Monday, 8 June 2026

క్రిమినల్ వేస్టాఫ్ టైమ్ & మనీ


185 రోజుల షూటింగ్, 189 నిమిషాల ఫిలిం నిడివి. 

అంటే రోజుకి జస్ట్ ఒక్క నిమిషమే స్క్రీన్ టైమ్ షూట్ చేసినట్టు లెక్క!   

కట్ చేస్తే -

ఇది "పెద్ది" సినిమా బాగుందా బాగోలేదా అన్న పాయింట్ కాదు. 

డిజిటల్ ఫిల్మ్ మేకింగ్ ఎన్నో సౌకర్యాలనిస్తోంది. ఇప్పుడు దానికి ఏ ఐ కూడా తోడయ్యింది. ఫిలిం నెగెటివ్ వాడినరోజులకంటే, ఇప్పుడు కనీసం 10 రెట్ల వేగంతో సినిమాలు నిర్మించబడాలి.   

కాని, ఏదీ? 

హిందీ హీరో అక్షయ్ కుమార్ ఒకసారి చెప్పిన మాట ఈ సందర్భంగా గుర్తుకువస్తోంది...

"సినిమా షూటింగ్ 60 రోజులు మించకూడదు. రోజుకు 2 నిమిషాల సినిమా నువ్వు షూట్ చెయ్యలేకపోతే అంతకంటే క్రిమినల్ వేస్టాఫ్ టైమ్ & మనీ ఇంకోటి ఉండదు!" 

పాయింటే కదా?

కాని, ఇప్పుడు జరుగుతోంది అదే. 
క్రిమినల్ వేస్టాఫ్ టైమ్ & మనీ. 
 
- మనోహర్ చిమ్మని 

No comments:

Post a Comment

Thanks for your time!
- Manohar Chimmani