Thursday, 25 June 2026

క్లీన్ సినిమాకు "ఏ" సర్టిఫికేట్ ఇవ్వటం ఎలా?


"దీవానా" చూడండి. అర్థమైపోతుంది. 

"దీవానా" సినిమాకు సెన్సార్ బోర్డ్ "ఏ" సర్టిఫికేట్ ఇవ్వటం మీద సీనియర్ ఫిలిం జర్నలిస్టు నాగేంద్ర కుమార్ ఎంతో ఆక్రోశం వెళ్ళగక్కుతున్న వీడియో ఒకటి నిన్న చూసి నిజంగా నాకు కొంత ఆశ్చర్యమేసింది. ఏంటీయన ఇలా చెప్తున్నారు అని.   

కాని, ఇవ్వాళ ఆ సినిమా చూశాక నాగేంద్ర కుమార్ గారి ప్రతి మాటకు అర్థం ఉంది అనిపించింది. ఆయన చెప్పాలనుకున్నది వెరైటీగా బాగా చెప్పారు. 

అంత క్లీన్ సినిమాకు "ఏ" సర్టిఫికేట్ ఇచ్చారంటేనే విషయం అర్థమవుతుంది. ఎక్కడో ఏదో మిస్ అయ్యుంటుంది.

ఫార్మాలిటీనో, కమ్యూనికేషనో, ఈగోనో...  

సినిమా నిజంగా బాగుంది. 
నాన్‌స్టాప్ ప్యానిండియా హింసాకాండల మధ్య 
ఒక ప్రేమసుగంధపు తాజా పరిమళం. 

డైరెక్టర్, ప్రొడ్యూసర్, హీరో హర్షిత్ రెడ్డి, హీరోయిన్ స్మేహ మణిమేఘలై & టీమ్ అందరికి హార్టీ కంగ్రాట్స్! 

- మనోహర్ చిమ్మని  

No comments:

Post a Comment

Thanks for your time!
- Manohar Chimmani