ఒక్కొక్క డైరెక్టర్ నుంచి జస్ట్ ఒక్కో అనుభవం తీసుకొని రాయాలనుకొన్నా... ఇది కనీసం ఒక వంద ఎపిసోడ్ల సీరీస్ అవుతుంది.
సో, చాలా చాలా క్లుప్తంగా సింగిల్ లైన్ ఆర్డర్‌లా, సమ్మరీ మాత్రమే రాస్తున్నా.
కట్ చేస్తే -
ఇండస్ట్రీలో యాక్టివ్‌గా ఉన్న పదిమంది ప్రొడ్యూసర్స్ ఒక్కొక్కరి దగ్గర కనీసం ఒక నలుగురు డైరెక్టర్స్ చొప్పున కథ ఓకే చేయించుకొని లైన్లో ఉంటారు.
అలాగని వీళ్లంతా కొత్త డైరెక్టర్సేం కాదు. అప్పటికే మంచి హిట్స్ ఇచ్చినవారై ఉంటారు.
ఇలాంటి సిచువేషన్లో ఒక కొత్త డైరెక్టర్ వెళ్ళి ప్రొడ్యూసర్‌కు కథ చెప్పి ఒప్పించుకోవడం, మంచి బడ్జెట్‌తో సినిమా తీయడం అనేది ఒక భ్రమ.
మరెలా?
డైరెక్టర్ కొంత డబ్బు పెట్టుకొని, సినిమా ఆఫీస్ ఓపెన్ చేసి పని ప్రారంభిస్తే... 50/50 చాన్సెస్‌తో కొత్త ఇన్వెస్టర్స్ గాని, కో-ప్రొడ్యూసర్స్ గాని దొరకొచ్చు.
"దొరకొచ్చు" అంటే వాళ్లేం అలా వెళ్తుంటే కనిపించరు. అలాంటివాళ్లను డైరెక్టర్సే తయారుచేసుకోవాలి.
అలా ఒక ఇద్దరో ముగ్గురో, నలుగురో అయిదుగురో లైక్‌మైండెడ్ కలిసినప్పుడు ఒక చిన్న సినిమా తయారవుతుంది.
అది హిట్ అయిందా నో ప్రాబ్లం. పోయిందా, అత్యుత్సాహంతో మనవాళ్ళు ఇచ్చే కమిట్‌మెంట్స్ అన్నీ మీదపడిపోతాయి. ఉన్నట్టుండి ఆ డైరెక్టర్ అప్పుల్లో పడిపోతాడు. ఈ అప్పులు లక్షల్లో ఉంటాయి. కోట్లల్లో కూడా ఉండొచ్చు.
ఇలాంటి ఒక్క చిన్న దెబ్బ నుంచి కోలుకోడానికి కొందరు డైరెక్టర్స్‌కు జీవితకాలం కూడా సరిపోదంటే అతిశయోక్తి కాదు.
ఇక "5 కోట్ల ఇన్వెస్టర్‌ను ఇప్పిస్తాం", "10 కోట్ల ప్రొడ్యూసర్‌ను ఇప్పిస్తాం" అని నానా కోతలు కోసి, కథలు చెప్పి మోసం చేసే బ్యాచ్‌లు ఇండస్ట్రీ నిండా కోకొల్లలుగా ఉంటాయి. వీళ్ల పుణ్యమా అని అత్యుత్సాహంతోనో, అమాయకంగానో లక్షలు లక్షలు పోగొట్టుకొనే డైరెక్టర్లు బోలెడంతమంది ఉంటారు.
సమాజంలో అత్యంత గౌరవనీయమైన స్థానంలోనో, అతి పెద్ద హోదాలోనో ఉన్న ఎంతోమంది సోకాల్డ్ ఇన్వెస్టర్లు "వచ్చే బుధవారం 5 కోట్లు పంపిస్తా, మీరు స్టార్ట్ చేయండి" అని చాలా నమ్మకంగా ప్రామిస్‌లు చేస్తారు.
99.9 శాతం ఆ మాటలన్నీ నీటిమూటలే.
రాజకీయరంగం నుంచి అయితే ఇలాంటి ప్రామిస్‌లను వందకి వంద శాతం నమ్మొద్దు.
"మరి ఈ డైరెక్టర్స్ అంత అమాయకులా, చదువుకోలేదా"... అని అనిపించొచ్చు. కానే కాదు. పీజీలు, పిహెచ్‌డీల్ చేసినవాళ్ళు కూడా ఎందరో ఉన్నారు. అయినా బోల్తా పడతారు.
అవతలివారి స్థాయి, "పని అయిపోతుంది కదా" అన్న ఆశ... వారిని అలా టెంప్ట్ చేస్తుంది.
అంతే.
తిరిగి లేవలేని ఊబిలో కూరుకుపోతారు.
కట్ చేస్తే -
ఎలాంటి సిచువేషన్లో అయినా టెంప్ట్ కాని ఒక 20 శాతం మంది జ్ఞానులైన డైరెక్టర్స్ మాత్రం బాగుంటారు. ఎక్కడా ఎలాంటి తప్పటడుగు వేయరు.
ఇలాంటి స్థితప్రజ్ఞులను చూసైనా నేర్చుకోవాలి అనుకునే లోపే, చాలామంది డైరెక్టర్స్ చేతులు కాలిపోయుంటాయి. ఆకుల కోసం వారి అన్వేషణ ఒక మొగిలిరేకులు సీరియల్‌లా సాగుతూవుంటుంది.
సో, ఇదింతే.
ఈ సిస్టమ్ ఇలాగే ఉంటుంది.
ఈ వ్యవస్థ ఇలాగే ఉంటుంది.
ఇదొక బిజినెస్.
బిజినెస్‌ను బిజినెస్ లాగే ఆలోచిస్తే సమస్యలుండవు.
ఫ్లాప్ సినిమాలు తీసినా అప్పుల్లో ఉండరు.
బిజినెస్‌ను బిజినెస్ లాగే ఆలోచిస్తే సమస్యలుండవు.
ఫ్లాప్ సినిమాలు తీసినా అప్పుల్లో ఉండరు.
అయితే ఈ టెక్నిక్ నేర్చుకోవడం అందరికీ సాధ్యం కాదు.
కట్ చేస్తే -
Cinema is not for the comfortable.
It tests your patience, your money, your sanity.
In the end, it doesn’t reward the most talented —
It rewards the last one still standing.
కట్ చేస్తే -
ఇదంతా - డైరెక్టర్స్ అప్పుల్లో ఉండటానికి కారణమైన జస్ట్ ఒక్క టెంప్లేట్ మాత్రమే. ఇంకో 99 రకాల కారణాలతో, ఇంకో 99 టెంప్లేట్స్ ఉంటాయన్నది చాలా బాధాకరమైన, నమ్మశక్యం కాని రియాలిటీ.
ఇలాంటి నేపథ్యం పట్ల కనీసం 1% అయినా అవగాహన లేని బయటి వ్యక్తులు డైరెక్టర్స్‌కు నానా ఉచిత సలహాలిస్తుంటారు. అది వేరే విషయం.
Cinema is not for the comfortable.
It tests your patience, your money, your sanity.
In the end, it doesn’t reward the most talented —
It rewards the last one still standing.
- మనోహర్ చిమ్మని

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani