Wednesday, 3 June 2026

ఇదొక యజ్ఞం


సినిమా అంత ఈజీ కాదు. 
అంత కష్టం కూడా కాదు. 

అంతా మన మైండ్‌సెట్.
మనం ఎన్నుకొనే మన టీమ్. 

మనం ఎక్కడైనా ఫెయిల్ అయ్యాము అంటే కారణం ఎప్పుడూ ఇండస్ట్రీ కాదు. మన మైండ్‌సెట్. మనం క్రియేట్ చేసుకొన్న టీమ్. 

మిగిలిందంతా జస్ట్ మనం చెప్పుకొనే సాకులు. 
జస్ట్ బుల్‌షిట్. 

కట్ చేస్తే - 

ఫిలిం ఇండస్ట్రీకి, అందులో పనులు కావడానికి, మనం అనుకున్నట్టుగా ఎదగడానికీ... ఒక సిస్టమ్ ఉంటుంది. 

ఇప్పుడంతా ఆ సిస్టమ్ ప్రకారమే జరుగుతోంది అని ఎప్పటికప్పుడు భ్రమపడుతుంటాం. 

కాని, అవ్వన్నీ భ్రమలే కాదు, పచ్చి అబద్ధాలు కూడా అని ఎప్పటికప్పుడూ షేమ్‌లెస్‌గా ప్రూవ్ చేసుకునేవాళ్ళు కొందరుంటారు. అలాంటి వాతావరణం నుంచి ముందు బయటపడాలి. తప్పుకోవాలి. 

ఎలాంటి మొహమాటాల్లేవ్.

ఏ చిన్న ప్రామిస్‌నూ, ఏ చిన్న అబద్ధాన్నీ అమాయకంగా నమ్మాల్సిన అవసరం లేదు. నమ్ముతున్నట్టు నటించాల్సిన అవసరం అసల్లేదు.  

ఇదొక యజ్ఞం.
ఎన్నో అడ్డంకులొస్తాయి.
టెన్షన్స్ ఉంటాయి.

ఫేస్ చెయ్యాలి. తప్పదు. 

మన పనులు అయ్యేదాకా, అనుకున్నది సాధించేదాకా ఇలాంటి మనుషులూ, అడ్డంకులూ తప్పవు. 

ఒకరు కాకపోతే ఇంకొకరు. 
లేదా, పది మంది. 
తప్పదు.  

ఎప్పటికప్పుడు మనమే సరైన నిర్ణయాలు తీసుకోవాలి. వన్ మాన్ ఆర్మీలా ముందుకెళ్తూవుండాలి.   

- మనోహర్ చిమ్మని   

No comments:

Post a Comment

Thanks for your time!
- Manohar Chimmani