స్విమ్మింగ్‌పూల్ చిత్రం ద్వారా నేను పరిచయం చేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్ ప్రదీప్‌చంద్ర అంటే నాకు చాలా ఇష్టం. ఈ ఇష్టానికి కారణమైన అంశాలు రెండు.
అతని టాలెంట్. అతని వ్యక్తిత్వం.
విషయమేంటంటే - ప్రదీప్‌చంద్ర వయసులో నా కంటే చాలా చిన్నవాడు. కేవలం ఇండస్ట్రీకి కొత్త అనే కాకుండా, ఈ పాయింటాఫ్ వ్యూలో కూడా .. ప్రదీప్‌చంద్రకు నేను అప్పుడప్పుడూ కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు చెప్తూ విసిగిస్తుంటాను.
కట్ టూ మన కొత్త సింగర్‌ల టాపిక్ -
స్విమ్మింగ్‌పూల్ మ్యూజిక్ సిట్టింగ్స్ 'డే వన్' నుంచి నేను ప్రదీప్‌చంద్రకు ఒక విషయం చెబుతూ వస్తున్నాను ..
"మన సినిమాలో పాటలకోసమని నువ్వు ఇండస్ట్రీలోని టాప్ సింగర్స్‌తోనే పాడించాలని పొరపాటున కూడా అనుకోకు. నాకలాంటి భ్రమలు లేవు.
అలా .. టాప్ సింగర్స్ పేర్లు నీ సీడీలో ఉంటేనే నీకు పేరొస్తుందనీ, మ్యూజిక్ కంపెనీలవాళ్లు ఆడియో రైట్స్ కొనుక్కోడానికి ఎగబడతారనీ అనుకోకు.
ఏ క్యాబ్ వాడో తప్ప, ఇప్పుడు ఆడియో సీడీలు ఫ్రీగా ఇచ్చినా ఎవ్వడు తీసుకోడంలేదు. ఇంకా చెప్పాలంటే - ఇప్పుడు ఆడియో రిలీజ్ కంటే ముందే ఆ సాంగ్స్ ఇంటర్‌నెట్‌లో లీకయిపోతున్నాయి.
సో, మన పాటలు కూడా బాగుంటే వద్దన్నా పబ్లిక్‌లోకి వెళ్లిపోతాయి. వినాలనుకున్నవాడు డౌన్‌లోడ్ పెట్టుకుంటాడు."
కాబట్టి -
"నువ్వు కొత్త సింగర్స్‌ను పరిచయం చేసి, వాళ్లను నీ ద్వారా టాప్ సింగర్స్‌ను చెయ్యి!" అని కూడా ప్రదీప్‌చంద్రకు చెప్పాను.
ఇలా నేను చెప్పడానికి చాలా కారణాలున్నాయి ..
వెనకటి రోజుల్లో గాయనీగాయకుల్లాగా ఏ ఒకరిద్దరో మాత్రమే పాడుతూ .. 'దశాబ్దాలకొద్దీ గాన సామ్రాజ్యాల్ని ఏలాలి' అనుకొనే రోజులు కావివి. అప్పుడంటే అలా నడిచింది. ఇప్పుడలా నడవదు గాక నడవదు. ఇప్పటి ప్రేక్షకులు, శ్రోతలు ఎప్పటికప్పుడు కొత్తదనం కోరుకొంటున్నారు. కొత్త గొంతులు వినాలనుకొంటున్నారు. విని ఆనందిస్తున్నారు.
ఈ కోణంలో ఆలోచించినప్పుడు - టాలెంట్ బాగా ఉండి, అవకాశం కోసం ఎదురుచూస్తున్న కొత్త సింగర్స్‌ను పరిచయం చెయ్యాలన్నది నా ఉద్దేశ్యం.
అలాగే - ఇప్పటికే పరిచయమైనా, రకరకాల కారణాలవల్ల, టాలెంట్ ఉండీ పైకి రాలేకపోతున్న అప్‌కమింగ్ సింగర్స్‌ను కూడా వీలయినంత ఎంకరేజ్ చెయ్యాలన్నది నా ఇంకో ఆలోచన.
కట్ టూ క్లయిమాక్స్ -
పైనంతా ఏదో చెప్పానని .. ఇండస్ట్రీలోని టాప్ సింగర్స్ మీద నాకేదో ఇష్టం లేదని కాదు. ఆ రేంజ్‌కు రావడం కోసం వాళ్లంతా ఏ రేంజ్‌లో శ్రమపడి ఉంటారో నాకు బాగా తెలుసు.
పైగా వాళ్ల రేంజ్‌నుబట్టి - వాళ్లకు ఎప్పుడూ ఏవేవో స్టేజ్ షోలు ఉంటాయి. అలాంటప్పుడు .. వాళ్ళు మన సినిమాలో పాడినప్పటికీ, రేపు మన ఆడియో లాంచ్‌కు డబ్బులిచ్చిరమ్మన్నా రాలేని పరిస్థితులుంటాయి వాళ్లకు.
అక్కడ షోలకెళ్తే లక్షలొస్తాయి. ఇక్కడ ఆడియో లాంచ్‌కొస్తే మనం బోడి ఏ ఐదు వేలో, పది వేలో ఇస్తాం.
ఎలా కుదురుతుంది?
ఏదయినా సరే, రియలిస్టిక్‌గా ఆలోచించాలన్నది నా పాయింటు.
కాకపోతే - దీనికో మినహాయింపు కూడా ఉంది.
చిన్న సినిమాల ఆడియో లాంచ్‌లను రకరకాల కారణాలతో లైట్ తీసుకోనే ఇదే సింగర్స్ .. పెద్ద హీరోలు, పెద్ద బ్యానర్‌ల సినిమాల ఆడియో లాంచ్‌లకు మాత్రం స్లీవ్‌లెస్‌ల్లో అటెండవుతారు.
అక్కడ తప్పదు. అది వేరే విషయం.
ఎవర్నీ తప్పుపట్టడానికిలేదు. ఎవరి రీజన్స్ వారివి. ఎవరి బాధ వారిది.
సో, మై డియర్ ప్రదీప్! ఇప్పుడయినా కొత్త సింగర్స్‌ను పరిచయం చెయ్యి. ఆడిషన్స్ పెట్టు. మన కొత్త సినిమా కోసం ..

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani