నిన్న ఫేస్‌బుక్ లో చూశాను. క్రిమినల్స్ రిలీజ్ ఎప్పుడు అని ఓ ఫ్యాన్ అడిగిన ప్రశ్నకు "జూలై నెలాఖరుకు ఉంటుంది .. బిఫోర్ మై బర్త్‌డే" అని చెప్పాడు అఖిల్ కార్తీక్.
అఖిల్ కార్తీక్ బర్త్‌డే జూలై 30. అంటే, ఆలోపే క్రిమినల్స్ రిలీజ్ ఉంటుందన్నమాట!
కొంచెం అటూఇటూగా స్విమ్మింగ్‌పూల్ రిలీజ్ కూడా అప్పుడే ఉండే అవకాశం ఉంది.
స్విమ్మింగ్‌పూల్ సినిమాను తెలుగుతోపాటు తమిళంలో కూడా ఒకేసారి రిలీజ్ చేసే దిశలో చర్చలు ప్రస్తుతం చివరి స్టేజ్ లో ఉన్నాయి. అది కూడా ఉన్నట్టయితే - తమిళంలో డబ్బింగ్, సెన్సార్ పనులు కొంచెం వేగంగానే చేయాల్సి ఉంటుంది.
ఎబ్రాడ్ రిలీజ్ గురించి ఏర్పాట్లు ఆల్రెడీ చేసి ఉన్నాం కాబట్టి, ఆ వైపు పెద్ద ఇబ్బంది లేదు. అసలు ఇబ్బందంతా ఇక్కడే.
ఇక్కడ ఏదీ ష్యూర్ కాదు!
రాజకీయంగా రెండు రాష్ట్రాలుగా విడిపోయినా - మొత్తం సినిమా ఇండస్ట్రీ లావాదేవీల్లో, సిస్టమ్‌లో మాత్రం సెంటీమీటర్ మార్పులేదు.
కొన్ని పెద్ద సినిమాల రిలీజ్ డేట్స్ విషయంలో బోలెడంత కన్‌ఫ్యూజన్, అస్పష్టతల కారణంగా - చిన్న సినిమాల రిలీజ్ అనేది ఒక పెద్ద తలనొప్పి వ్యవహారమై కూర్చుంది. వారానికి ఏకంగా అయిదారు చిన్న సినిమాలు తెలుగులో రిలీజ్ అవుతున్నాయి. పోతున్నాయి.
స్విమ్మింగ్‌పూల్ విషయంలో అలా జరగకూడదన్నదే నా ప్రయత్నం.
కట్ టూ కార్తీక్ బర్త్‌డే -
నిషా కొఠారి జంటగా ఓషో తులసీరాం డైరెక్షన్‌లో రూపొందిన క్రిమినల్స్ అఖిల్ కార్తీక్ కు మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నాను.
ఇక స్విమ్మింగ్‌పూల్ విషయానికొస్తే - ఈ జూలై 30 కి తన బర్త్‌డే జరుపుకోబోతున్న అఖిల్ కార్తీక్ కెరీర్‌లో ఇప్పటివరకూ ఏ సినిమాకూ రానంతటి ఫోకస్ స్విమ్మింగ్‌పూల్ ద్వారా లభించింది. అంతే కాదు .. ఇండస్ట్రీలోని చాలామంది ఈ సినిమా కదలికలను గమనిస్తున్నారు. ఇది ఖచ్చితంగా మైక్రో బడ్జెట్ ఫిలిమ్ మేకింగ్‌లో మేము సాధించిన తొలి విజయం.
నిజంగా ఈ రెండు సినిమాలూ అఖిల్ కార్తీక్ బర్ట్‌డే సందర్భంగా రిలీజ్ అయినట్లయితే .. అంతకంటే పెద్ద బర్త్‌డే గిఫ్ట్ అఖిల్ కార్తీక్ కు ఇంకేముంటుంది?

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani