ఒక హీరోయిన్ పెళ్ళవుతోంది. సుమారు ఒక అయిదారేళ్ళ రిలేషన్‌షిప్ తర్వాత, తనకు నచ్చిన ఇంకో హీరోని పెళ్ళిచేసుకుంటోంది.
ఆమె నేషనల్ క్రష్‌గా పాపులారీటీ తెచ్చుకొంది. దాదాపు అన్ని ముఖ్యమైన భాషల ఫిలిం ఇండస్ట్రీల్లో ఒక టాప్ హీరోయిన్‌గా పనిచేస్తోంది.
కట్ చేస్తే -
సోషల్ మీడియాలో ఇందాకే ఒక పోస్టు చూశాను... అతను, దాదాపు పదేళ్ళ క్రితం ఆ హీరోయిన్‌ను పరిచయం చేసిన ఒక నటుడు/నిర్మాత/రచయిత.
"హీరోయిన్‌గా ఇప్పటి ఆమె కలను నేను అప్పుడే విజువలైజ్ చేశాను... మేమిద్దరం టచ్‌లోనే ఉన్నాం" అని!
ఇది 2023 లో అతనొక ఇంటర్వ్యూలో చెప్పిన మాట. దాన్ని ఎన్‌డీటీవీ లాంటి మీడియా ఇప్పుడు కోట్ చెయ్యటం అవసరమా?
- మనోహర్ చిమ్మని
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani