"లేఖిని" వీవెన్ గారు అనుకుంటాను... ఆ మధ్య నన్ను బ్లాగర్స్ మీట్‌కు పిలిచారు. వెళ్ళాలని అనుకున్నాను. చివరి నిమిషంలో అనుకోని పని తగలటం వల్ల మీట్‌కి వెళ్ళలేకపోయాను.
బహుశా మొన్న డిసెంబర్ రెండో ఆదివారం, "తెలుగు బ్లాగుల దినోత్సవం" నాడు మళ్ళీ కలిసే వుంటారు.
కొత్త పరిచయాలు, కొత్త విషయాలు, కొత్త వాతావరణం... అప్పుడప్పుడూ ఇలాంటి మార్పు కొంత అవసరం.
ఇలాంటి మీట్‌లు సంవత్సరానికి ఒక రెండో మూడో జరుగుతుండాలి. బ్లాగర్ మిత్రులు ఈసారి ఏదైనా ప్లాన్ చేస్తున్నట్లైతే నన్ను తప్పక పిలుస్తారని ఆశిస్తున్నాను.
Blogging is the art of turning your silent thoughts into timeless footprints.
- మనోహర్ చిమ్మని

12 కాదండీ .
ReplyDeleteడిసెంబర్ రెండో ఆదివారం ... "తెలుగు బ్లాగుల దినోత్సవం" అని గుర్తుపెట్టుకునే వారు ఇంకా ఉన్నారంటారా!!!
డిసెంబర్ రెండో ఆదివారం. సారీ, సరిచేస్తున్నాను.
Deleteఏదో ఒకటి మనమే అందరం గుర్తుండేలా చెయ్యాలి. నా వంతు బాధ్యతకు నేను రెడీ.
ధన్యవాదాలు మీకు.