Wednesday, 24 June 2026

మానిప్యులేషన్ వేరు, క్రానిక్ అబద్ధాలు వేరు


"కృష్ణానగర్ బ్యాచ్" అని కొంతమంది అంటుంటారు. అది తప్పు. నిజానికి అలా జెనరలైజ్ చెయ్యాల్సిన అవసరం లేదు. 

ఎక్కడైనా మంచి-చెడు రెండూ ఉంటాయి.    

మనకు కావల్సిన మంచినే పట్టించుకోవాలి. మనకు అవసరం లేని చెడుని గాని, నెగెటివిటీని కాని పట్టించుకోవల్సిన అవసరం లేదు.  

అందరూ కామెంట్ చేసే అదే కృష్ణానగర్ నుంచే ఎందరో స్టార్స్ అయ్యారు. స్టార్ టెక్నీషియన్స్ అయ్యారు. 

మనం గుర్తించాల్సింది, ఆదర్శంగా తీసుకోవాల్సింది ఇది.

మిగిలిందంతా జస్ట్ బక్వాస్.    

కట్ చేస్తే -   

ఒక పని సాధించడానికి కావల్సింది... 
ఒక ఖచితమైన లక్ష్యం. 
ఎలా సాధించాలన్న దాని మీద క్లారిటీ. 
నిరంతరం శ్రమించగల శక్తి. 
నిజాయితీ.   

ఇవేవీ లేకుండా, దగ్గినా తుమ్మినా అబద్ధాలు చెప్తూ, అవతలివాళ్ళు నమ్ముతున్నారు అనుకొని మురిసిపోవడం ఒక వ్యాధి. ఇలాంటివారిని భగవంతుడే కాపాడాలి.  

కాని, అవన్నీ మనకెందుకు... ఏదో "పని అవుతుంది కదా" అని, ఇలాంటివారి అవధులు లేని అబద్ధాల్ని ఏళ్ళతరబడి వినాల్సిన అవసరం లేదు. 

వాళ్ళు బాగానే ఉంటారు. మనం కోల్పోయే సమయం తిరిగిరాదు. సాంఘికంగా కూడా మరెన్నో నష్టాల్ని మనం ఎదుర్కోవాల్సి వస్తుంది.     

వెనుకట ఏమీ తెలియని "అంబేదా"లున్న రోజులు వేరు. ఇప్పుడు వేరు. నువ్వు ఒక అబద్ధం చెప్పావంటే దాన్ని కనుక్కోవటానికి ఒక్క ఫోన్ కాల్ చాలు. ఒక్క వాట్సాప్ మెసేజ్ చాలు. నిమిషంలో నిజం ఏంటో తెలుస్తుంది. 

జీవితం చాలా చిన్నది. 

చిన్నవో పెద్దవో, ప్రతి ఒక్కళ్ళకీ, సాధించాల్సినవి చాలా ఉంటాయి. సమయం చాలా తక్కువగా ఉంటుంది.  

సమయానికి, మాటకు, కమ్యూనికేషన్‌కు విలువిచ్చేవాళ్ళే జీవితంలో ఏదైనా చెయ్యగలుగుతారు. సాధించగలుగుతారు. 

ఈ నిజాన్ని ఎప్పటికప్పుడు గుర్తుచేసుకోవాల్సిన బాధ్యత మనదే. ఎప్పటికప్పుడు సరైన నిర్ణయాలు తీసుకోవాల్సిన బాధ్యత కూడా మనదే.   

- మనోహర్ చిమ్మని          

No comments:

Post a Comment

Thanks for your time!
- Manohar Chimmani