Sunday, 7 June 2026

మనం ఎక్కడైనా ఫెయిల్ అయ్యాము అంటే...


సినిమా అంత ఈజీ కాదు.
అంత కష్టం కూడా కాదు.

అంతా మన మైండ్‌సెట్.
మనం ఎన్నుకొనే మన టీమ్.
మనం అసోసియేట్ అయ్యే మనుషులు.

మనం ఎక్కువ సమయం గడిపే ఆ అయిదుగురు.

మనం ఎక్కడైనా ఫెయిల్ అయ్యాము అంటే కారణం ఎప్పుడూ ఇండస్ట్రీ కాదు.
మన ప్రొఫెషన్ కాదు. మన బిజినెస్ కాదు. 

మన మైండ్‌సెట్. 

మనం క్రియేట్ చేసుకొన్న టీమ్. 
మనం నమ్మిన మనుషులు.  

పనిచేయని ప్రయత్నాలనే రొటీన్ చేసుకోవటం.
పచ్చి అబద్ధాలనే పదే పదే నమ్మటం.
ఆ కంఫర్ట్ జోన్ లోనే కూరుకుపోవటం. 
ఆ లూప్ లోనే తిరుగుతూ, ఇంకేదో అద్భుతాన్ని ఆశించటం. 

మిగిలిందంతా జస్ట్ మనం చెప్పుకొనే సాకులు.
మనకి మనం మభ్యపెట్టుకొనే బుల్‌షిట్.

- మనోహర్ చిమ్మని   

No comments:

Post a Comment

Thanks for your time!
- Manohar Chimmani