సాదిక్ ఓయూలో నాకు సీనియర్.
మేమిద్దరం కలిసినప్పుడల్లా కనీసం ఒక రెండుమూడు గంటలపాటు ఎన్నో విషయాల మీద చర్చించుకొనేవాళ్ళం. ఇలా మేం చర్చించుకున్నపుడల్లా నాకు కొన్ని విషయాలు కొత్తగా అర్థమయ్యేవి. జ్ఞానోదయం అయినట్టుగా ఫీలయ్యేవాణ్ణి.
సాదిక్ చనిపోయినపుడు నేను అతన్ని చూడ్డానికి వెళ్ళలేకపోయాను. నాకెందుకో ఆ నిజం నచ్చలేదు. అబద్ధమయితే బాగుండుననిపించింది.
అంతకుముందు కొన్నిరోజుల క్రితమే మేం దస్పల్లాలో కలిశాం. ఆ తర్వాత బహుశా ఒక వారంలోనే సాదిక్ మరణవార్త విన్నాను.
కట్ చేస్తే -
ఇప్పుడు సాదిక్ గురించి ఈ బ్లాగ్ రాయడానికి ఒక కారణముంది.
Love yourself like your life depends on it.
సాదిక్ రెండు విషయాల్లో నాకెప్పుడూ గుర్తుంటాడు.
ఒకటి -
ఓ పదేళ్ళ క్రితం నేనొక రొమాంటిక్ హారర్ సినిమా చేస్తున్నప్పుడు, ఒక విషయంలో నేనే షాక్ అయ్యేంతగా అతని నిర్మొహమాటపు నిజాయితీ. అతని మాట తప్పని గుణం. ఇది నాజీవితంలో నేను ఎన్నటికీ మర్చిపోలేని విషయం.
రెండోది -
ఆ తర్వాత కలిసినప్పుడు ఒకరోజు నాతో ఒక మాట అన్నాడు సాదిక్.
"మనూ, నేనిప్పుడు ఒకరి మీద పెడుతున్న నా సమయంలో కేవలం ఒక పది శాతం సమయం నా మీద నేను పెట్టుకుంటే సీన్ వేరేలా ఉంటుంది" అన్నాడు సాదిక్. "నువ్వే చూస్తావుగా" అన్నాడు.
అన్నట్టుగానే - కేవలం కొన్ని నెల్లల్లోనే సాదిక్ తను చెప్పింది చేసి చూపించాడు.
ముందే నాకు చెప్పి, చేసి చూపించిన సాదిక్ నాకు ఈ విషయంలో పెద్ద ఇన్‌స్పిరేషన్.
ఈ విషయాన్ని నా అతిదగ్గరి మిత్రులు కొందరితో చాలాసార్లు షేర్ చేసుకున్నాను. ఇది కూడా నేను అసలు మర్చిపోలేని విషయం.
ఈ విషయాన్ని నా అతిదగ్గరి మిత్రులు కొందరితో చాలాసార్లు షేర్ చేసుకున్నాను. ఇది కూడా నేను అసలు మర్చిపోలేని విషయం.
ఇప్పుడు నేను సాదిక్ చెప్పిన ఆ సూత్రం పాటిస్తున్నాను.
సమయం తిరిగిరాదు. మన కోసం కూడా మనం ఆలోచించుకోవాలి. అది తప్పేం కాదు.
సమయం తిరిగిరాదు. మన కోసం కూడా మనం ఆలోచించుకోవాలి. అది తప్పేం కాదు.
Love yourself like your life depends on it.
- మనోహర్ చిమ్మని
.jpg)
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani