది.
ఆ రోజు టికెట్ లేని ప్రయాణం సందర్భంగా కలిసిన ఓ మిత్రుడు, హైద్రాబాద్‌లో ఉన్న అనిల్ అనే ఓ పబ్లిసిటీ డిజైనర్‌కు రుద్రాక్ష్‌ను కనెక్ట్ చేశాడు.
అంతే. చేతిలో అల్ఫా సూట్‌కేస్‌తో హైద్రాబాద్‌లో దిగిపోయాడు రుద్రాక్ష్.
కట్ చేస్తే -
ఫ్రెండ్ రూంలో షెల్టర్. పబ్లిసిటీ డిజైనర్ ఆఫీస్‌లో పరిచయాలు. రామానంద్ గారి దగ్గర నటనలో శిక్షణ ..
తనతోపాటు నటనలో శిక్షణ పొందుతున్న ఓ కుర్రాడి ఫోటో షూట్ కోసం బంజారాహిల్స్‌లో ఉన్న ఓ ఫోటోస్టూడియోకు వెళినప్పుడు, అక్కడ రుద్రాక్ష్‌కు ఓ ఫోటోగ్రాఫర్ పరిచయమయ్యాడు. అప్పటి ఆ ఫోటోగ్రాఫర్ మరెవరోకాదు. ఇప్పటి హీరో కృష్ణుడు!
ఇద్దరూ మంచి మిత్రులయ్యారు. తనకు సంబంధించిన మంచిచెడులన్నింటినీ నిస్సంకోచంగా "గురూజీ" అంటూ కృష్ణుడి దగ్గర షేర్ చేసుకుంటాడు రుద్రాక్ష్. అదీ వారిద్దరి స్నేహం.
కట్ చేస్తే -
నెట్ వర్క్ .. పరిచయాలు .. వేట ..
అన్నీ ఒక్క ఛాన్స్ కోసం. ఒకే ఒక్క ఛాన్స్ కోసం.
చివరికెలాగో ఆర్టిస్ట్‌గా ఫస్ట్ ఛాన్స్ కొట్టేశాడు రుద్రాక్ష్. ఆ సినిమా పేరు "రిలాక్స్". తర్వాత హైద్రాబాద్ నవాబ్స్, ఎఫ్ ఎమ్, బొమ్మరిల్లు, పరుగు వంటి సినిమాల్లో యాక్ట్ చేశాడు. పరిచయాలు పెరిగాయి.
తను పరుగు చిత్రంలో యాక్ట్ చేస్తున్నపుడు, ఆ చిత్రానికి అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేసిన బుజ్జి (పరశురామ్) తన డెబ్యూ సినిమా "యువత" లో రుద్రాక్ష్‌కు అద్భుతమైన రోల్ ఇచ్చాడు. తర్వాత మధుర శ్రీధర్ బ్యాక్ బెంచ్ స్టుడెంట్, ఆర్ జి వి రక్తచరిత్ర సినిమాల్లో కూడా మంచి రోల్స్‌లో నటించాడు రుద్రాక్ష్.
"నీలో ఓ 30 శాతం రఘువరన్ ఉన్నాడు" అని మధుర శ్రీధర్ మెచ్చుకోవడం; రక్తచరిత్రలోని ఒక సీన్లో తన నటనను చూసి, షాట్ అయిపోగానే ఆర్ జి వి తనని హగ్ చేసుకోవడం ఒక ఆర్టిస్టుగా రుద్రాక్ష్ మర్చిపోలేని అనుభూతులు.
"మళ్లీ మళ్లీ ఇది రాని రోజు" దర్శకుడు క్రాంతిమాధవ్ కూడా రుద్రాక్ష్‌కు మంచి మిత్రుడు. "నీ అసలు లక్ష్యం మర్చిపోతున్నావేమో చూడు!" అని ఒకసారి క్రాంతిమాధవ్ రిమైండ్ చేయడంతో మళ్లీ ఆలోచనలో పడిపోయాడు రుద్రాక్ష్.
కట్ చేస్తే -
వెంకట్ గోపు డైరెక్షన్‌లో ఇప్పుడు హీరోగా తన తొలి చిత్రం "మనీప్లాంట్" లో నటిస్తున్నాడు రుద్రాక్ష్. ఒక షెడ్యూల్ పూర్తయింది కూడా.
హీరోగా తన షూటింగ్ షెడ్యూల్ ప్రారంభం కావడానికి కేవలం కొద్దిరోజుల ముందు - ది సేమ్ రుద్రాక్ష్, "స్విమ్మింగ్‌పూల్"లో ఓ ప్రత్యేకమైన రోల్‌లో నటించడం విశేషం!

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani