ఎంత సినిమా బ్యాగ్రౌండ్ ఉన్నా సరే, ఎంత డబ్బున్నా సరే, ఎంతో టాలెంట్ ఉండి మరెంతో టాప్ రేంజ్‌లోకి వచ్చినా సరే... ఏదో ఒక టైమ్‌లో, ఏదో ఒక రూపంలో ఈ సినిమా కష్టాలనేవి ఈ రంగంలో ఉండేవాళ్లను తప్పక ఎటాక్ చేస్తాయి.
ఈ స్టేట్‌మెంట్‌కు ఎలాంటి రిలాక్సేషన్ లేదు. ఉండదు.
సినిమా కష్టాలకు సక్సెస్, ఫెయిల్యూర్స్ అనేవాటితో అస్సలు సంబంధం ఉండదు అని చెప్పడమే ఇక్కడ నా పాయింట్.
మరో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే -
సినిమాల్లోకి ఎంట్రీనే ఉంటుంది.
ఎక్జిట్ మన చేతుల్లో ఉండదు!
"వన్ వే" అన్నమాట.
"వన్ వే" అన్నమాట.
సినిమా ఎవ్వర్నీ వదలదు, దీన్లోకి ఎంటరయినవాడు సినిమానీ వదల్లేడు!!
దటీజ్ సినిమా.
ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ ఇద్దరికీ వర్తిస్తుంది ఇది.
అయితే, సినిమాను ఒక పక్కా క్రియేటివ్ బిజినెస్‌గా, ఒక ప్రొఫెషన్‌గా మాత్రమే తీసుకొని, ఆ పరిధిలోనే కొన్ని ప్రాథమిక జాగ్రత్తలు, నియమాలు పాటిస్తే మాత్రం ఏ కష్టాలూ ఉండవు.
బాగా సంపాదించొచ్చు కూడా!
స్పిరిచువల్‌గా చెప్పాలంటే... ఒక రకమైన 'డిటాచ్‌డ్ అటాచ్‌మెంట్' అన్నమాట.
అయితే ఇది చెప్పినంత సులభం కాదు. అందరివల్ల కూడా కాదు.
- మనోహర్ చిమ్మని

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani