95 ఏళ్ళ క్లింట్ ఈస్ట్‌వుడ్ ఈమధ్యే ఒక సినిమాకు దర్శకత్వం వహించారు. ఆ సినిమా పేరు జ్యూరర్ #2. మొన్న నవంబర్ 1 నాడు రిలీజ్ అయింది.
79 ఏళ్ల స్టీవెన్ స్పీల్‌బర్గ్ ఇంకా సైన్స్‌ఫిక్షన్/యు-ఎఫ్-ఓ సినిమాలు చేస్తున్నారు.
71 ఏళ్ళ జేమ్స్ కెమెరాన్ అవతార్-4 ను 2029లో రిలీజ్ చెయ్యడానికి, అవతార్-5ను 2031లో రిలీజ్ చెయ్యడానికి డైరెక్షన్ వర్క్‌లో ఫుల్ బిజీగా ఉన్నారు.
దేశంలోనే అత్యధికస్థాయి రెమ్యూనరేషన్ కోట్లల్లో తీసుకొంటున్న ప్రముఖ కథారచయిత విజయేంద్రప్రసాద్ గారి వయస్సు 82.
చిన్న గ్యాప్ తర్వాత, ఇప్పుడు రెండు హిందీ సినిమాలు, ఒక హాలీవుడ్ ప్రాజెక్టు చేస్తున్న శేఖర్ కపూర్ వయస్సు 80.
దేశంలోనే అత్యధికస్థాయి రెమ్యూనరేషన్ కోట్లల్లో తీసుకొంటున్న ప్రముఖ కథారచయిత విజయేంద్రప్రసాద్ గారి వయస్సు 82.
చిన్న గ్యాప్ తర్వాత, ఇప్పుడు రెండు హిందీ సినిమాలు, ఒక హాలీవుడ్ ప్రాజెక్టు చేస్తున్న శేఖర్ కపూర్ వయస్సు 80.
మణిరత్నం (69), ఆర్జీవీ (63) ఇంకా యాక్టివ్‌గా సినిమాలు తీస్తున్నారు.
అమితాబ్ బచ్చన్‌కు 83, చిరంజీవికి 70, నాగార్జునకి 66, వెంకటెష్‌కు 65. అందరూ యమ యాక్టివ్‌గా సినిమాలు చేస్తున్నారు.
కట్ చేస్తే -
ఇప్పటికే 60 సినిమాలు చేసిన ప్రఖ్యాత దర్శకులు సింగీతం శ్రీనివాసరావు గారు ఇప్పుడు తాజాగా తన 61వ సినిమాను వైజయంతీ మూవీస్ బ్యానర్లో చేస్తున్నట్టు ఇవ్వాళే ప్రకటన వచ్చింది.
"సెల్యులాయిడ్ సైంటిస్టు" సింగీతం గారి వయస్సు ఇప్పుడు 94.
కట్ చేస్తే -
"సెల్యులాయిడ్ సైంటిస్టు" సింగీతం గారి వయస్సు ఇప్పుడు 94.
కట్ చేస్తే -
50, 60 కే "అంతా అయిపోయింది... ఇంకేముంది" అనుకొనేవాళ్ళంతా కొంచెం ఆలోచించాలి.
అంతే కాదు, 30 ల్లోనే ఎప్పుడూ "నాకు అది లేదు... ఇదిలేదు" అంటూ నిరంతరం సాకులతోనే సమయం వెల్లదీస్తున్న అపర వృద్ధాగ్రేస యువకులు కూడా ఒకసారి వారి మైండ్‌సెట్ గురించి ఆలోచించాలి.
వయస్సు కాదు, మనసు ముఖ్యం.
పట్టుదల, తపన, కసి ముఖ్యం.
పనిచేస్తూవుండటం ముఖ్యం.
వయ్యస్సనేది జస్ట్ ఒక అంకె మాత్రమే.
పనిచేస్తూవుండటం ముఖ్యం.
వయ్యస్సనేది జస్ట్ ఒక అంకె మాత్రమే.
అన్నిటికంటే ముఖ్యమైన పాయింట్ -
"50 దాటినవాళ్ళు ఫిలిం డైరెక్షన్‌కు పనికిరారు" అంటున్న టాలీవుడియన్స్ కొందరు వెంటనే మంచి సైకియాట్రిస్టును కలవటం మంచిది.
Experience Has No Expiry Date.
There’s No Deadline on Dreams.
Start Now. Any Age.- మనోహర్ చిమ్మని

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani