భరత్ మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నాడు. "గై ఆన్ ది సైడ్ వాక్" రచయిత కూడా.
అప్పుడప్పుడూ ఇలాంటి మా "నో హిపోక్రసీ" సంభాషణలు చాలా విషయాల్లో మాకు క్లారిటీ ఇస్తాయి. జీవితంలో మరింత టైం వృధాకాకుండా చూసుకోమని వార్నింగ్ కూడా ఇస్తాయి.
కట్ చేస్తే -
"ప్రతి నిమిషం పర్పస్‌ఫుల్‌గా ఉండక తప్పదు సర్ మనకి" అన్నాడు భరత్.
ఈ సందర్భంగా ఒక టాప్ స్టార్ ఉదాహరణ కూడా వచ్చింది మా సంభాషణలో. ఆ స్టార్ ఇంట్లోంచి బయటకొచ్చాడంటే చాలు "మీటర్ రన్ కావాల్సిందే."
నో ఫ్రీ సర్విస్.
అలాగే రచయితలు కూడా, ఆదాయం లేని రచనలు ఎందుకు చెయ్యటం?
పేరు, సన్మానాలు, అవార్డుల కోసం అనుకుంటే మరి తిండి ఎవడు పెడతాడు?
పేరు, సన్మానాలు, అవార్డుల కోసం అనుకుంటే మరి తిండి ఎవడు పెడతాడు?
బ్రతకడానికి ఇంకో పనిచేస్తూ, జస్ట్ పేరు కోసం అంత శ్రమ అవసరమా?
ఇది ఒక్క రచనా వ్యాసంగానికే కాదు. ఏ క్రియేటివ్ యాక్టివిటీకైనా వర్తిస్తుంది. ప్రయోజనం లేని పనిచెయ్యటం నిజంగా అనవసరం.
ఇదే ఇతరరంగాల్లో ఫ్రీ సర్విస్ చేసేవారికి కూడా వర్తిస్తుంది. మనమేదో గుడ్డిగా చేస్తుంటాం. అవతల ప్రయోజనాలు పొందేవాళ్ళు పొందుతుంటారు. అదీ పాయింట్.

సో, ముందు ఫినాన్షియల్ ఫ్రీడమ్. ఆ తర్వాత నువ్వు కథలే రాసుకో, కథలే పడు. ఎవ్వరికీ ఇబ్బంది ఉండదు. ముఖ్యంగా నీ కుటుంబానికి, నీకు.
- మనోహర్ చిమ్మని

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani