మొన్నరాత్రి, నాతో ఫోన్‌లో మాట్లాడ్డం అయిపోతూనే, మా ప్రొడ్యూసర్ అరుణ్ ముప్పన తన ఫేస్‌బుక్ టైమ్‌లైన్‌లో పోస్ట్ చేయడంద్వారా స్విమ్మింగ్‌పూల్ రిలీజ్ డేట్ ను ప్రకటించేశారు.
ప్రస్తుతం మాముందున్న టార్గెట్ ఒక్కటే.
చేతిలో ఉన్న అత్యంత పరిమితమైన రిసోర్సెస్‌తోనే స్విమ్మింగ్‌పూల్ చిత్రాన్ని వీలయినంత బాగా రిలీజ్ చేయగలగాలి. ఒక రకంగా - ఇది నాకూ, మా టీమ్‌కూ ఓ పెద్ద ఛాలెంజ్. బట్, ఇక్కడివరకూ చేయగలిగిన మాకు .. ఇది పెద్ద లెక్కేం కాదు అన్న నమ్మకం నాకుంది.
కట్ టూ ది బిగ్ డిఫరెన్స్ -
ఆల్‌రెడీ ఒక బ్రాండున్న పెద్ద హీరోలు, పెద్ద డైరెక్టర్లు, పెద్ద బ్యానర్‌ల సినిమాలకు మామూలుగానే ఒక అంచనా, ఒక హైప్ ఉంటాయి. మార్కెట్‌లో ఒక రేట్ కూడా ఉంటుంది.
ఆ సినిమాల రిలీజ్‌కు ఓపెనింగ్స్ అంటూ ఉంటాయి .. ఒక రేంజ్‌లో.
చిన్న బడ్జెట్ సినిమాల విషయంలో ఇదంతా ఏం ఉండదు. కోరుకున్న థియేటర్‌లు దొరకవు. చివరి నిమిషంలో కూడా చాలా మంది, చాలా రకాలుగా హాండిస్తారు.
ఒక 100 చిన్న బడ్జెట్ సినిమాలు రిలీజైతే, వాటిలో కేవలం ఒక 5% చిత్రాలకే మార్కెట్‌లో ఒక అంచనా ఉంటుంది. ఒక రేంజ్ హైప్ క్రియేట్ చేసుకోగలుగుతాం. ఇలాంటివాటికి మాత్రం ఎంతోకొంత ఓపెనింగ్స్ అంటూ ఉంటాయి. సినిమాలో ఏమాత్రం స్టఫ్ ఉన్నా, మంచి టాక్ వస్తుంది.
మౌత్ టాక్ ఒక్కటే చిన్న సినిమాలకు ఊపిరి. "సినిమా బాగుంది" అన్న టాక్ వస్తే చాలు. ఒక్కసారిగా సీన్ మారిపోతుంది.
సో, ఏరకంగా చూసినా .. చిన్న సినిమాలకు ఓపెనింగ్స్ చాలా చాలా ముఖ్యం.
ఇక స్విమ్మింగ్‌పూల్ విషయానికొస్తే - పైన చెప్పిన 5% సినిమాల కేటగిరీలోకి మా స్విమ్మింగ్‌పూల్ వస్తుందని నేననుకొంటున్నాను.
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani