స్విమ్మింగ్‌పూల్ సినిమాను మన తెలంగాణ, ఎ పి, లతో పాటు - ఎబ్రాడ్‌లో యు కె, యూరోప్, అమెరికాల్లో కూడా ఏకకాలంలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు పూర్తిస్థాయిలో జరుగుతున్నాయి.
అమెరికాలో కనీసం ఒక ఐదు ముఖ్యమయిన సెంటర్లలో రిలీజ్‌కు ఏర్పాట్లు ఎప్పుడో జరిగిపోయాయి.
యు కె, యూరోప్‌ల్లో స్విమ్మింగ్‌పూల్ రిలీజ్ ఏర్పాట్లను ప్రొడ్యూసర్ అరుణ్‌కుమార్ ముప్పన తన స్వంత డిస్ట్రిబ్యూషన్ సంస్థ అయిన శ్రీ శ్రీ ఇంటర్నేషనల్ ద్వారా స్వయంగా తానే పర్యవేక్షిస్తున్నారు.
సో, ఇక్కడి రిలీజ్ డేట్స్‌తో పాటు ఎబ్రాడ్‌లో కూడా రిలీజ్ డేట్స్ కుదరాలి కాబట్టి, స్విమ్మింగ్‌పూల్ రిలీజ్‌కు ఇంకొన్ని వారాల సమయం పట్టవచ్చు.
కట్ టూ బ్లాక్ కార్డ్ -
యు కె లో స్విమ్మింగ్‌పూల్ సెన్సార్ మొన్ననే పూర్తయింది. మన దగ్గర సెన్సార్ పూర్తయ్యాక ఇచ్చే సెన్సార్ "సర్టిఫికేట్"నే అక్కడ యు కె లో "బ్లాక్ కార్డ్" అంటారు.
ఈ బ్లాగ్ పోస్ట్‌లో మీరు చూస్తున్న ఫోటో అదే. యు కె లో స్విమ్మింగ్‌పూల్ ప్రదర్శన కోసం ఇచ్చిన సెన్సార్ సర్టిఫికేట్ అన్నమాట. దీని ప్రకారం 12 సంవత్సరాలు దాటిన ఎవరైనా ఈ సినిమాను చూడొచ్చు అని బ్రిటిష్ బోర్డ్ ఆఫ్ ఫిలిం క్లాసిఫికేషన్ (BBFC) సర్టిఫికేట్ ఇచ్చింది.
సినిమా జోనర్ హారర్ అయితే చాలు .. ఇదే సినిమాకు మన దగ్గర సెన్సార్ రూల్స్ ప్రకారం - అందులో ఏం ఉన్నా, లేకపోయినా - మనకు వాళ్లిచ్చేది మాత్రం 'ఎ' సర్టిఫికేట్!

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani