నిజంగా నాకిప్పుడేం పనిలేదు. సినిమానే పని, ప్యాషన్, ఆక్సిజన్... అన్నీ.
పక్కా కమర్షియల్.
ఈ జర్నీలో జెర్క్‌లూ, ఎదురు దెబ్బలూ, ఊహించని స్టకప్‌లూ సర్వసాధారణం. భారీ భారీ నిర్మాతలకు, దర్శకులకే ఇలాంటివి తప్పలేదు, తప్పవు.
దటీజ్ సినిమా.
పెద్ద ఫరక్ పడదు.
కట్ చేస్తే -
నా సోషల్ మీడియాలో గాని, నా బ్లాగ్‌లో గాని... దాదాపు పూర్తిగా సినిమా కంటెంటే ఉంటుంది.
క్లాస్, మాస్, క్లాసికల్లీ మాస్.
పోస్టులకు, ఫోటోలకు కూడా సంబంధం ఉండకపోవచ్చు.
పోస్టులకు, ఫోటోలకు కూడా సంబంధం ఉండకపోవచ్చు.
నాకు నచ్చిన కంటెంట్. నాకు నచ్చకపోయినా ప్రొఫెషనల్లీ నేను పోస్ట్ చెయ్యాలనుకున్న కంటెంట్. ఔత్సాహికులకు పనికొచ్చే కంటెంట్. పనికిరాని కంటెంట్ అనిపించే పరోక్షంగా పనికొచ్చే కంటెంట్... అన్నీ ఉంటాయి.
నా అశేష మేధావి మిత్రబృందంలో చాలామందికి ఈ కంటెంట్ నచ్చకపోవచ్చు. నా పోస్టుల మీద, నా బ్లాగ్-పోస్టుల మీద, నిర్మాణాత్మక విమర్శలు ఓకే. హిపోక్రసీ రాతలు మాత్రం వద్దని మనవి. దానికంటే నన్ను అన్‌ఫ్రెండో, బ్లాకో చెయ్యటం బెటర్.
పైన నిర్భయంగా పోస్ట్ చేసేవాడు కింద కామెంట్స్ పట్టించుకోవద్దు" అన్న సూత్రం అక్షరాలా పాటిస్తున్నాను.
Peace.
ఓం నమశ్శివాయ.
- మనోహర్ చిమ్మని

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani