ఈ పిచ్చిని సైకాలజీలో "మాస్ హిస్టీరియా" అంటారన్నట్టు ఎక్కడో చదివాను.
నో డౌట్ .. ఇప్పటివరకు దేశంలో ఏ సినిమాకూ పెట్టనంత బడ్జెట్‌తో ఈ సినిమాని తీశారు. సుమారు రెండున్నరేళ్లపాటు వందలాదిమంది కష్టపడ్డారు. ఎన్నో రిలీజ్ డేట్స్ మార్పు తర్వాత, చివరికి రేపు సినిమా రిలీజవుతోంది.
ఎంతో ఎంతో హైప్ మధ్య!
తెలుగు, హిందీ, తమిళం, మళయాళంతో పాటు .. మొత్తం ఓ పది భాషల్లో - ప్రపంచవ్యాప్తంగా సుమారు నాలుగున్నరవేల థియేటర్స్‌లో రిలీజవుతున్నట్టు విన్నాను.
180 కోట్లు అని కొందరంటారు. 280 కోట్లు అని మరికొందరంటారు. మొత్తానికి బాగానే పెట్టారు.
కట్ టూ ప్రి-రిలీజ్ స్పాయిలర్స్ -
మధ్యాహ్నం తర్వాత, ఇవాళ ఒక స్టూడియోలో ఓ చిన్న యాడ్ పనిమీద వెయిట్ చేస్తూ ఉన్నపుడు - నా మొబైల్ తీసి, అలా కాసేపు బ్రౌజ్ చేశాను.
ఎవరో లేడీ 2/5 పాయింట్స్ ఇస్తూ, బాహుబలికి అంత సీన్ లేదంటూ బాంబు పేల్చింది. అది యు ఎ ఇ నుంచి.
తర్వాత - యాక్చువల్‌గా రేపు విడుదల కాబోతున్న బాహుబలి మీద వరసపెట్టి ఎన్నెన్ని న్యూస్‌లు, వ్యూస్‌లు చెప్పనక్కర్లేదు.
సైమన్ బర్చ్ కాపీ అంటూ రెండు పోస్టర్లను కంపేర్ చేస్తూ ఆన్‌లైన్‌లో వందలాది పిక్స్ పెట్టారు. వాటిల్లో ఒకదాన్ని నేనిక్కడ బ్లాగ్‌లో పెట్టాను.
కన్నడలో డాక్టర్ రాజ్‌కుమార్ 'మయూర' సినిమాకు కాపీ ఈ బాహుబలి అని కూడా వార్తలున్నాయి ఆన్‌లైన్‌లో. కొంతమంది వీరాభిమానులు - అసలు బాహుబలి షో అంటూ ఇంకా పడనే లేదు .. ఇదంతా ఫేక్ అంటున్నారు.
ఒక్క సెన్సార్‌కు మాత్రమే చూపించారట. వాళ్లు కూడా పూర్తిస్థాయి సినిమా చూళ్లేదట .. సెన్సార్ వాళ్లకు చూపించినప్పుడు బ్యాక్‌గ్రౌండ్ ఏదో ఉండదట!!
ఇంతకంటే విచిత్రం ఇంకేముండదు.
థియేటర్‌లో ప్రేక్షకులు ఏ సినిమానయితే చూస్తారో, ఇంక మార్పులు, చేర్పులు ఉండని ఆ ఫైనల్ కాపీనే సెన్సార్ వారికిచ్చి సెన్సార్ చేయించుకుంటారన్నది కామన్‌సెన్స్! ఈ మాత్రం తెలవకుండా ఏవో వెర్రివెంగళప్ప రాతలు ఎందుకు రాస్తారో అర్థం కాదు.
ఏది ఏమయినా - రేపు రిలీజ్ కాబోతున్న బాహుబలి - అన్ని కోట్లు పెట్టి, అన్ని రోజులు పనిచేసి, ఎంతో హైప్ చేసిన రేంజ్‌లో .. సక్సెస్ సాధించాలని ఆశిద్దాం.
బెస్టాఫ్ లక్, రాజమౌళి అండ్ టీమ్!

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani