Friday, 12 June 2026

ఎవరికీ రిటైర్మెంట్ ఉండదు!


అవును. "ఎవ్వరికీ రిటైర్మెంట్ ఉండదు, ఉండకూడదు" అంటాడు అక్షయ్ కుమార్. 

ఏదో పని చేస్తూనే ఉండాలి. పనిచేస్తూ ఉంటేనే ఆరోగ్యంగా ఉంటారు, యాక్టివ్‌గా ఉంటారు అన్నది అక్షయ్ కుమార్ ఉద్దేశ్యం. 

"మీకు మరీ అంతగా 'రిటైర్ అయ్యాను' అని చెప్పుకోవాలన్న ఇష్టం ఉంటే, మీరు చచ్చిపోడానికి ఒక అయిదు సెకన్ల ముందు చెప్పి హాయిగా చచ్చిపోండి" అంటాడు అక్షయ్. 

ఈ రెండు మాటల్ని ఒక ప్రోగ్రామ్‌లో ఎంత సింపుల్‌గా చెప్పాడో, అంతే డిసిప్లిన్డ్‌గా ఉంటాడు ఆక్షయ్ కుమార్.

బహుశా అందుకేనేమో... 84 ఏళ్ళ వయస్సులో అమితాబ్ బచ్చన్ ఇప్పటికీ రోజూ 12 గంటలు పనిచేస్తున్నారు. ఆయనకి డబ్బు లేక కాదు. ఇంకా సంపాదించాలనీ కాదు. ఫిజికల్‌గా, మెంటల్‌గా యాక్టివ్‌గా ఉండటం కోసం. 

మీరు గమనించారో లేదో... ఎందరో 70, 80, 90 దాటిన బిజినెస్ మాగ్నెట్స్, క్రియేటివ్ రంగాల్లోని వారు కూడా ఎప్పుడూ యాక్టివ్‌గా పనిచేస్తూవుంటారు. పనిచేస్తూ యాక్టివ్‌గా ఉంటారు. 

ఈ సూత్రానికి ఎలాంటి కులమతవర్గ భేదాల్లేవు.

పనిచెయ్యటం, చెయ్యకపోవటం. ఈ రెండే ఉంటాయి.

మధ్యస్థంగా ఎలాంటి మిడిల్ గ్రౌండ్ ఉండదు. అలా ఏదైనా ఉందీ అనుకుంటే, అది మనకు మనం చెప్పుకొనే సాకులు మాత్రమే.     

A man does not grow old because of age. He grows old when he stops creating, stops contributing, and stops dreaming. Work keeps the body active and the spirit alive.

There is no retirement for a passionate soul. 

- మనోహర్ చిమ్మని 

No comments:

Post a Comment

Thanks for your time!
- Manohar Chimmani