ట్రాక్ మీదున్నప్పుడే ఎవరైనా మనల్ని పట్టించుకునేది. ఏ ఫీల్డు అయినా అంతే.
సో, చిన్న సినిమానా పెద్ద సినిమానా అన్నది కాదు పాయింట్. అసలు సినిమా అంటూ ఒకటి చేస్తుండటం చాలా అవసరం.
ఎవరికోసమో కాదు. మనకోసం.
ఎవరికోసమో కాదు. మనకోసం.
కట్ చేస్తే -
మొన్నొక రోడ్ క్రైమ్ సినిమా చేశాను. పోస్ట్ ప్రొడక్షన్ ఇంకా జరుగుతోంది.
ఇండిపెండెంట్ సినిమా కదా... నానా కష్టాలుంటాయి. ప్రొడ్యూసర్, డైరెక్టర్స్‌కి తప్ప మిగిలినవాళ్ళకు వీటిగురించి అవసరం ఉండదు. అసలు తెలుసుకోరు, పట్టించుకోరు.
విషయం ఏంటంటే - ఈ సినిమా జరిగినన్నాళ్ళూ దాదాపు ప్రతి ఒక్కళ్ళూ నాకు రోజూ గుడ్మార్నింగులూ, పండగలకు-అకేషన్స్‌కు గ్రీటింగ్స్, "ఇంక మిమ్మల్ని వదిలేది లేదు" అన్న రేంజ్‌లో మాటలు, సోషల్ మీడియాలో లైకులు గట్రా... ఓ భలే ఓవర్ యాక్టింగ్ ఉండేది.
ఒక వాట్సాప్ హాయ్ ఉండదు. ఒక కాల్ ఉండదు.
మళ్ళీ ఏదైనా ప్రి-రిలీజ్ ఈవెంట్ అన్నామా... మొత్తం వాలిపోతారు.
సీన్ రిపీట్.
గుడ్మార్నింగ్స్, గుడీవెనింగ్స్, గుడ్ నైట్స్. హాప్పీ సంక్రాంతులు, ఉగాదులు, దసరాలు, ఇండిపెండెంట్ డేస్... గట్రా.
నిజానికి, ఈ డ్రామా అంతా నా మొదటి సినిమా నుంచీ చూస్తూనే ఉన్నాను కాబట్టే ఒక్కొక్కళ్ళ ఓవర్ యాక్షన్ అంతా బాగా ఎంజాయ్ చేశాను.
ఆర్టిస్టులైనా, టెక్నీషియన్స్ అయినా, 95 శాతం కొత్తవాళ్లకు సినిమా అంటే జస్ట్ షూటింగ్ మాత్రమే.
"ఓస్ ఇంతేనా?!" అనుకుంటారు.
"ఓస్ ఇంతేనా?!" అనుకుంటారు.
ఇలాంటి అల్ప సంతోషులకు తర్వాత కనిపిస్తుంది అసలు బొమ్మ.
మిగిలిన ఏ 5 శాతం మంది అయితే సినిమాల్ని సీరియస్‌గా పట్టించుకుంటారో... వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ యాటిట్యూడ్ ఇలా ఉండదు. నిరంతరం నేర్చుకుంటూనే ఉంటారు. అది వారి పదవ సినిమా అయినా, మొదటి సినిమాలాగే ఉంటారు.
ఈ 5 శాతం మందే ఏ కొంచెమైనా సాధించగలుగుతారు... సినిమాల్లో అయినా, జీవితంలో అయినా.
ఏ డైరెక్టర్ అయినా తన టీమ్ కోసం, సినిమాను సీరియస్‌గా తీసుకొనే ఆ 5% కోసమే ప్రయత్నిస్తాడు. కాని అదంత ఈజీ కాదు.
ఏ డైరెక్టర్ అయినా తన టీమ్ కోసం, సినిమాను సీరియస్‌గా తీసుకొనే ఆ 5% కోసమే ప్రయత్నిస్తాడు. కాని అదంత ఈజీ కాదు.
కట్ చేస్తే -
ఇప్పుడు మళ్ళీ ఓ కొత్త ప్రాజెక్టు ప్రారంభం కాబోతోంది.
కాని, ఈసారి సీన్ రిపీట్ కావడం నాకిష్టం లేదు.
కాని, ఈసారి సీన్ రిపీట్ కావడం నాకిష్టం లేదు.
- మనోహర్ చిమ్మని

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani