Tuesday, 23 June 2026

బడ్జెట్ లేని దగ్గరే అసలు క్రియేటివిటీ


నా లేటెస్ట్ సినిమా "ఎర్ర గులాబి" పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది. 

రోడ్ క్రైమ్ థ్రిల్లర్.

"మనోహర్ చిమ్మని 2.0" అనొచ్చు అనుకుంటాను.

ఈ సినిమా ద్వారా హీరోయిన్‌గా "శ్రేయసి షా"ను పరిచయం చేస్తున్నాను. 

కట్ చేస్తే -

ఇప్పుడు నాకు ఉద్యోగాలు సద్యోగాలు ఏం లేవు. ఇంకే బాధ్యతల్లేవు. 

టోటల్ సినిమా.
పక్కా కమర్షియల్.

త్వరలో ఇంకో సినిమా ప్రారంభించబోతున్నాను. 

బలమైన ప్రొడ్యూసర్ లేని ఇండిపెండెంట్ సినిమాలకు, కోపరేటివ్ ఫిలిమ్మేకింగ్ పద్ధతిలో తీసే సినిమాలకు... చాలా కాంప్రమైజ్‌లు, ఎన్నో ఇబ్బందులూ ఉంటాయన్నది మామూలు విషయం.

అయినా సరే, ఉన్నంతలో మంచి కంటెంట్‌ను ఇవ్వగలిగేది ఇండిపెండెంట్ ఫిలిమ్మేకర్స్ మాత్రమే.   

బడ్జెట్ లేని దగ్గరే అసలు క్రియేటివిటీ బయటికొస్తుంది. 

Independent filmmakers don't wait for doors to open; they build a screen where there was only a wall.

- మనోహర్ చిమ్మని       

No comments:

Post a Comment

Thanks for your time!
- Manohar Chimmani