Thursday, 18 June 2026

ఇద్దరు... మణిరత్నం, ఇమ్తియాజ్ అలీ


హిందీలో ఇమ్తియాజ్ అలీ సినిమాలు వేరే లెవెల్లో ఉంటాయి. కొన్ని సీన్లు మరీ బోర్ కొట్టిస్తాయి. కాని, ఎంతో డెప్త్ ఉంటుంది. ఒక పదేళ్ళ తర్వాత మనకు మళ్ళీ ఆ సినిమా గుర్తుకొస్తుంది. మళ్ళీ మళ్ళీ చూస్తాం. 

ఉదా: రణ్‌బీర్ కపూర్, దీపికా పడుకోన్ "తమాషా". 

ఇప్పుడు మళ్ళీ ఓ కొత్త సినిమాతో వచ్చాడు ఇమ్తియాజ్ అలీ... "మై వాపస్ ఆవూంగా". క్లయిమాక్స్‌లో ప్రేక్షకుల కళ్లవెంట ధారలుగా నీళ్ళు. 

కొందరైతే థియేటర్లో ఇమ్తియాజ్ అలీ కనిపించగానే కాళ్ళమీదపడిపోతున్నారు. ఏడుస్తూ హగ్ చేసుకుంటున్నారు.  

కట్ చేస్తే -

సినిమాలు హిట్ అవ్వనీ, ఫెయిల్ అవ్వనీ.

కమర్షియల్ డొమైన్‌లోనే సీరియస్ ఫిలిమ్మేకర్స్ కొందరే ఉంటారు. వాళ్ళు అనుకున్నదే చేస్తారు. 

అలాంటివాళ్ళల్లో నాకు నచ్చిన ఇద్దరు... మణిరత్నం, ఇమ్తియాజ్ అలీ. 

"Bhagavad Gita shaped my life."
- Imtiaz Ali

- మనోహర్ చిమ్మని    

No comments:

Post a Comment

Thanks for your time!
- Manohar Chimmani