Sunday, 14 June 2026

"Sing Geetham" చూసిన తర్వాత...


95 ఏళ్ళ క్లింట్ ఈస్ట్‌వుడ్ ఈమధ్యే ఒక సినిమాకు దర్శకత్వం వహించారు. ఆ సినిమా పేరు జ్యూరర్ #2. మొన్నీమధ్యే రిలీజ్ అయింది. 

79 ఏళ్ల స్టీవెన్ స్పీల్‌బర్గ్ ఇంకా సైన్స్‌ఫిక్షన్/యు-ఎఫ్-ఓ సినిమాలు చేస్తున్నారు. 

71 ఏళ్ళ జేమ్స్ కెమెరాన్ అవతార్-4 ను 2029లో రిలీజ్ చెయ్యడానికి, అవతార్-5ను 2031లో రిలీజ్ చెయ్యడానికి డైరెక్షన్ వర్క్‌లో ఫుల్ బిజీగా ఉన్నారు. 

దేశంలోనే అత్యధికస్థాయి రెమ్యూనరేషన్ కోట్లల్లో తీసుకొంటున్న ప్రముఖ కథారచయిత విజయేంద్రప్రసాద్ గారి వయస్సు 82.    

చిన్న గ్యాప్ తర్వాత, ఇప్పుడు రెండు హిందీ సినిమాలు, ఒక హాలీవుడ్ ప్రాజెక్టు చేస్తున్న శేఖర్ కపూర్ వయస్సు 80. 

మణిరత్నం (69), ఆర్జీవీ (63) ఇంకా యాక్టివ్‌గా సినిమాలు తీస్తున్నారు. 

అమితాబ్ బచ్చన్‌కు 83, చిరంజీవికి 70, నాగార్జునకి 66, బాలయ్యకు 66, వెంకటెష్‌కు 65. అందరూ యమ యాక్టివ్‌గా సినిమాలు చేస్తున్నారు.

కట్ చేస్తే -

ఇప్పటికే 60 సినిమాలు చేసిన ప్రఖ్యాత దర్శకులు సింగీతం శ్రీనివాసరావు గారు ఇప్పుడు తాజాగా తన 61వ సినిమా "Sing Geetham" ను వైజయంతీ మూవీస్ బ్యానర్లో పూర్తిచేసి, రిలీజ్ చేశారు. సినిమా బాగా నడుస్తోంది. 

నాగ్ అశ్విన్‌ను, వైజయంతీ బ్యానర్‌ను ఎంత మెచ్చుకున్నా తక్కువే. జస్ట్ హాట్సాఫ్... ఒక ఇన్నోవేటివ్ ఫిలిమ్మేకర్‌కు, వారి జీవిత చరమాంకంలో మీరిచ్చిన గౌరవం అద్భుతం.    

సింగీతం గారి "పుష్పక విమానం"లో మాటలుండవు. "సింగ్ గీతం"లో పాటలే మాటలు. సినిమా చూడండి. రొటీన్ సినిమాలకు దూరంగా ఒక కొత్త అనుభవాన్ని ఎంజాయ్ చేయండి.      

కట్ చేస్తే -

సుమారు ఇరవై ఏళ్ల క్రితం, చెన్నైలో సింగీతం గారిని నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు, వారి  "పుష్పకవిమానం" సినిమా స్టోరీబోర్డులోంచి ఒక సీన్ అడిగి తీసుకున్నాన్నేను.

అప్పట్లో నేను రాస్తున్న ఒక పుస్తకంలో దాన్ని అలాగే పబ్లిష్ చేయాలన్నది నా ప్లాను.  

సింగీతం గారు వారి సినిమాలకు వారే స్వయంగా స్టోరీబోర్డు వేసుకుంటారు. దర్శకులు బాపు గారిలాగే. 

సింగీతం గారు ఆరోజు నాకిచ్చిన స్టోరీబోర్డు, తన షూటింగ్ టైమ్‌లో తనకోసం స్పీడ్‌గా వేసుకున్నది కాబట్టి అంత క్లారిటీ లేదని వారి ఉద్దేశ్యం. దాన్ని స్కాన్ చేసి, ప్రింట్‌చేసినప్పుడు టెక్నికల్‌గా అదంత బాగా రాకపోవచ్చునని వారికి తెలుసు.

అందుకని, హైద్రాబాద్ వచ్చినప్పుడు, "పుష్పక విమానం" లోని అదే సీన్ స్టోరీబోర్డును నాకోసం మళ్ళీ కొత్తగా వేసి తీసుకొచ్చారు.

వారు హైద్రాబాద్‌లో రామానాయుడు గెస్ట్ హౌజ్‌లో ఉన్నప్పుడు, నాకు కాల్ చేసి పిల్చి మరీ ఆ కొత్త స్టోరీబోర్డుని నాకిచ్చారు.   

అప్పటికే సింగీతం గారి వయస్సు సుమారు 75 ఉండొచ్చు. 

దటీజ్ సింగీతం గారు. 

ఇప్పటికీ వారిచ్చిన ఆ స్టోరీబోర్డ్ నాదగ్గర భద్రంగా ఉంది. 


కట్ చేస్తే -   

"సెల్యులాయిడ్ సైంటిస్టు" సింగీతం గారి వయస్సు ఇప్పుడు 94. 

50, 60 కే "అంతా అయిపోయింది... ఇంకేముంది" అనుకొనేవాళ్ళంతా కొంచెం ఆలోచించాలి.  

అంతే కాదు, 30 ల్లోనే ఎప్పుడూ "నాకు అది లేదు... ఇదిలేదు" అనీ, "అదుంటే చేసేవాన్ని... ఇదుంటే పొడిచేవాన్ని" అనీ, నిరంతరం సాకులతోనే సమయం వెల్లదీస్తున్న అపర వృద్ధాగ్రేస యువకులు కూడా ఒకసారి వారి మైండ్‌సెట్ గురించి ఆలోచించుకోవాలి. 

వయస్సు కాదు, మనసు ముఖ్యం. 
పట్టుదల, తపన, కసి ముఖ్యం. 
పనిచేస్తూవుండటం ముఖ్యం. 
ఒక్కటే లక్ష్యం మీద ఫోకస్ ముఖ్యం.  

వయస్సనేది జస్ట్ ఒక అంకె మాత్రమే.   

కట్ చేస్తే -

అన్నిటికంటే ముఖ్యమైన పాయింట్... "50 దాటినవాళ్ళు ఫిలిం డైరెక్షన్‌కు పనికిరారు" అంటున్న టాలీవుడియన్స్ కొందరు వెంటనే మంచి సైకియాట్రిస్టును కలవటం మంచిది.  

In fact, some filmmakers create their most significant work after the age of sixty.

Look at Ridley Scott. He directed major films well into his seventies and eighties.

Martin Scorsese continues to make powerful cinema even after turning eighty.

Experience Has No Expiry Date. 
There’s No Deadline on Dreams.
Start Now. Any Age.
     
- మనోహర్ చిమ్మని    

No comments:

Post a Comment

Thanks for your time!
- Manohar Chimmani