Thursday, 2 April 2026

Luck Is Edited in Post


“Luck” makes for a nice story.
But it’s a terrible strategy.

In film, what looks like a lucky break is hours of unseen work—retakes, rewrites, relentless effort. The audience sees the final cut. They don’t see the grind behind it.

Life works the same way.

Luck doesn’t exist.
Massive action does.

The more you show up, the more you attempt, the more you put yourself in motion—the “luckier” you seem. Not because chance favours you, but because you’ve created more chances.

Opportunities don’t knock randomly.
They appear where action lives.

So, stop waiting for luck.
Start stacking action.

Because in the end, luck is just the byproduct of those who refuse to stay still.

What’s one bold action you can take today? Take it—no waiting.

-Manohar Chimmani  

Wednesday, 1 April 2026

The Gap Between Noise and Impact


Everyone talks. Few are heard.

Communication is easy—it’s just words moving from one mouth to another ear.
Connection is rare—it’s when something lands, when a thought becomes a feeling.

You don’t connect by saying more.
You connect by seeing more understanding the person in front of you.

People don’t remember your words.
They remember how you made them feel in the silence between them.

Speak to impress, and you’ll be forgotten.
Speak to connect, and you’ll be remembered.

Next time you speak, ask yourself—am I talking, or am I truly connecting?

-Manohar Chimmani 

Tuesday, 31 March 2026

మన చుట్టే, మన మధ్యే, మనకు తెలిసే...


వెనుకట, మన చిన్నప్పుడు "తుపాకి రాముడు" అని ఒక క్యారెక్టర్ మన ఇళ్ళ ముందుకు వచ్చి, మన ఊహకందని కోతలు కోస్తూ ప్రదర్శన ఇస్తుండేవాడు. 

ఆ ప్రొఫెషనల్ కోతలకి, అబద్ధాలకి మనం పడిపడి నవ్వేవాళ్ళం. ఎంజాయ్ చేసేవాళ్ళం. కాసేపయ్యాక, ఇన్ని డబ్బులో, బియ్యమో ఇచ్చేవాళ్ళం. వెళ్ళిపోయేవాడు. 

"ఇప్పుడా క్యారెక్టర్ ఎక్కడా ఉన్నట్టు లేదు"... అనుకుంటాం. 

కాని, ఉంది. 

మన చుట్టే. మన మధ్యే. మనకు తెలిసే.   

కట్ చేస్తే -

బహుశా ఇలాంటి బ్లాగ్ పోస్టులు ఇకమీదట నేను రాయకపోవచ్చు.

అవసరం లేదు. 

ఎవరు ఎంచుకున్న జీవనవిధానం వారిది. ఎవరి జీవనశైలి వారిది. మనకు నచ్చనప్పుడు వదిలెయ్యాలి. మనకూ, మన సమయానికి నష్టం కలిగిస్తుంటే మాత్రం జాగ్రత్తపడాలి.   

ఏది ఎలావున్నా, కనీసం ఇలాంటి రియాక్టివ్ ఫీలింగ్స్‌ను అదుపులో పెట్టుకోగలిగే స్థితప్రజ్ఞత మనం సాధించాలి. 

మన చుట్టూనో, మనతోపాటేనో, మన టీమ్‌లోనో ఉండే ఇలాంటి మనుషుల్లోని మనకు నచ్చని ఆ నెగెటివిటీ పార్ట్ గురించి మనం ఎందుకు అంతగా పట్టించుకోవాలి? అంత బాధపడాలి?  

ఇదే మనుషుల్లో మనకు పనికొచ్చే ఏ కొంచెం మంచి ఉన్నా, దాన్ని అప్రిషియేట్ చెయ్యటం మంచిది కదా?   
 
- మనోహర్ చిమ్మని  

Monday, 30 March 2026

అవసరమైతే "ప్లాన్-ఎఫ్" కూడా అవసరం!


డిపెండెన్సీ... అనేది ఎప్పుడూ మంచిది కాదు. మనం ఊహించని టైమ్‌లో అది కొట్టే దెబ్బ నుంచి మనం కోలుకోడానికి చాలా టైమ్ పడుతుంది. మానసిక బలహీనులైతే అసలు కోలుకోలేరు. 

ఇవ్వాళ మధ్యాహ్నం నేనూ, నా ఫ్రెండ్ ఒకరు ఇదే విషయం కాసేపు మాట్లాడుకున్నాం. 

బిజినెస్ & డబ్బు విషయంలో ఏ ఒక్కరి మాట, ఏ ఒక్కరి ప్రామిస్‌ను "టేకిట్ ఫర్ గ్రాంటెడ్‌గా తీసుకోవడం" అంత పెద్ద తప్పు ఇంకోటి ఉండదు.   

కట్ చేస్తే - 

అర్నాల్డ్ ష్వార్జ్‌నిగ్గర్ "నో ప్లాన్-బి" అంటాడు. అది అందరికీ, అన్నివేళలా కుదరదు. అర్నాల్డ్‌కు కుదిరింది అంతే.  

ప్లాన్-బి నుంచి సి-డి-ఇ... అవసరమైతే ప్లాన్-ఎఫ్ కూడా అవసరం. ఇది అనుభవం మీదే తెలుస్తుంది. 

- మనోహర్ చిమ్మని      

Time Is the Real Director


In cinema, we obsess over cameras, scripts, and performances.
But the real director is time.

Time decides what gets made—and what stays an idea.
It quietly watches who shows up and who keeps postponing.

Every film is just time, shaped with intention.
A plot is time.
A character is time.
A scene is time.
An emotion is time.
A story is time, remembered.

The creators who win aren’t always the most talented.
They’re the ones who respect time enough to use it—daily, deliberately.

Because every day you don’t create,
your story doesn’t pause.
It disappears.

Don’t wait for the perfect moment. Direct the time you have.

- Manohar Chimmani 

Sunday, 29 March 2026

Roll Camera on Courage


We fear failure like it’s a final verdict.

But the real loss? Living the same scene on repeat.

In life—just like in film—the story only moves when you take the shot. Not when you plan endlessly. Not when you wait for perfect lighting. But when you say, “Roll camera,” and step into the unknown.

Every attempt shifts something. Even if the outcome isn’t perfect, the act itself breaks inertia. It rewrites your character—from someone who hesitates to someone who acts.

Not every effort becomes a blockbuster. Some scenes don’t land. Some edits don’t work. But every time you push your limits, you’ve already won half the battle.

Because courage compounds.

Be proud of the attempt. That’s where your real evolution begins.

Like Puri Jagan, work should become your very breath. In your work, you should find your love, your peace—your God.

What’s one shot you’ve been postponing? Roll camera today.

- Manohar Chimmani 

Saturday, 28 March 2026

The Real Loss Isn’t Failure


We fear failure like it’s the end of the story.
But the real tragedy? Never stepping out of the same frame.

In life—just like in cinema—the magic happens when you take the shot. Not when you sit in safety, endlessly rewriting the script in your head.

Every time you push your limits, you’ve already won half the battle. You’ve disrupted comfort. You’ve chosen movement over stagnation. That alone sets you apart.

Not every attempt becomes a blockbuster. Some scenes fall flat. Some stories don’t land. But the courage to roll the camera anyway—that’s where growth lives.

Be proud of the attempt. That’s where your real evolution begins.

What’s one “shot” you’ve been postponing? Take it today.

- Manohar Chimmani 

Thursday, 26 March 2026

నిజంగా ధురంధర్ ఒక ప్రాపగాండా సినిమా అనుకుంటే...


ధురంధర్ కూడా ఒక సినిమా. అంతే.

రక్తపాతం, హింస మాత్రం అతి దారుణంగా ఉంది. ఇలాంటి సబ్జెక్టు ఇంత ఎఫెక్టివ్‌గా రావాలంటే బహుశా ఈ స్థాయి హింస సినిమాలో చూపించక తప్పలేదనుకుంటా.  

భారత్‌లో జరిగిన కొన్ని సంఘటనల్ని చాప్టర్స్‌గా ప్లాన్ చేసుకున్నాడు. పనికిరాని హీరోయిజమ్ బిల్డప్స్ జోలికిపోలేదు. తాను అనుకున్న కథను ఒక హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా రెండు భాగాల్లో అద్భుతంగా రూపొందించి, ఒక ఫిలిం డైరెక్టర్‌గా రికార్డులు బ్రేక్ చేసుకుంటూవెళ్తున్నాడు... ఆదిత్యధర్.  

కట్ చేస్తే -

"ఆదిత్యధర్ ఒక ప్రాపగాండా మూవీచేశాడు" అని అనేవాళ్ళు అనొచ్చు. వారికా ఫ్రీడమ్ ఉంది. 

సినిమా కూడా ఇప్పుడొక అతి పెద్ద శక్తివంతమైన సోషల్ మీడియా సాధనంలాగా మారింది. ఈ పవర్‌ఫుల్ సాధనం అందరికీ అందుబాటులో ఉంది.    

నిజంగా ధురంధర్ ఒక ప్రాపగాండా సినిమా అనుకుంటే, ఎవరి ప్రాపగాండా సినిమాలు వాళ్ళు తీసుకునే స్వేచ్ఛ ఈ దేశంలో అందరికీ ఉంది. దాదాపు ప్రతి పార్టీకి ఆమాత్రం ఫండ్స్ ఉన్నాయి, ఫండింగ్ సోర్సెస్ ఉన్నాయి. ఆయా పార్టీలకు అనుకూలమైన డైరెక్టర్స్ కూడా చాలామంది ఉన్నారు.  

మీడియాను, సోషల్ మీడియాను, సినిమాను ఎవరు ఎంత బాగా ఉపయోగించుకోగలుగుతారు అన్నదానిమీదే వచ్చే ఎన్నికల్లో జయాపజయాలు ఆధారపడివుంటాయి. ఇందులో ఎలాంటి అతిశయోక్తి లేదు.    

- మనోహర్ చిమ్మని        

Wednesday, 25 March 2026

మనం నమ్మితీరాల్సిన "బటర్‌ఫ్లై ఎఫెక్టు!"


అంతకుముందు సినిమాల్లో చూసినప్పుడు, బుక్స్‌లో చదివినప్పుడు, ఎవరైనా చెప్పినప్పుడు... ఈ "బటర్‌ఫ్లై ఎఫెక్ట్" గురించి నేను పెద్దగా నమ్మలేదు.

కాన్సెప్ట్ శాస్త్రీయమైనదే అయినా చాలా లైట్ తీసుకున్నాను. నవ్వాను కూడా.  
 
కాని అది నిజం అని ఇప్పుడు నమ్ముతున్నాను. 

"ప్రజలు కోరుకొన్న ఒక మార్పు కోట్లాది మంది జీవితాల్ని, వ్యాపారాలను, ఉద్యోగాలను, ఆలోచనలను, ప్లాన్స్‌నూ, మొత్తం ఆర్థికస్థితిగతుల్ని కూడా కిందామీదా చెయ్యగలదు" అన్నది ఇప్పుడు నేను నా కళ్ళారాచూస్తున్నాను. 

ఇక్కడ బటర్‌ఫ్లై ఎఫెక్ట్... ఒక మార్పు. 

ఒకటి రాష్ట్రస్థాయిలో జరిగింది.
ఇంకోటి అంతర్జాతీయంగా జరిగింది. 

ప్రాంతీయంగా ఒకరు, అంతర్జాతీయంగా ఒకరు... మొత్తం అల్లకల్లోలం చేస్తున్నారు. 

అయితే... ఈ మార్పు, ఈ ఎఫెక్టు ప్రజలు కోరుకున్నదే కావడం విశేషం.

కట్ చేస్తే - 

జస్ట్ గత రెండున్నరేళ్లలో, అప్పటివరకు బాగా నడుస్తున్న, నాకు బాగా తెలిసిన, ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ పూర్తిగా బిజినెస్ లేక ఎంతో నష్టపోయింది.   

జీరో సేల్స్.
జీరో రిజిస్ట్రేషన్స్.
జీరో ఇన్‌కమ్.

ఆ కంపెనీకి ఉన్న 7 ఆఫీసుల్లో... ఒకదాని తర్వాత ఒకటిగా, గత రెండేళ్ళలో మొత్తం 6 ఆఫీసులను నా కళ్ళముందే మూసేశారు. చివరి ఆఫీసుని (7 వది) ఈరోజు మూసేశారు. నేనే ప్రత్యక్ష సాక్ష్యం.   

#ButterFlyEffect నిజంగా నిజమే అని చెప్పడానికి ఇంతకంటే గొప్ప ఉదాహరణ ఏముంటుంది? 

జస్ట్ ఇదొక ఉదాహరణ. ఇలాంటి ఉదాహరణలు మన చుట్టూవున్న మనుషుల జీవితాల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, వృత్తుల్లో... లెక్కలేనన్ని ఉంటాయి.  

విషాదం ఏంటంటే... ఇలాంటి బటర్‌ఫ్లై ఎఫెక్టును ఎంజాయ్ చెయ్యడానికి ఇదేం సుకుమార్ సినిమా కాదు.  

జీవితం.     

- మనోహర్ చిమ్మని   

Ink Beats Overthinking


You don’t need a better app.
You need a pen.

Thinking in your head feels productive—until it loops. Same ideas. Same doubts. No progress.

But the moment the pen hits paper, something shifts. Thoughts slow down. Ideas take shape. Confusion turns into clarity.

Writing isn’t just recording what you think. It’s how you discover what you think.

Messy notes beat perfect intentions. Every time.

So grab a pen. Not to write it well—just to write it real.

Because better thinking doesn’t happen in your head.
It happens on paper.

- Manohar Chimmani 

Tuesday, 24 March 2026

The Power of Letting Go


Big relief isn’t loud. It’s quiet. It’s the moment you stop forcing what no longer fits.

We’re taught to endure, to wait it out, to keep pushing—even when the work, the role, the path isn’t ours anymore. But staying past your season isn’t loyalty. It’s drift.

What if the real courage is in leaving?

Not everything deserves your persistence.
Some things deserve your goodbye.

Because when you stop spending energy on what drains you, you finally have the space to give your best to what fuels you.

No more “wait and see.”
No more borrowed paths.

Choose what feels alive.
Live fully.
Live with passion.

The next version of your life begins the moment you honor the decision you’ve already made.

- Manohar Chimmani 

Monday, 23 March 2026

బ్లాక్ కాఫీ రూల్


ఆమధ్య ఎక్కడో చదివాను. 
ఈమధ్యే అప్లై చేశాను. 
వందకి వంద శాతం ఈ రూల్ బాగా పనిచేస్తుంది.

ఎలాగంటే -

జస్ట్ బ్లాక్ కాఫీ. 
షుగర్ లేదు.
క్రీమ్ లేదు.
పాలు లేవు.

ఇది త్రాగటం మొదలెట్టినప్పటినుంచీ నా పనిలో, ఆలోచనల్లో, మొత్తంగా నాలోనే చాలా మార్పు నేను గమనించాను.

నో మిల్క్.
నో షుగర్.
నో క్రీమ్.
జస్ట్ ఒక్కటే... ప్లెయిన్ బ్లాక్ కాఫీ.

ముందు కొంచెం చేదుగా, అదొక రకంగా అనిపించింది. కాని రెండోరోజు నుంచే ఆ టేస్టే బాగనిపించింది. నచ్చింది. 

ఉన్నట్టుంది నా ఆలోచనలు, నా పనితీరు, నా జీవనశైలి, నా చుట్టూ వాతావరణం... అంతా మారిపోయింది. 

ఇంతకు ముందులా అందరికీ నేను నేను కాదు.   

కట్ చేస్తే -

బ్లాక్ కాఫీ రూల్ ఏం చెప్తుంది అంటే:

1. నీకు ఏది మంచో అది మాత్రమే ఎన్నుకో.
2. ఎవరికోసమో షుగర్ కోటింగులు, షార్ట్‌కట్‌లు, మొహమాటాలు వద్దు. 
3. మనకు పనికిరాని కవరింగులు, కమ్‌ఫర్ట్ అసలు వద్దు.

ప్రారంభంలో అంత బాగాలేకపోవచ్చు. కాని, నిజంగా మనకు పనికొచ్చేది అయితే చాలు, ఆ పనే చెయ్యి. అలాంటి నిర్ణయమే తీసుకో... ఎప్పుడైనా, ఎలాంటి పరిస్థితుల్లో అయినా. 

అంతా బాగుంటుంది.
బ్లాక్ కాఫీ తాగుతున్నట్టు.

- మనోహర్ చిమ్మని  

She Didn’t Have Time. She Made Time.


A single mother. Three kids. A full-time job.
No luxury. No “perfect moment.” No guarantee.

That was J.K. Rowling before the world knew her name.

She didn’t wait for time to appear.
She wrote in cafés, between responsibilities, inside exhaustion.
She chose progress over perfection.
Sentence by sentence. Day by day.

What we call magic today was built in ordinary, difficult moments.
Not when life was easy — but when it was hardest.

You may think you don’t have time to create something great.
But maybe greatness is built exactly in the life you’re living right now.

What’s one small step you’ll take today toward your “Harry Potter”? Write it below.

- Manohar Chimmani 

Sunday, 22 March 2026

The Power You Keep


I am responsible for what I think and feel.
Not the world. Not the moment. Me.

Decisions can fail without fault.
But choosing them is still mine.

Blame is an exit.
Responsibility is a return. 

Life will test. People will trigger. Situations will shake.
I stay anchored to my word, my principles—and I respect the law of the land.

Responsibility isn’t weight.
It’s freedom.

- Manohar Chimmani

Saturday, 21 March 2026

Guy On The Sidewalk


చాలా గ్యాప్ తర్వాత మొన్నామధ్య మా స్టుడెంట్ భరత్ కలిశాడు. ఇద్దరం ఒక రెండుమూడు గంటలు చాలా ఓపెన్‌గా మాట్లాడుకున్నాం. 

భరత్ యు యస్ వెళ్ళి, అక్కడ చదివి, కొన్నేళ్ళు ఉద్యోగాలు చేసి, "ఓస్ ఇంతేనా అమెరికా" అని ఫీలయ్యి తిరిగి భారత్ వచ్చేశాడు.  

వస్తూనే "గై ఆన్ ది సైడ్‌వాక్" పేరుతో ఒక ఇంగ్లిష్ బెస్ట్ సెల్లర్ ఫిక్షన్ రాశాడు. 

ఇక్కడ ఒక మల్టినేషనల్ కంపెనీలో కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నాడు. 

కొంచెం గ్యాప్ తర్వాత, ఇప్పుడు మళ్ళీ సీరియస్‌గా రాయడం మొదలెట్టాడు భరత్. 

బహుశా మే నెలలో భరత్ కొత్త బుక్ లాంచ్ ఉంటుంది. ఈసారి ఆ బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పాను.

కట్ చేస్తే -

నాకో సలహా ఇచ్చాడు మా భరత్...

"మీరు సినిమాలు చేసుకుంటారో, ఇంకేం చేస్తారో నాకు తెలీదు. మీరు బాగా రాస్తారు. రాయండి. కథలు రాయండి. నవల్స్ రాయండి. రాయటమే ప్రయారిటీగా పెట్టుకోండి" అని ఖరాఖండిగా చెప్పాడు. 

భరత్‌లో నాకు నచ్చేది అదే. నిర్మొహమాటంగా అనుకున్నది చెప్పేస్తాడు. నో షుగర్ కోటింగ్. 

- మనోహర్ చిమ్మని 

Friday, 20 March 2026

అసలు మనుషులా, రాక్షసులా, నరమాంస భక్షకులా?


ఎవరు విలన్, ఎవరు హీరో అన్నది కాదు పాయింట్.
సబ్జెక్ట్ ఏంటి అన్నది కూడా కాదు పాయింట్. 
అసలు ఏం చూపిస్తున్నాం, ఎంత రాక్షసంగా మారిపోతున్నాం అన్నది పాయింట్.

ఆ మధ్య యానిమల్ సినిమా చివర్లో, యానిమల్ పార్క్ గురించిన ఒక సీన్ ఉంటుంది. అందులో రణబీర్ కపూర్ పెద్ద కత్తితో మనుషుల్ని కైమా కొడతాడు. అతని మొహం మీదకి రక్తం చిమ్ముతుంటే ఈ పని చేస్తాడు.

హీరో నాని హిట్-3 సినిమాలో కూడా అత్యంత దారుణమైన రక్తపాతం ఉంటుంది. ఒక నెలరోజుల చిన్న బేబీని పట్టుకొని కూడా ఇలాంటి రక్తపాతపు సీన్ ఉంటుంది. ఏం చెప్పాలి? ఎంత క్రూరమైన విజన్?

"అసలు వయొలెన్స్ అంటే ఎలావుంటుందో నేను చూపిస్తా" అని ఒకరి మీద ఇంకొకరు పోటీపడుతున్నారు. 

ధురంధర్, ధురంధర్ ది రివేంజ్‌లో కూడా రక్తపాతం మనుషులు చూసేలా లేదు. 

మనుషుల్ని అత్యంత దారుణంగా నరకటాలు, రక్తం చిమ్మే శబ్దాలు, పుచ్చెలు పేలిపోవటాలు అతి సాధారణమైపోయాయి. ఒక మనిషి తలను తెగనరికి, ఆ తలతో నడిబజార్లో ఫుట్‌బాల్ ఆడుకోవడం సీన్ ఏదైతే ఉందో... నిజంగా మెచ్చుకుందామా?

మనుషుల్లో క్రమంగా అసలు సున్నితత్వం అనే ఫీలింగే లేకుండా చేస్తున్న వీరి రాక్షస ఆలోచనలకు బాధపడదామా? 

కట్ చేస్తే -

ఇలాంటివాటన్నిటి రిఫ్లెక్షన్ సమాజంలో ఉండదా? 
తప్పకుండా ఉంటుంది. 
అది మనం చూస్తున్నాం కూడా.  

మీరొకటి గమనించారా?

ఓటీటీల్లో మనవాళ్ళు తెగబడి చూస్తున్న అత్యంత జుగుప్సాకరమైన రక్తసిక్త-బూతు వెబ్ సీరీస్‌లు, సినిమాలు ఎన్నెన్నో కదా? వీటికి దాదాపు పూర్తిగా ఎడిక్ట్ అయిపోయారు కదా? 

ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్స్ తప్ప వేరేవి చూడ్డం ఇష్టంలేని స్థాయికి మగవాళ్ళే కాదు, మహిళలూ వచ్చారు. 

"ఆ లవ్ సినిమాలు, ఫ్యామిలీ సినిమాలు ఏం చూస్తాం సార్... ఏముంటది వాటిలో? క్రైమ్ థ్రిల్లర్లే మజా!" అని మహిళలు కూడా అంటున్నారు అంటే... మార్పు ఏ స్థాయిలో ఉందో అర్థంచేసుకోవచ్చు. 

ఒకసారి ఇలాంటి మానసికస్థితికి వచ్చిన సామాన్య ప్రేక్షకులను... నిజ జీవితంలో జరిగే హత్యలు, రక్తపాతం, రేపులు పెద్దగా ప్రభావితం చెయ్యలేవు. 

ఇదంతా ఆల్రెడీ ఇప్పటి సమాజంలో మనం చూస్తున్నాం కూడా. 

బ్లూ డ్రమ్ములు, సిమెంట్ బస్తాల కేసులు, మనిషిని చంపి కైమా కొట్టి కుక్కర్లలో పెట్టే కేసులు, ముక్కలు చేసి మూటకట్టి అవతలపడేసే కేసులు... ఇవ్వన్నీ ఇప్పుడు మామూలయిపోతున్నాయి. 

ఇలాంటి సినిమా ప్రభావం వల్ల కొంతమంది ఇంకా దారుణమైన రాక్షసోత్తములయ్యారు... 
ఎలాగంటే... 
మనలాంటి ఒక మనిషే మన కళ్ళముందే ఆత్మహత్య చేసుకుంటుంటే... మొబైల్‌తో వీడియో తీస్తూ తమాషా చూసేంతగా!

సినిమా ఒక ఎంటర్‌టైన్మెంట్ టూల్ నిజమే. కాని, మనుషుల్ని రాక్షసులుగా మార్చే స్థాయి వినోదసాధనం మాత్రం కాదు. 

- మనోహర్ చిమ్మని   

Thursday, 19 March 2026

పండగల మజా నెమ్మదిగా మర్చిపోతున్నాం అనిపిస్తుంది...


వేప పూవు, మామిడికాయ, మావిడాకులు, కొత్త కుండ, అందులో తీపి-చేదుల పచ్చడి, సేమ్యా పాయసం, బెల్లం-శనగపప్పుతో చేసిన భక్ష్యాలు, కొత్త కుండకు బొట్లుపెట్టి పూజ, అగరొత్తులు, హారతి, కొబ్బరికాయ, వరుసగా కూర్చుని విస్తర్లలో భోజనాలు... 
లేచినప్పటి నుంచి ఎంతో ఆసక్తితో హడావుడి పడుతూ, అమ్మాయిలు లేని మా ఇంట్లో ఒక్కతే ఇవన్నీ చేస్తుండే మా అమ్మ... 
ఆమె వెనుకే నేనూ, మా అన్నా-తమ్ముళ్ళు... 

ఉగాది పండుగ అంటే నాకిప్పటికీ కనిపించే ఒక దృశ్యమాలిక ఇది. 

వరంగల్లో ఇలాంటి నా చిన్నప్పటి జ్ఞాపకాల్ని అసలెన్నటికీ మర్చిపోలేను. 

ఇప్పుడేదీ?

వాట్సాపుల్లో, సోషల్ మీడియాలో గ్రీటింగ్స్ హడావిడి తప్ప, వేరే ఇంకే రకమైన పండగ ప్రత్యేకత నాకయితే కనిపించ లేదు. 

కొంపదీసి, ఇలా నా ఒక్కడికే అనిపిస్తోందా... ?!  

- మనోహర్ చిమ్మని   

Wednesday, 18 March 2026

కనీసం 8 వారాల గ్యాప్ కావాలి!


నెట్‌ఫ్లిక్స్... ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు అగ్రిమెంట్ చేసుకునే ఏ సినిమా అయినా 17 రోజుల్లో వాళ్ళ ఓటీటీలో వేసుకునేలా ప్లాన్ చేస్తున్నారు. 

మనవాళ్ళు కనీసం 8 వారాల గ్యాప్ కోసం చర్చలు జరుపుతున్నారు. 

అసలే థియేటర్స్‌కు జనాలు రావట్లేదు.
ఇలా ఓటీటీ రిలీజ్ గ్యాప్ పెంచితే అయినా వస్తారని ఒక స్ట్రాటెజీ. 

సినిమాను థియేటర్లోనే చూడాలనే ప్యాషన్ ఏ మూలో కొద్దిగా మిగిలి ఉన్నవాళ్లు కొందరు థియేటర్‌కు రావచ్చు అప్పుడు. వీళ్ళంతా ఒక 33% అనుకుందాం. 

మిగిలిన 67% మంది ప్రేక్షకులు మాత్రం మూవీరూల్జ్, ఐ-బొమ్మ లాంటివాటిల్లోనే చూస్తారు. 

మరోవైపు, సినిమా ఇండస్ట్రీలో కూడా చాలామంది మూవీరూల్జ్‌లోనే సినిమా చూస్తున్నామని బాహాటంగా చెప్తుండటం ఆశ్చర్యం.

కట్ చేస్తే -

నెట్‌ఫ్లిక్స్ సీఈవో Ted Sarandos మొన్నీ మధ్యే అన్నాడు:

"సినిమాను థియేటర్లో చూడ్డం అనేది ఇప్పుడొక అవుట్ డేటెడ్ కాన్సెప్ట్" అని. 

ఏదో అప్పటికప్పుడు నోటికొచ్చింది చెప్పడానికి అతనేం పాలిటిక్స్ మనిషి కాదు. వాళ్ళ ప్రతి చిన్న మాట వెనుక ఎంతో డేటా, అధ్యయనం ఉంటాయి. 

సో, సినిమా ఉంటుంది. ఎక్కడికీ పోదు. కాని, థియేటర్‌కు వెళ్ళి సినిమా చూసేవారి సంఖ్య మాత్రం ఇంకా ఇంకా తగ్గిపోతుంది. అందులో ఎలాంటి డౌట్ లేదు.   

దీనికి ఒక్కటే మినహాయింపు... ఫ్యాన్స్ ఎక్కువగా ఉండే భారీ హీరోల సినిమాలు, భారీ బడ్జెట్ విజువల్ వండర్ సినిమాలను మాత్రం ఎవ్వరూ ఓటీటీల్లో చూడాలనుకోరు. ఇక్కడైనా ఎక్కడైనా.  

- మనోహర్ చిమ్మని 

Tuesday, 17 March 2026

షోలే సినిమాలోకి అమితాబ్ ఎలా ఎంటరయ్యాడు?


ఇప్పుడే ఒక పాత వీడియో చూశాను... 
ఐఫా అవార్డ్స్ ఈవెంట్ అది. 

ఆడియెన్స్‌లో ఉన్న ధర్మేంద్రను స్టేజీ పైకి ఆహ్వానించే ముందు అమితాబ్ ఒక విషయం చెప్పాడు:

"షోలేలో జయ్ క్యారెక్టర్ కోసం డైరెక్టర్ రమేష్ సిప్పీకి నన్ను రికమెంట్ చేసింది ధర్మేంద్ర. రమేష్ సిప్పీని తను ఈ విషయంలో ఇన్‌సిస్ట్ చెయ్యకపోతే, నేను షోలేలో లేను. ఈ విషయంలో ధరమ్‌జీకి నేనెప్పుడూ రుణపడివుంటాను" అని. 

ఆడియెన్స్‌లో కూర్చున్న రమేష్ సిప్పీ, చాలామందికి తెలీని ఈ నిజాన్ని నవ్వుతూ వింటూ ఎంజాయ్ చేస్తున్నాడు. 

స్టేజీ మీదకొచ్చి, అమితాబ్ నుంచి ఐఫా వార్డు తీసుకొన్న ధర్మేంద్ర, "అసలు నేను అమితాబ్‌కు రికమండ్ చెయ్యటమేంటి? నాకసలు గుర్తు లేదు" అని ఎంతో హంబుల్‌గా చెప్పటం చాలా గొప్ప విషయం.

ధర్మేంద్ర అమితాబ్‌ను జయ్ క్యారెక్టర్ కోసం రికమండ్ చెయ్యకపోతే, ఆ క్యారెక్టర్ ఇంకొకరితో అంత బాగా వచ్చేదో లేదో ఒకసారి ఊహించండి.

కొన్ని అద్భుతాలు అలా జరుగుతాయ్. అంతే. 

- మనోహర్ చిమ్మని     

Sunday, 15 March 2026

కొన్ని గమ్మత్తుగా జరుగుతుంటాయ్!


5 ఫిబ్రవరి, 2023. 
సుమారు మూడేళ్ళ క్రితం... నేను, మా మిత్రుడు పరమేశ్వర్ రెడ్డి, కొలీగ్స్ కలిసి మా సదాశివపేట్ ఫామ్‌లాండ్స్‌ వెంచర్‌కు వెళ్ళివస్తూ, దారిలో ఒక దాబా దగ్గర కారు ఆపి, చాయ్ కోసం దిగాం.  

నాలుగు చాయ్‌లు ఆర్డర్ ఇచ్చాం. చాయ్ వచ్చేలోపు నలుగురం ఏదో క్యాజువల్‌గా చర్చించుకుంటున్నాం. టాపిక్ ఏంటన్నది కూడా గుర్తులేదు. 

ఆ టైంలో తీసిన ఫోటో ఇది. 

అయితే, అలా మమ్మల్ని ఎవరో ఫోటో తీస్తున్న విషయం మాలో ఎవ్వరికీ తెలీదు. 

కట్ చేస్తే -

చాయ్ తాగి వెళ్ళాం. 

మర్నాడు ఫేస్‌బుక్‌లో ఒకరు ఈ ఫోటో పోస్ట్ చేశారు. అతను ఫేస్‌బుక్‌లో నాకు ఫ్రెండ్ కూడా కాదు.  

నేను తెలుసట. అక్కడ సడెన్‌గా కనిపించేసరికి అలా ఫోటో తీశాట్ట. కలిసి మాట్లాడ్డానికి ఎందుకో సంకోచించాడు. అప్పటినుంచీ నాకు ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్ అయ్యాడు. 

మాకు తెలీకుండా ఆరోజు రాత్రి మా ఫోటో తీసిన ఈ "పాపరాజీ" మిత్రుని పేరు శాలిగంజి మహేశ్. 

- మనోహర్ చిమ్మని

Saturday, 14 March 2026

The Danger of Dependency


Dependency often feels comfortable. When someone promises support, guidance, or partnership, we tend to relax. We believe things will move forward because someone else is there with us. But the truth is harsh: dependency is always fragile.

No matter how strong the relationship or how sincere the promise, you can never know what the last word from the other side will be. People change. Priorities shift. Circumstances interfere. The support you counted on yesterday may disappear tomorrow.

When that happens, the shock is not just about losing help—it’s about realizing that your progress was tied to someone else’s decision.

That’s why the wiser path is self-reliance.

It may be ten times tougher, slower, and lonelier. But when you depend on your own effort, discipline, and persistence, your path becomes far more stable.

A lone wolf walks a harder road, but it walks with certainty and control. And in the long run, that independence becomes your greatest strength.

Build your own path. Do the hard work. Make things happen—even if you must walk like a lone wolf. 

-            Manohar Chimmani

Thursday, 12 March 2026

"బియాండ్ కాఫీ" లాంటి కాఫీ బార్ ఇంకెక్కడైనా ఉందా?


జూబ్లీ హిల్స్, రోడ్ నంబర్ 36 లో "బియాండ్ కాఫీ"ని నాకు పరిచయం చేసింది మా ప్రదీప్. 

ముందు "ఏంట్రా ఇది" అనుకున్నాను. ఒక గంట తర్వాత "ఇదే కదా మనకు కావల్సింది" అనిపించింది. 

ఆ తర్వాత డజన్లసార్లు వెళ్ళాను ఈ క్రియేటివ్ పీపుల్స్ అడ్డాకు. ఆఫీసులో జరిగే కొన్ని మీటింగ్స్‌ను కూడా అక్కడ పెట్టుకొనేవాళ్ళం. 

కాఫీలు, టీలు, సాఫ్ట్ డ్రింక్స్, స్నాక్స్ అన్నీ బయట దొరికేవే. ఇటాలియన్, అమెరికన్, కాంటినెంటల్, బెవెరేజెస్, డెజెర్ట్స్... అన్నీ చాలా బాగుండేవి. ప్రజెంటేషన్, యాంబియెన్స్ ఇంకా బాగుంటాయి. ఫిలిం ఫ్రీక్స్, క్రియేటివ్ పీపుల్ కదా... బయటి ఓపెన్ సిట్టింగ్స్‌లో ఎక్కడైనా సిగరెట్స్ తాగొచ్చు. 

కట్ చేస్తే - 

ఎందుకో తెలీదు గాని, రోడ్ నంబర్ 36లో బియాండ్ కాఫీ మూసేసి చాలారోజులైంది. అలాంటి యాంబియెన్స్ ఉన్న కాఫీబార్-కమ్-క్రియేటివ్ స్పాట్ ఇంకెక్కడైనా ఉందా? 

మా కొంపల్లి, సికింద్రాబాద్ వైపు కూడా ఇలాంటివి తప్పక ఉండి ఉండాలని నా గట్టి నమ్మకం. తెలిస్తే ఎవరైనా చెప్పండి. థాంక్స్ ఇన్ అడ్వాన్స్!

- మనోహర్ చిమ్మని 

Wednesday, 11 March 2026

ఈ డిసిప్లిన్ పాటించడం అంత ఈజీ కాదు!


కపిల్ శర్మ షోలో షారుక్ ఖాన్ ఒకసారి ఒక మంచి మాట చెప్పాడు:

"నా ఇన్నేళ్ళ కెరీర్‌లో నేను మొదటి నుంచీ ఒక రూల్ చాలా ఖచ్చితంగా పాటిస్తున్నాను. ఏంటంటే... నేను ఎవ్వరి పర్సనల్ వ్యవహారాల్లో, ప్రేమ వ్యవహారాల్లో, డబ్బుల వ్యవహారాల్లో, బిజినెస్ వ్యవహారాల్లో, ప్రొఫెషనల్ వ్యవహారాల్లో అస్సలు వేలు పెట్టను. కల్పించుకోను. 

ఇది నేను అనుభవం మీద నాకు నేను నేర్చుకుని పాటిస్తున్న డిసిప్లిన్. ఈ ఒక్క డిసిప్లినే నన్ను ఇండస్ట్రీలో ఈరోజు నేను ఈ స్థాయికి రావటంలో నాకు బాగా ఉపయోగపడింది.

ఈ డిసిప్లిన్ వల్ల నాకు జరిగిన ఇంకో మంచి ఏంటంటే... నేనెలా ఉంటానో ఎదుటివాళ్ళంతా నాతో అలాగే ఉంటారు!" 

దటీజ్ షారూక్ ఖాన్! 

వినటానికి చాలా సింపుల్‌గా ఉంది. కాని, ఈ డిసిప్లిన్ పాటించడం అంత ఈజీ కాదు. అందరివల్ల కాదు.  

వడపావ్, పావ్ బాజీలతో ఆకలి తీర్చుకొంటూ, షెల్టర్ లేనప్పుడు ముంబై రైల్వే స్టేషన్లలోని బెంచీల మీద పడుకొంటూ సినిమా అవకాశాల కోసం తిరిగిన నేపథ్యం ఉన్న షారుక్ ఖాన్ అంత ఈజీగా, జస్ట్ అలా ఊరికే, బాలీవుడ్ కింగ్ కాలేదు. 

షారుక్ ఖాన్ ఫస్ట్ నాన్-సినిమా పేమెంట్ 50 రూపాయలు. ఫస్ట్ సినిమా అడ్వాన్స్ 11,000 రూపాయలు. ఇప్పుడు బాలీవుడ్ టాప్ హీరోగా షారుక్ నెట్‌వర్త్ 11,000 కోట్లు! 

The film industry is a strange place where dreams are sold, talent is tested, and only persistence survives.

కట్ చేస్తే - 

కన్సిస్టెన్సీ కోసం అప్పటికప్పుడు అనుకొని ఏదో ఓ కొత్త హాబీ మొదలెడుతుంటాను. అలా మొదలెట్టిన ఎన్నో హాబీల్లో ఈ "మనోహరమ్" డిజిటల్ బులెటిన్ కూడా ఒకటి. కాని, ఇప్పుడు నేను పూర్తిస్థాయిలో సినిమాలు చేసే పనిలో బిజీ అయిపోతున్నాను కాబట్టి ఈ బులెటిన్ కోసం సమయం కెటాయించటం ఇంక కుదిరేలా లేదు. సో, రేపటి నుంచి బులెటిన్ రాదు.   

బులెటిన్ లేకపోయినా, నా ఆర్టికిల్స్ రెగ్యులర్‌గా నా బ్లాగ్‌లో చదవొచ్చు. అవే ఆర్టికిల్స్ నా సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేస్తుంటాను. మీరు అక్కడ కూడా చదవొచ్చు. 

థాంక్యూ.   

- మనోహర్ చిమ్మని   

Tuesday, 10 March 2026

ఇండిపెండెంట్ సినిమాలకు ఆఫీస్ అవసరమా?


ప్రతిరోజూ, ప్రతి క్షణం ఇక్కడ ఏదో ఒక టెంప్టేషన్ ఉంటుంది. ఈ టెంప్టేషన్‌ను గెలవటం అంత ఈజీ కాదు. అది గెల్చినవాడు నిజంగా తోపు. 

"ఇక అయిపోయిందిరా పని" అనుకుంటాం. కాని, కాదు. అయ్యేదాకా చెప్పలేం. ఎప్పుడవుతుందో ఎవరికీ తెలీదు.      

అందుకే, "మనం ఎప్పుడూ ఒక దట్టమైన అడవిలో ఉన్నట్టు ఫీలవుతూ, ప్రతి నిమిషం అలర్ట్‌గా ఉండాలి. ఏ మూల నుంచి ఏ జంతువు వచ్చి మనల్ని ఎలా ఎటాక్ చేస్తుందో తెలీదు" అంటాడు పూరి జగన్నాధ్.    

కట్ చేస్తే - 

సినిమా టీమ్ అంతా ఎక్కడ కలిస్తే అదే ఆఫీస్ అని చెప్తూ ఆ మధ్య నేనొక బ్లాగ్ పోస్టు రాశాను. 

కేఫే మిలాంజ్. బియాండ్ కాఫీ.  
ఇరానీ హోటల్. కాఫీడే. 
కేబీఆర్ పార్క్. నెక్లెస్ రోడ్డు. 
ఐమాక్స్ లాబీలు. ట్యాంక్ బండ్. 
యాత్రి నివాస్. సినీ ప్లానెట్... 

ఈ డిజిటల్ సోషల్ మీడియా యుగంలో... ఇండిపెండెంట్ మైక్రో బడ్జెట్ సినిమాలకు ఇప్పుడు ఇవే నిజమైన ఆఫీసులు. 

ఒకప్పట్లా నాలుగ్గోడల మధ్యనే కూర్చొని పనిచేసే రోజులు పోయాయి. క్రియేటివిటీకి రొటీన్ అంటే అస్సలు నచ్చదు. 

అదలా పక్కనపెడితే - సినిమా ప్రొడక్షన్‌కు సంబంధించిన పనంతా ఒక్క ఫిలిమ్‌నగర్‌లోనే జరగాలన్న రూల్ ఏం లేదు. అలాగే, సినిమావాళ్లంతా కూడా జూబ్లీ హిల్స్, శ్రీనగర్ కాలనీ, మణికొండ చుట్టుపక్కలే ఉండాల్సిన అవసరం కూడా నిజానికి లేదు. 

హాలీవుడ్ సినిమాల్లో పనిచేసేవాళ్ళంతా కాలిఫోర్నియాలోనే ఉండరు. బాలీవుడ్‌లో పనిచేసేవారంతా ఒక్క ముంబైలోనే ఉండరు. అలాగే, మన తెలుగు సినిమాల్లో పనిచేసేవాళ్ళంతా కూడా ఒక్క హైద్రాబాద్‌లోనే ఉండరు. ఒక్క ఫిలిమ్‌నగర్‌లోనో, మణికొండలోనో ఉండరు.     

ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ సరిగ్గా చేసుకోగలిగితే చాలు, ఎవరు ఎక్కడి నుంచైనా సినిమాలు తీయొచ్చు. సినిమాల్లో పనిచేయొచ్చు. 

ఫిలిం నెగెటివ్ నుంచి డిజిటల్‌కు మారిపోయాక, ఫిలిమేకింగ్‌లో పోస్ట్ ప్రొడక్షన్ కోసం ఇప్పుడు ల్యాబ్స్ కూడా అవసరం లేదు. ఆఫీసులో రెండు మంచి ఐమాక్ సిస్టమ్స్ చాలు. 

ఇక ఫిలిం చాంబర్లో, ఎఫ్‌డిసిలో, యూనియన్ ఆఫీసుల్లో ఉండే కొద్దిపాటి పేపర్ వర్క్ కోసం - ఒక సినిమా మొత్తానికి పట్టే సమయం కేవలం కొన్ని నిమిషాలే! ఆ కొన్ని నిమిషాల కోసం, ఆ చుట్టుపక్కలే ఆఫీసు తీసుకొని ఉండాల్సిన అవసరమైతే అస్సలు లేదు. 

కలవాలనుకున్నప్పుడు ఎవరు, ఎప్పుడు, ఎక్కడ, ఎవరినైనా, ఎలాగైనా కలుసుకోవచ్చు. 

చిన్న సినిమాలకు బడ్జెటే పెద్ద సమస్య.
ఈ చర్చంతా అందుకే. 
వీటికి ఫిలిం ఆఫీస్ అనేది ఎక్కడైనా ఉండొచ్చు.
"వర్చువల్ ఆఫీస్" అయితే ఇంకా బెటర్.  

- మనోహర్ చిమ్మని  

ఇప్పుడు నిజంగా సీన్ మారింది!


"మా వాడు చదువుకోవట్లేదు. ఉద్యోగం చేయడు. బిజినెస్ చేయలేడు. ఏ పనీ చేతకాదు. ఎందుకూ పనికిరాడు. కొంచెం నీ దగ్గర డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో పెట్టుకో!"

ఒకరోజు పొద్దున్నే గురువుగారు "దర్శకరత్న" దాసరి గారికి కాల్ చేసి అలా అడిగాట్ట ఆయన స్నేహితుడు. బయటివాళ్ల దృష్టిలో డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ అంటే మరీ అంత పనికిరానిదన్నమాట! 

ఈ జోక్‌ని స్వయంగా గురువుగారు, దర్శకరత్న దాసరి నారాయణరావుగారు అప్పటి తన బంజారాహిల్స్ ఆఫీసులో స్వయంగా నాతో చెప్పారు. ఒక్క డైరెక్షన్ డిపార్ట్‌మెంటే కాదు. టోటల్‌గా సినీఫీల్డులో పనిచేసేవారంతా ఎందుకూ పనికిరానివాళ్లని ఇతర ఫీల్డులవాళ్ల అభిప్రాయం. 

"చదువుకోవడం చేతకానివాళ్లంతా సినీఫీల్డంటారు!" అని కూడా అంటారు కొంతమంది. వాళ్లకి తెలీదు... ఫీల్డులో హైస్కూల్ డ్రాపవుట్స్ నుంచి, ఎమ్ బి ఏ లు, యూనివర్సిటీ డబుల్ గోల్డ్ మెడలిస్టులు, న్యూక్లియర్ ఫిజిక్స్ పీజీలు, పీహెచ్‌డీలు, ఐ ఐ ఎమ్ నేపథ్యాన్ని అలవోగ్గా అలా వదిలేసినవాళ్ల దాకా ఎందరో ఉన్నారని! 

"అబ్బో సినిమావాళ్లా!" అంటారు కొందరు. మిగిలినవాళ్లంతా ఏదో సొక్కమైనట్టు. వీళ్లేదో చేయరాని పని చేస్తున్నట్టు! దేన్నయినా సరే జనరలైజ్ చేసి మాట్లాడే ఇలాంటివాళ్లంతా తెలుసుకోవాల్సిన ఒక నిజం ఎన్నటికీ తెల్సుకోలేరు.

"మ్యాటర్ ఎప్పుడూ ఫీల్డు కాదు. మన మైండ్‌సెట్" అనేది కామన్‌సెన్స్. అన్ని ఫీల్డుల్లో మంచీ చెడు ఉంటుంది. అన్ని ఫీల్డుల్లో కొందరికి వర్కవుట్ అవుతుంది, కొందరికి కాదు.

వేరే ఫీల్డులను ఎవరూ పట్టించుకోరు, ఈ ఫీల్డుని బాగా పట్టించుకుంటారు. ఎందుకంటే... ఇది గ్లామర్ ఫీల్డు కాబట్టి, ఇక్కడ దగ్గినా తుమ్మినా బ్రేకింగ్ న్యూసే కాబట్టి. తెలిసినోడూ, తెలీనోడూ ఈ ఫీల్డు మీద, ఫీల్డులోని మనుషుల మీద ఏ కామెంట్ అయినా చెయ్యగలడు కాబట్టి, ఏ ఉచిత సలహా అయినా ఇవ్వగలడు కాబట్టి.    

సినిమా న్యూస్‌లు, సినిమావాళ్ళమీద టిడ్‌బిట్స్, సినిమా బేస్‌డ్ ప్రోగ్రామ్స్, సినిమావాళ్ల ఫోటోలు, బైట్స్ లేకుండా ఏ పత్రికా, ఏ చానెల్, ఏ సోషల్ మీడియా బ్రతకలేదు. సగటు మనిషి జీవితంలో కూడా సినిమా ఒక అంతర్భాగం. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సినిమావాళ్ళ కొలాబొరేషన్ లేకుండా దాదాపు ప్రపంచంలోని ఏ బిజినెస్, ఏ ప్రొఫెషన్ కూడా ఉండే అవకాశం లేదు.    

ఇప్పుడు నిజంగా సీన్ మారింది. సినిమా ఒక పాష్ అండ్ ప్రీమియమ్ స్థాయి ప్రొఫెషన్ అని, ఇందులో ఎంట్రీ అనేదే చాలా గొప్ప విషయమని రియలైజ్ అవుతున్నారు. అవక తప్పదు.

ఒకప్పడు లక్షల్లో ఉండే అంకెలు... ఇప్పుడు పదుల కోట్లు, వందల కోట్ల దాకా ఎలా వెళ్తున్నది కూడా షాకవుతూ, అంతరాంతరాల్లో అసూయ పడుతూ గమనిస్తున్నారు. మనీకి మనీ, ఫేమ్‌కి ఫేమ్, సెలబ్రిటీ స్టేటస్. ఇంకేం కావాలి?   

- మనోహర్ చిమ్మని  

Monday, 9 March 2026

ఫిలిం ఇండస్ట్రీలో ఎదగాలంటే ఏం చెయ్యాలి?


"శివ" ప్రాజెక్టు ఓకే అవ్వడం కోసం ఆర్జీవీ ఎందరినో మేనిప్యులేట్ చేశాట్ట. తనకు అనుకూలంగా రిజల్ట్ రావడం కోసం ఒకరిదగ్గర ఒకలాగా, ఇంకొకరి దగ్గర ఇంకోలాగా మాట్లాడి, చివరికి శివ ప్రాజెక్ట్ ఓకే చేసుకున్నాట్ట. ఈ విషయం ఆర్జీవీనే స్వయంగా ఎన్నో ఇంటర్వ్యూల్లో చెప్పాడు. 

ఆమధ్య ఒక కాలేజి ఫంక్షన్లో స్పీచ్ ఇస్తూ, యస్ యస్ రాజమౌళి కూడా దాదాపు ఇలాంటిదే ఒక "సక్సెస్ మంత్ర" చెప్పాడు: "ఫిలిం ఇండస్ట్రీలో ఎదగాలంటే ఎన్నో అబద్ధాలాడాల్సి ఉంటుంది. ఎన్నో మేనిప్యులేషన్స్ చెయ్యాల్సి ఉంటుంది. నీ ప్రొఫెషన్ కోసం అవన్నీ చెయ్యి. కాని, నీకు నువ్వు అబద్ధాలు చెప్పుకోకు... నిన్ను నువ్వు మభ్యపెట్టుకోకు" అని.   

ఇంకొక ఇంటర్వ్యూలో - ఇప్పుడు దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న కథారచయిత విజయేంద్రప్రసాద్ గారు ఒక ప్రశ్నకు సమాధానంగా, "ఫిలిం ఇండస్ట్రీలో సక్సెస్ సాధించాలంటే మీరు అబద్ధాలు బాగా చెప్పగలగాలి" అన్నారు.  

కట్ చేస్తే - 

ప్రతి ఇండస్ట్రీకి, ప్రతి బిజినెస్‌కు, ప్రతి ప్రొఫెషన్‌కు ఆయా చోట్ల సక్సెస్ సాధించడానికి, నిలదొక్కుకోడానికి కొన్ని ప్రాథమిక సూత్రాలుంటాయి. ఒక వ్యవహారశైలి ఉంటుంది. వ్యక్తిగతంగా ఎవరికి ఎలాంటి ప్రిన్సిపుల్స్ ఉన్నా, ఇండస్ట్రీ బేసిక్ సూత్రాలకు ఎవరి శైలిలో వారు ఎడాప్ట్ అవక తప్పదు. అలా కాగలిగినవారే ఇండస్ట్రీలోని ఏ క్రాఫ్ట్‌లో అయినా సక్సెస్ సాధిస్తారు.    

సింపుల్‌గా చెప్పాలంటే - తాడిచెట్టుకిందకి వెళ్ళినప్పుడు మనం కల్లే త్రాగాలి. కల్లు మండువాలో కూర్చొని నేను కాఫీ త్రాగుతాను అంటే కుదరదు. 

ప్రిన్సిపుల్స్, తొక్క అనే ఈ అంతస్సంఘర్షణలోనే చాలామందికి జీవితం అయిపోతుంది. కొంతమంది మాత్రం నిమిషాల్లో మౌల్డ్ అయిపోతారు.   

కట్ చేస్తే - 

పైన చెప్పిన ఉదాహరణల్లో ఆర్జీవీ, రాజమౌళి, విజయేంద్రప్రసాద్ గారు చెప్పింది కూడా ఇదే. వారు చెప్పిన అబద్ధాలు, మేనిప్యులేషన్స్ అంటే తప్పుచెయ్యమని కాదు. నెగెటివ్ అర్థంలో కాదు. 

ఇండస్ట్రీలో పనులు ముందుకు కదిలేలా ఎదుటివారిని కన్విన్స్ చెయ్యగలగటం. 

మనలో ఏ మూలో ఉన్న కాస్తంత ఈగోని కాసేపు పక్కనపెట్టగలగటం. 

ఒక హాయ్. 
రెండు షేక్ హాండ్స్. 
నాలుగు థాంక్యూలు. 

దట్సిట్. 
యు ఆర్ ఆన్ ద ట్రాక్.

తర్వాతంతా నీ సత్తా. 

Cinema is a powerful creative playground, but to play in it, you must first learn its rules—even the ones that challenge your principles.

- మనోహర్ చిమ్మని   

Sunday, 8 March 2026

చార్లీ చాప్లిన్ మంచి బిజినెస్‌మేన్ కూడా!


తలరాత, విధిరాత, ఎలా రాసిపెట్టుంటే అలా జరుగుతుంది... వంటి శాస్త్రాలను నేను నమ్మలేను. నమ్మను. ఎవరైనా ఇలా చెప్తుంటే సరదాగా వింటాను. వారి నమ్మకాల్ని గౌరవిస్తాను. అది వేరే విషయం. 

"మన కృషినిబట్టే ఫలితం ఉంటుంది. మన నిర్ణయాలనుబట్టే కొన్ని కలిసిరావడమో, లేదా కలిసిరాకపోవడమో జరుగుతుంది." ఇది నా వ్యక్తిగత నమ్మకం. ఎన్నెన్నో సందర్భాల్లో నా అనుభవం కూడా. 
    
కట్ టూ చార్లీ చాప్లిన్ - 

తన జీవితకాలంలో సుమారు 80 సినిమాల్లో నటించి, 3 అకాడమీ అవార్డుల్ని అందుకున్న చార్లీ చాప్లిన్ అంటే కేవలం ఒక్క నటుడుగానే అందరికి తెలుసు. కానీ - అతనొక మంచి రైటర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్, బిజినెస్‌మేన్ అన్న విషయం చాలామందికి తెలియదు. 

మేరీ పిక్‌ఫోర్డ్, డగ్లస్ ఫెయిర్‌బాంక్స్, డి డబ్ల్యూ గ్రిఫిత్ లనే మరో ముగ్గురు ఆర్టిస్టులతో కలిసి చాప్లిన్ పూనుకోకపోతే, 1919 లో "యునైటెడ్ ఆర్టిస్ట్స్" అనే ప్రొడక్షన్ కంపెనీ అసలు హాలీవుడ్‌లో ఏర్పడేదే కాదు. 

హాలీవుడ్ చరిత్రలో కేవలం ఆర్టిస్టులు మాత్రమే స్థాపించిన మొట్టమొదటి స్టూడియో అదే!  
    
ఇది నా పాత పోస్టే. అయినా, చార్లీ చాప్లిన్ చెప్పిన ఒక మూడు కొటేషన్లను మళ్ళీ ఒకసారి చడవడం కోసం, మరో కోణంలో స్వీయ విమర్శ కోసం మాత్రమే నేనీ బ్లాగ్ పోస్ట్ మళ్ళీ రాస్తున్నాను:

“Nothing is permanent in this world, not even our troubles.”

“I like walking in the rain, because nobody can see my tears.”

“The most wasted day in life is the day in which we had not laughed.”

చాప్లిన్ మార్కు ఎంటర్‌టైన్‌మెంట్ మొత్తాన్ని, ఆయన జీవితాదర్శాన్నీ ఈ మూడు కొటేషన్లలో మనం చూడొచ్చు. అలాంటి చార్లీ చాప్లిన్ తన ఆటోబయోగ్రఫీలో చెప్పుకున్నట్టు... చాప్లిన్ విజయరహస్యం ఏ విధిరాతో కానే కాదు. 

క్రియేటివ్ ఫ్రీడమ్! 

ఈ క్రియేటివ్ ఫ్రీడమ్‌కు అడ్డుపడే చిక్కుల్ని ప్రారంభంలోనే గుర్తించకపోవడం, లేదా అలాంటి చిక్కుల్ని కొనితెచ్చుకోవడం ఎంత తెలివితక్కువతనమో - వాటిల్లోంచి వెంటనే బయటపడకపోవడం అంతకంటే పెద్ద మూర్ఖత్వం.
 
ఈ చిక్కులు వ్యక్తిగతమైనవి కావొచ్చు, సాంఘికమైనవి కావొచ్చు, ఆర్ధికమైనవి కావొచ్చు. అడుగడుగునా మాత్రం అడ్డుపడతాయి. జీవితాన్ని అనుకున్నట్టుగా ముందుకు సాగనీయవు. జీవితంలో అసలు ఎన్నడూ ఊహించని అల్లకల్లోలం సృష్టిస్తాయి.  
    
ఈ లాజిక్ ఒక్క క్రియేటివ్ రంగాల్లో ఉన్నవారికే కాదు, అందరికీ వర్తిస్తుంది. 

ఈ నిజాన్ని ముందే గ్రహించగలిగాడు కాబట్టే - చాప్లిన్ తన క్రియేటివ్ ఫ్రీడమ్‌కు అడ్డుపడే చిక్కులకు ముందే చెక్ పెట్టుకున్నాడు. 1919 లోనే హాలీవుడ్‌లో యునైటెడ్ ఆర్టిస్ట్స్ స్థాపించాడు. తను కోరుకున్న క్రియేటివ్ ఫ్రీడమ్‌ను సాధించుకొన్నాడు. 

"చార్లీ చాప్లిన్" అనగానే పెదాలపైన నవ్వు వికసించేలా ప్రపంచ చలనచిత్ర చరిత్రలో నిల్చిపోయాడు. 

Money is a result. Wealth is a result. Health is a result. Illness is a result. Your weight is a result. We live in a world of cause and effect.

- మనోహర్ చిమ్మని 

Saturday, 7 March 2026

రిస్క్ లేకపోతే (ఎపిక్) డైరెక్షన్ లేదు!


సీన్ 1:
ఆదిత్యధర్ మొదటి సినిమా "యూరీ: ది సర్జికల్ స్ట్రైక్". హిట్ సినిమా. దాని ప్రొడ్యూసర్ రోనీ స్క్రూవాలా. 

ఆదిత్యధర్ రెండోసినిమా కోసం బయటి ప్రొడ్యూసర్స్ నుంచి చాలా ఆఫర్స్ వచ్చాయి. అయినాసరే, అత్నే ప్రొడ్యూసర్‌గా తనే రెండో సినిమా తీశాడు. బాలీవుడ్ రికార్డుల్ని తిరగరాసే బ్లాక్‌బస్టర్ హిట్ ఇచ్చాడు. అదే "ధురంధర్". 

సీన్ 2:
సందీప్‌రెడ్డి వంగా తన తన మొదటి సినిమా కథతో చాలామంది హీరోల చుట్టు తిరిగాడు, చాలామంది ప్రొడ్యూసర్స్‌ను కలిశాడు. ఎక్కడా సెట్ అవలేదు. ఓ రెండేళ్ళు ఇలా అగడిచిందనుకుంటాను. 

ఇక లాభం లేదనుకొని సందీప్ వంగా వాళ్ళ అన్నయ్య, పేరెంట్స్ ధైర్యం చేశారు. ఒక మూడు కోట్లు రిస్క్ చేసి తను అనుకున్న స్క్రిప్టుతో సినిమా తీశాడు. బ్లాక్ బస్టర్ హిట్ సాధించాడు. అదే "అర్జున్ రెడ్డి". 

ఇదే సినిమాను బాలీవుడ్‌లో కూడా "కబీర్ సింగ్" పేరుతో రీమేక్ చేశాడు సందీప్ వంగా. అక్కడ కూడా బ్లాక్‌బస్టర్ హిట్టే. 

కట్ చేస్తే -

పై రెండు ఉదాహరణల్లో డైరెక్టర్స్ ఇద్దరూ చాలా పెద్ద రిస్క్ చేశారు. సినిమాలు హిట్ అయ్యాయి కాబట్టి బ్రతికిపోయారు. అదే ఫట్ అయితే?!

అలాగని, ఈ డైరెక్టర్స్ ఇద్దరూ డబ్బు బాగా వస్తుందని ప్రొడ్యూస్ చేశారా? కాదు.

ఆదిత్యధర్ క్రియేటివ్ ఫ్రీడమ్ కావాలనుకున్నాడు. ప్రొడ్యూసర్లు ధురంధర్‌లో కొన్ని సీన్లు ఒప్పుకోకపోవచ్చు. ఏదో ఒక దశలో ఏదో ఒక దగ్గర కాంప్రమైజ్ కావాల్సిరావచ్చు. అందుకే రిస్క్ తనే తీసుకున్నాడు ఆదిత్యధర్. 

వంగా విషయం వేరు. ఆల్రెడీ హీరోలు, ప్రొడ్యూసర్స్ కోసం చాలా తిరిగాడు. ఇంకొన్నాళ్లయితే కాంప్రమైజ్ అయిపోయి, ఇంకోటేదో ప్రొడ్యూసర్స్ వినగానే ఒప్పుకొనే కథతో సినిమా తీసేవాడేమో. ఆ రిస్క్ ఇష్టం లేక, అర్జున్ రెడ్డి కోసం ప్రొడ్యూసింగ్ రిస్క్ తీసుకున్నాడు. 

ఇద్దరూ అనుకున్నది సాధించారు. కాని, ఇలాంటి రిస్క్ తీసుకునే అవకాశం ఎంతమందికి ఉంటుంది? ఒకవేళ అలాంటి అవకాశం ఉన్నా, ఎంతమంది అలాంటి రిస్క్ తీసుకుంటారు? 

సో, అప్పుడప్పుడూ డైరెక్టర్స్ కెరీర్‌లో ఇలాంటి రిస్కీ స్టెప్స్ కూడా తప్పవు. 

మణిరత్నం, పూరి జగన్నాధ్ లాంటి డైరెక్టర్స్ వాళ్ళ సినిమాలను వాళ్ళే ప్రొడ్యూస్ చేసుకుంటున్నారంటే మొదటి కారణం డబ్బు మీద పిచ్చి కాదు. 

క్రియేటివ్ ఫ్రీడమ్. 
వాళ్ళు అనుకున్నట్టుగా సినిమా తీయడం కోసం.

- మనోహర్ చిమ్మని 

Friday, 6 March 2026

Be Water, My Friend!


టీనేజ్‌లో నేను కూడా నాన్‌చాక్ తిప్పాను. కరాటే నేర్చుకున్నాను. అప్పట్లో మా ఇంటిచుట్టూ అందరూ కరాటే మాస్టర్‌లే. కొత్తగా అప్పట్లో అదొక వేవ్ అనుకోవచ్చు. 

ఫోటోలు తీసుకోవాలన్న ఆలోచన అప్పుడు లేదు. మొబైల్స్ కూడా లేని కాలం అది. ఏమాత్రం ఐడియా ఉన్నా ఏదోలా ఒక ఫోటో లాగించేవాణ్ణి. 

ఈ బచ్చాలాట జోక్స్ పక్కనపెడితే... ఇక్కడ పాయింట్ కరాటే, నాన్‌చాక్ కాదు.

బ్రూస్‌లీ!

జస్ట్ 32 ఏళ్లకే తను అనుకొన్న ప్రతి ఒక్కటీ సాధించిన ఒక పెద్ద 'సక్సెస్ స్టోరీ' బ్రూస్లీ. 

కేవలం 32 ఏళ్లకే తన లక్ష్యాలన్నీ సాధించేసి, చెప్పాల్సినవన్నీ చెప్పేసి, ఆర్జీవీ లాంటి డైరెక్టర్స్‌కు కూడా ఇన్‌స్పిరేషన్ అవుతూ, ఏదో కొంపలు మునిగిపోతున్నట్టు ఆదరా బాదరా వెళ్లిపోయాడు. 

కట్ చేస్తే -

ప్రపంచం అంతా 'పర్సనల్ డెవలప్‌మెంట్' అనే ఒక ఫీల్ గుడ్ మాయలో పడికొట్టుకొంటోంది. బుక్స్, క్లాసులు, వర్క్‌షాపులు, రిట్రీట్స్ పేరుతో బిలియన్లకొద్దీ డాలర్ల బిజినెస్‌గా రోజురోజుకీ కొత్తపుంతలుతొక్కుతోంది.

ఇప్పుడు మనదేశంలో కూడా.  

వేళ్లూనుకుపోయిన కొన్ని సోకాల్డ్ శాస్త్రాల్లాగే, సైన్స్‌కు నిలబడని 'సీక్రెట్' ఇది. క్విక్ ఫిక్స్ కోసం నిరంతరం తపించే మనిషి బలహీనతమీద డబ్బు సంపాదించుకొనే పెద్ద మాయ ఈ "పర్సనల డెవలప్‌మెంట్". 

పాయింట్ ఏ నుంచి పాయింట్ బి కి వెళ్ళడానికి ఒక దారి ఉంటుంది. లేకపోతే చేసుకొంటూవెళ్లాలి, నీటి ప్రవాహంలా.

ఎదురయ్యే పరిస్థితులను బట్టి, ఏ పాత్రలోకి చేరితే ఆ పాత్ర ఆకారంలోకి మారిపోయే నీటిగా మారాలి.

మన కోరికలు, మన కృషి సింక్ అయినప్పుడు మాత్రమే ఇది సాధ్యం. సింక్ కాకుండా చెడగొట్టడానికి 101 విధాల రాక్షసులో, పరిస్థితులో నిరంతరం అడ్డుపడుతుంటాయి. అది అత్యంత సహజం.

అయితే, ఫోకస్ చెడకుండా వాటిని ఎదుర్కొంటూ ముందుకెళ్లేవాడే చివరికి విజేత అవుతాడు.

తన అసామాన్యమైన విజయాలతో, 32 ఏళ్లకే, బ్రూస్‌లీ సాధించి చూపించింది అదే.   

"Empty your mind. Be formless, shapeless, like water. You put water into a cup, it becomes the cup. You put water into a bottle, it becomes the bottle. You put it in a teapot, it becomes the teapot. Now water can flow or it can crash. Be water, my friend!" - Bruce Lee 

- మనోహర్ చిమ్మని             

Thursday, 5 March 2026

ఆలోచించు! అవసరమైతే నీ స్ట్రాటెజీ మార్చు!!


మంగళవారం, శుక్రవారం, దసరా, సంక్రాంతి, శివరాత్రి, ఆగస్టు 15, జనవరి 26, సెకండ్ సాటర్‌డే, అమావాస్య, పౌర్ణమి, అష్టమి, నవమి, చంద్రగ్రహణం, సూర్యగ్రహణం, ఫీవరొచ్చింది, మోషన్స్... ఆ సమయానికి ఇంకేది గుర్తొస్తే అది. తప్పించుకోవాలి అనుకునేవారికి ఇలాంటి సాకులు వంద రెడీగా ఉంటాయి. 

మన సాంప్రదాయాలకు, అర్థవంతమైన నమ్మకాలకు నేను వ్యతిరేకం కాదు. ఎదుటివారి నమ్మకాలను నేనెప్పుడూ గౌరవిస్తాను. కాని, అతి చిల్లరస్థాయిలో వీటిని సాకులుగా వాడుకునేవారంటేనే నాకు అసహ్యం.   

రియల్ ఎస్టేట్ పడుకుంది, మార్కెట్లో మనీ రొటేషన్ లేదు, గవర్నమెంట్ మారకపోతే బాగుండు, అమెరికాలో జాబ్ మార్కెట్ బాగా లేదు, ఎన్నారైలు స్లో అయ్యారు, రష్యా-యూక్రేన్ యుద్ధం ఎఫెక్టు చాలా ఉంది, ఇరాన్ బాంబింగ్స్ పెద్ద దెబ్బ, ట్రంప్ సావదొబ్బుతున్నాడు... ఇవి కూడా అలాంటివే ఇంకో వంద సాకులు. 

ఇలాంటి కథలు చెప్తూ, ఎదుటివాని చెవిలో పువ్వుపెడుతున్నా అనుకుంటాడు కాని, వాడికి వాడే... వాడేంటో చెప్పుకుంటున్నాడన్న విషయం వాడికి తెలీదు.   

కట్ చేస్తే -

వేల కోట్ల పెట్టుబడితో సంవత్సరానికి 200+ సినిమాలు ఇక్కడ టాలీవుడ్‌లో రిలీజ్ అవుతున్నాయి. నెలకి 30 లక్షల రెంట్లు-జీతాలు ఇస్తున్న రియల్ ఎస్టేట్ కంపెనీలు నాకు వ్యక్తిగతంగా తెలుసు. హోటళ్ళు, హాస్పిటళ్ళు, కాలేజీలు, మాల్స్, పబ్బులు, బార్లు... అన్నీ లక్షణంగా నడుస్తున్నాయి. మనం కూడా ఉపవాసాల్లేకుండా బ్రతుకుతున్నాం.  

మనీ రొటేషన్ లేకుండా ఇవన్నీ ఎలా నడుస్తున్నాయి? మార్కెట్ నిజంగా డల్‌గా ఉంటే ఇవ్వన్నీ కూడా మూతపడాలి కదా?  

వినేవాడు, నమ్మేవాడు ఉంటే ఎన్నయినా చెప్తారు.     

అది నిజమా, అబద్ధమా, పేకుతున్నరా అన్నది ఫిల్టర్ చేసుకోవాల్సింది మనమే. అలా తేల్చుకోకుండా, ఇలాంటి ఫేక్స్‌ను నమ్ముతూ భ్రమల్లో బ్రతుకుతున్నంత కాలం పరిస్థితిలో ఇంచ్ కూడా మార్పు ఉండదు. పని జరగదు. నువ్వు సినిమా తీయలేవు. 

ఆలోచించు.
అవసరమైతే నీ స్ట్రాటెజీ మార్చు. 

అంతే గాని - ఇలాంటి పేకుడు మాటల్ని, అవి చెప్పే ఫేక్స్‌ను మాత్రం అస్సలు నమ్మకు.  

Life is either a Yes or a No. Everything in between is just a well-packaged excuse. 

- మనోహర్ చిమ్మని    

Wednesday, 4 March 2026

ఇక్కడ సక్సెస్ అనేది ఎప్పుడూ 5 శాతం లోపే!


హాలీవుడ్‌ను 'Land of Dreams' అని ముద్దుగా పిల్చుకుంటారు.

అక్కడికి ఏటా కనీసం 100,000 మందికి తక్కువకాకుండా ఆర్టిస్టులు, టెక్నీషియన్లు వస్తారు. వాళ్లల్లో కేవలం 2 శాతం మందికి మాత్రమే ఏదో ఒక అవకాశం దొరుకుతుంది. మిగిలినవాళ్లంతా కనీసం ఒక సంవత్సరం నుంచి, కొన్ని దశాబ్దాలపాటు నానా కష్టాలు పడి వెనక్కివెళ్ళిపోతారు.

ఇలా వెళ్ళిపోయినవాళ్లంతా అదే హాలీవుడ్‌ను 'Land of Broken Dreams' అని తిట్టుకుంటారు. 

పైన చెప్పిన లెక్కంతా ప్రపంచంలోని అన్ని సినిమా ఇండస్ట్రీలకు వర్తిస్తుంది. మన బాలీవుడ్, టాలీవుడ్‌లు కూడా అందుకు మినహాయింపు కాదు. 

సినిమా పుట్టినప్పటినుంచి ఇప్పటిదాకా అంతే.
ఇకముందు కూడా అంతే.

ఇక్కడ సక్సెస్ అనేది ఎప్పుడూ జస్ట్ ఒక 5 శాతం లోపే.    

ప్రపంచంలోని ఏ సినీ ఇండస్ట్రీలోనయినా, ఏ పీరియడ్‌లోనయినా, ప్రతి క్రాఫ్ట్‌లో కేవలం వేళ్లమీద లెక్కించగలిగిన ఒక డజన్ మంది మాత్రమే లైమ్‌లైట్‌లో ఉంటారు.      

మిగిలినవాళ్లంతా పనికోసం నిరంతర అన్వేషణలో ఉండాల్సిందే. ఏదో విధంగా ఫేడ్ అవుట్ అవ్వాల్సిందే.    

ఈ వాస్తవాన్ని గ్రహించినవాళ్లు కొంచెం జాగ్రత్తపడతారు. భ్రమలో బతికేవాళ్లు మాత్రం అలాగే సినిమాకష్టాలుపడుతూ కొనసాగుతుంటారు. 

కట్ చేస్తే -

అంత నిరాశపడనవసరం లేదు.

సినిమాను ఒక సీరియస్ కెరీర్‌గా, ఒక బిగ్ బిజినెస్‌గా తీసుకున్నవాళ్ళెవ్వరినీ ఫిలిం ఇండస్ట్రీ నిరాశపర్చదు. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఏదో విధంగా సినీఫీల్డు వారికి మంచే చేస్తుంది. డబ్బునిస్తుంది. పేరునిస్తుంది. సెలెబ్రిటీ హోదానిస్తుంది.   

సినిమా ప్లాట్‌ఫామ్ అనేది మనం ఇంకెన్నో ఇతర రంగాల్లో ఈజీగా కనెక్ట్ అవడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇలాంటి కాంటాక్ట్స్ ద్వారానే కొత్త లీడ్స్, ప్రపోజల్స్, డీల్స్ పూర్తవుతుంటాయి.

సో, ఇక్కడ సిస్టమ్ ఎప్పుడూ మంచిదే. కాని, ఆ సిస్టమ్‌ను మనం ఎలా ఉపయోగించుకొంటామన్నదే మన సక్సెస్ ఫెయిల్యూర్స్‌ను డిసైడ్ చేస్తుంది.       

5% లో ఉండటం అంత కష్టం కాదు... నిజంగా ఫోకస్ పెడితే.              

- మనోహర్ చిమ్మని

Tuesday, 3 March 2026

సత్యజిత్ రే "పథేర్ పాంచాలి" ఎలా తీశారు?


"సినిమా తీయాలన్న కమిట్‌మెంట్ ఉంటే చాలు. 
డబ్బులు ఎప్పుడూ సమస్య కాదు." 
- సత్యజిత్ రే! 

ఎలా కాదనగలం? 

సత్యజిత్ రే "పథేర్ పాంచాలి" అలాగే తీశాడు. ఉద్యోగం చేస్తూ, జీతం వచ్చినపుడల్లా ఆ డబ్బుతో షూటింగ్ ప్లాన్ చేస్తూ, మరికొంతమంది మిత్రుల ద్వారా కూడా అవసరమయిన డబ్బు ఎప్పటికప్పుడు సమకూర్చుకుంటూ, అంచెలంచెలుగా తీశారు. అలాంటి అనుభవంతో చెప్పిన మాట అది. 

సత్యజిత్ రే అలా తీసిన "పథేర్ పాంచాలి" సినిమానే ఆయనకు అంత పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత సత్యజిత్ రే ఇంకెన్నో పిక్చర్లు తీశారు. ఆయన అనుకున్న సినిమాలే తీశారు. 

విషయం ఇక్కడ ఆర్ట్ సినిమాలా, కమర్షియల్ సినిమాలా అన్నది కాదు. అనుకున్న సినిమాని ఒక కమిట్‌మెంట్ తో చేయగలగటం. 

అసలు సినిమాలా ఇంకొకటా అన్నది కూడా సమస్య కాదు. చేయాలనుకున్న పని మీద ఒక క్లారిటీ, ఒక కమిట్‌మెంట్ ఉండటం. ఏది ఎలా ఉన్నా, ఆ ఒక్క లక్ష్యం మీదే దృష్టిపెట్టి ఆ దాన్ని పూర్తి చేసెయ్యటం.

అలాంటి ఫోకస్‌తో కష్టపడ్డ ప్రతి ఒక్కరూ ఫిలిం ఇండస్ట్రీలోకి ప్రవేశించగలిగారు. వాళ్లు అనుకున్న మొదటి స్టెప్ వెయ్యగలిగారు. అదే ఫోకస్ కొనసాగించినవాళ్ళు ఇండస్ట్రీలో కంటిన్యూ అయ్యారు. ఇంకా ఇంకా సాధించారు. 

కట్ చేస్తే -

ఇప్పుడు నిజంగా అంత ఫోకస్, అంత ఏకాగ్రత, అంత కమిట్మెంట్, అంత ఓపిక ఎవరికుంది? 

అన్నీ ఇన్‌స్టంట్‌గా అయిపోవాలి! తెల్లారేసరికల్లా సినిమా ఎనౌన్స్ చెయ్యాలి, సెలబ్రిటీ అయిపోవాలి!! 

ఇలాంటి మిరాకిల్ వెయ్యిలో ఏ ఒక్కరికో కావచ్చు. కాని, అందరికీ అది సాధ్యం కాదు. 

ఒక డైరెక్టర్‌గా సినిమా చేయాలంటే ప్రొడ్యూసర్ కావాలి నిజమే. కాని, ఎంతమంది కాబోయే డైరెక్టర్స్ ఆ స్థాయి స్క్రిప్టులు రాసుకొని రెడీగా ఉన్నారు? 

"నా దగ్గర బ్లాక్ బస్టర్ కథ ఉంది" అని మాటల్లో చెప్పడం వేరు. నిజంగా ఆ స్థాయి కథని స్క్రిప్ట్ ఫార్మాట్‌లో ఒక మంచి స్క్రిప్టుగా రాసుకొని సిద్ధంగా ఉండటం వేరు. 

నిజంగా ఇది చేయగలిగే వాళ్ళు ఆతర్వాత ఏం చెయ్యాలో అది కూడా చెయ్యగలుగుతారు. సినిమా తప్పకుండా డైరెక్ట్ చేస్తారు.    

-మనోహర్ చిమ్మని

Monday, 2 March 2026

The Death of the Gatekeeper


In the old cinema world, a director’s fate depended on one word: Greenlight.

Studio money.
Distributor backing.
Critical approval. 
You needed permission.

That world is fading.

As Naval Ravikant explains in The Almanack of Naval Ravikant, the most powerful leverage today is permissionless — code and media. You don’t need approval to write a script, shoot a short, or publish your vision online.

For a director, this is freedom.

Every film you upload works for you 24/7. It costs nothing for a million people to watch it. It builds your brand without you asking for a meeting.

The old way was waiting three years for someone to say yes. 

The new way is building your audience now — so capital eventually comes looking for you.

In modern cinema, leverage beats lobbying. If you’re still waiting to be discovered, you’re playing small. If you’re building media assets consistently, you’re compounding power.

You’re not just a director for hire.
You’re a creator who owns his leverage.

- Manohar Chimmani 

ప్రపంచంలో నంబర్ వన్ దమ్మున్న పెట్టుబడిదారుడు ఎవరు?


సినీఫీల్డులో నిర్మాతలు 5 రకాలు:

1. డబ్బులు పెట్టి పోగొట్టుకున్నవాళ్లు
2. పోగొట్టుకోడానికి డబ్బులు పెడుతున్నవాళ్లు
3. పోగొట్టుకున్న చోటనే రాబట్టుకోవచ్చని మళ్ళీ పెట్టేవాళ్ళు 
4. హిట్టూ ఫట్టులతో సంబంధం లేకుండా లెక్కప్రకారం బాగా సంపాదించుకునేవాళ్ళు 
5. సినిమా ప్రొడ్యూసింగ్ అడ్డం పెట్టుకొని ఇతర వ్యాపారాల్లో భారీగా ఎదిగేవాళ్ళు 

ఈ లిస్టుని నేను చాలా పాజిటివ్ దృక్పథంతో రాశాను. 

అవగాహన, ఆత్మవిశ్వాసం, విజన్... ఈ మూడూ కలిస్తే ప్రొడ్యూసర్. ఆత్మవిశ్వాసం మితిమీరితేనే కష్టం. పై లిస్టులోని 1,2,3 ల్లో కొట్టుమిట్టాడాల్సి వస్తుంది. ఆ పై మూడిట్లోనే ఎక్కడో అక్కడ అదృశ్యం కూడా అయిపోవవచ్చు.   

ఫిలిం ప్రొడ్యూసింగ్ అనేది గాంబ్లింగ్ కాదు. ఒక విజన్ మీద పెట్టే పెట్టుబడి. దీనికి చాలా గట్స్ ఉండాలి. ఉల్టాపుల్టా అయితే తట్టుకొనే దమ్ముండాలి. ఈ రెండిటినీ హాండిల్ చేయగల కిల్లర్-ఇన్‌స్టిన్‌క్ట్ మైండ్‌సెట్ ఉండాలి. 

అంతకుముందు "ప్రొడ్యూసింగ్ మనకెందుకులే" అనుకునేవాళ్ళు డైరెక్టర్స్. కాని - మణిరత్నం, పూరి జగన్నాథ్ వంటి గట్సీ ఫిలిం మేకర్స్ కొందరి ఆలోచనా విధానం, ప్రొఫెషనల్ వర్కింగ్‌స్టయిల్ చూశాక ఈ విషయంలో చాలా మంది డైరెక్టర్స్ ఆలోచన ఈ విషయంలో పూర్తిగా మారింది.

ఇప్పుడు చాలామంది డైరెక్టర్స్ ప్రొడ్యూసర్‌గా కూడా సినిమాలు చేస్తున్నారు. అయితే, ఇది డబ్బుకోసం అనే కాదు, వాళ్ళకు అవసరమైన ఫ్రీడమ్ కోసం.      

గత రెండున్నరేళ్ళుగా ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి ఎం డి గా కూడా పని చేస్తున్న నేపథ్యంలో... రియల్ ఎస్టేట్‌నూ, దాంతో పాటు మరెన్నో వ్యాపారాలనూ చాలా దగ్గరనుంచి అధ్యయనం చేసే అవకాశం నాకు దొరికింది. ఈ అధ్యయనంలో నేను తెలుసుకున్న నిజం ఏంటంటే, రియల్ ఎస్టేట్ సహా చాలా వ్యాపారాల నేపథ్యంలో ఉన్న తలనొప్పులు, గందరగోళం కంటే ఫిలిం ప్రొడ్యూసింగ్‌లో ఉన్న గందరగోళం చాలా చాలా తక్కువ.  

ఈ నేపథ్యంలో - 
ఒక్క సినిమా నిర్మాతే "ప్రపంచంలో నంబర్ వన్ దమ్మున్న పెట్టుబడిదారుడు" అని ఇప్పుడు నేను చాలా కాన్‌ఫిడెంట్‌గా చెప్పగలను.

- మనోహర్ చిమ్మని        

Sunday, 1 March 2026

ఓవర్‌నైట్ సక్సెస్ అనేది అసలుందా?


"ఓవర్ నైట్ సక్సెస్" అనే మాట మనం తరచూ వింటుంటాం. అంటే రాత్రికి రాత్రే సక్సెస్ సాధించటం అన్న మాట.

ఇదొక పచ్చి అబద్ధం. 
అసలు అలాంటిది లేదు.  
ఉండదు.  

ఇప్పుడు లీడ్‌లో ఉన్న స్టార్స్, స్టార్ డైరెక్టర్ల సక్సెస్ వెనుక మినిమమ్ ఒక పదేళ్ల తపస్సులాంటి కృషి ఉంటుంది. ఆకలి రాత్రులు, అవమానాలకు లెక్కే ఉండదు. 

సినిమా రంగంలో పనిచేసే ఆర్టిస్టులు, టెక్నీషియన్లు, ఇతర సినీ అనుబంధరంగాలవాళ్ళు అందరికీ ఇది వర్తిస్తుంది.   

ఆమధ్య నేను వెళ్లిన ఒక యువ దర్శకుడి ఆఫీస్‌లో ఒక కొటేషన్ ఒకటి గోడకి అతికించి ఉంది:

“It took 15 years to get overnight success!”  అని.

ఇదే కొటేషన్‌ను సుమారు ఓ 20 ఏళ్ళ క్రితం స్పిరిచువల్ మార్కెటింగ్ గురు జో వైటలి రాసిన ఒక పుస్తకంలో చదివాను.

సినిమా ఇండస్ట్రీలో ఈ సోకాల్డ్ "ఓవర్‌నైట్ సక్సెస్‌"లు ఎక్కువగా కనిపిస్తాయి. కాని, ఆ ఓవర్ నైట్ సక్సెస్‌ల వెనుక ఎన్నో ఏళ్ల కష్టాలు, ఎంతో కృషి ఉంటుంది. అది బయటి వారికి కనిపించదు. ఇన్‌స్టంట్‌గా వారికి కనిపించేది రెండే రెండు విషయాలు.   

సక్సెస్, ఫెయిల్యూర్.  

There’s no such thing as overnight success. There are years of silent hunger, unseen grind, and behind-the-curtain battles — But the world doesn’t watch the struggle. It only applauds the spotlight. 

-మనోహర్ చిమ్మని

Saturday, 28 February 2026

The Math & Myth of the 100CR Indie: A Director’s Strategy for High-Leverage Cinema


The number 100 Crores usually conjures images of massive studio backlots, A-list superstars, and bloated marketing budgets. In the traditional model, a 100CR film is a game of Capital and Labor.

But I’m an Indie director. I don’t have a studio’s treasury or a thousand-person army. My game is different. My game is Specific Knowledge and Permissionless Leverage.

Following the principles of The Almanack of Naval Ravikant, here is exactly how we are going to bridge the gap between "Independent" and "Exponential."

1. Escaping the "Budget Trap" with Specific Knowledge

In the cine field, most people think a bigger budget equals a better film. This is a linear mindset. Specific Knowledge is non-linear. My specific knowledge isn't just "directing"—it’s the ability to find high-concept stories that can be told with elite technical precision but minimal physical overhead. By using cutting-edge tech (Virtual Production, AI-assisted post-production, and lean crews), we decouple the quality of the output from the cost of the input.

2. Using Media as a Force Multiplier

Naval says: "Code and media are permissionless leverage."

Instead of spending 20CR on traditional billboards, the 100CR Indie Mission relies on building a digital community during the process.

  • We aren't just making a movie; we are creating a Media Loop. * Every behind-the-scenes clip, every technical breakdown, and every manifesto post is a "Permissionless" soldier working to build an audience before the first trailer even drops.

3. The Power of "Skin in the Game"

To hit 100CR as an Indie, you cannot be a "Director-for-Hire." You must be an Owner. By keeping the production lean and retaining equity, the "break-even" point drops significantly. When the cost of production is low and the leverage of media is high, the upside becomes infinite. We aren't looking for a paycheck; we are looking for a Value Unlock.  

4. Judgment is the Ultimate Asset

As the director of this mission, my most important job isn't being the loudest person on set. It’s making the right calls on:

  • The Story: Choosing themes that are globally resonant but locally rooted.
  • The Tech: Choosing tools that save time without sacrificing the "Cinematic Soul."
  • The People: Partnering with "High-Signal" collaborators who understand that 1% of the right effort beats 100% of the wrong "hustle." 

The Path Forward

The 100CR Indie Mission isn't a dream; it’s a calculation. It’s the result of applying modern economic principles to the ancient art of storytelling.

We are no longer asking for permission to be successful. We are building the infrastructure to make success inevitable.

- Manohar Chimmani

Thursday, 26 February 2026

అందరికీ అవకాశాలు, రెమ్యూనరేషన్స్ ఇప్పించే డైరెక్టర్స్‌కు మాత్రం...


ఆమధ్య హైద్రాబాద్ బుక్ ఎగ్జిబిషన్లో ఒక మిత్రుడి స్టాల్ ఎదురుగా నేను, మా కవి యాకూబ్, ఇంకొందరు మిత్రులం నిల్చుని మాట్లాడుకుంటున్నాం. అప్పుడే కవి గోరటి వెంకన్న వచ్చారు. మా యాకూబ్ నన్ను వెంకన్నకు పరిచయం చేశాడు...

"వీడు నా క్లాస్‌మేట్, ఫ్రెండ్... ఫిలిం డైరెక్టర్" అని. 

"ఫిలిం డైరెక్టరా?!" అని నన్ను హగ్ చేసుకొని షేక్ హాండిచ్చారు వెంకన్న. తర్వాత నా భుజం మీద చెయ్యేసి, ఒక మాటన్నారాయన... 

"డైరెక్టర్... లైఫ్ చాలా దారుణమైన నరకం కదా అన్నా?!" అని.  

కట్ చేస్తే -

ఇవ్వాళ మధ్యాహ్నమే నా డైరెక్టర్ మిత్రుడు ఒకరితో కాసేపు ఫోన్లో మాట్లాడాను. ప్రస్తుతం ఒక వంద కోట్ల సినిమా మీద ఫోకస్ పెట్టి, ఆ సినిమా ప్రిప్రొడక్షన్ పనుల్లో చాలా బిజీగా తిరుగుతున్నాడు నా మిత్రుడు. 

"మీరు మీ మొహమాటాలన్నీ పక్కనపెట్టి, ముందు ఆ అడ్వాన్స్ ఏదో తీసుకోండి. మీ రెమ్యూనరేషన్... అవన్నీ జాగ్రత్తగా చూసుకోండి కనీసం ఈ సినిమా నుంచైనా! ఏంటో, పేరుకే డైరెక్టర్... మీకు చిన్న సినిమాలకు డబ్బులు రావు, ఇప్పుడు చేస్తున్న పెద్ద సినిమాక్కూడా అంతే అంటే ఎట్లా?!"... ఇదీ నా డైరెక్టర్ మిత్రుని భార్య ఆవేదన. 

(అప్పట్లో సినిమా హిట్ అయినా సరే, డైరెక్టర్‌కు మొండి చెయ్యే అని కొంతమంది డైరెక్టర్ మిత్రుల ద్వారా తెలిసింది!)  

కట్ చేస్తే -

డైరెక్టర్ అనేవాడు చాలామందికి అవకాశాలిస్తాడు, రెమ్యూనరేషన్స్ ఇప్పిస్తాడు. ప్రొడ్యూసర్‌కు ఎక్కడికక్కడ డబ్బు వృధా కాకుండా తన బాధ్యత కాని ఎన్నెన్నో విషయాల్ని కూడా తన భుజాలమీద మోస్తుంటాడు. తన జేబులోంచి కూడా ఎంతో ఖర్చుపెడుతుంటాడు.  

కాని, టీంలో అందరికీ డబ్బిచ్చే ప్రొడ్యూసర్... ఒక్క డైరెక్టర్ పేమెంట్ దగ్గరికి వచ్చేటప్పటికి ఆపేస్తుంటాడు-లేదా-నిర్దాక్షిణ్యంగా కోతలుపెడుతుంటాడు. ఇంకా చెప్పాలంటే, అసలేమీ ఇవ్వకుండా పెండింగ్‌లో పెడతాడు. 

ఆర్టిస్టులు, టెక్నీషియన్లు అడిగినట్టుగా నిర్మొహమాటంగాతన పేమెంట్ గురించి అడగలేకపోతాడు డైరెక్టర్. 

అప్పులు, ఆకలి మధ్య, ఎప్పుడూ చెదరని చిరునవ్వుతో, వందమంది టీమ్‌తో కలిసి పనిచేస్తుంటాడు. అవసరమైనప్పుడు బయటనుంచి అప్పుతెచ్చి కూడా టీమ అవసరాలకు అడ్జస్ట్ చేస్తుంటాడు. 

ప్రొడ్యూసర్స్ అందరూ ఇలాగే ఉంటారని కాదు. కాని, చాలామంది ప్రొడ్యూసర్స్ మాత్రం... ఒక్క డైరెక్టర్ పేమెంట్ విషయంలోనే ఎందుకో ఇవ్వాలంటే బాధపడుతుంటారు.   

గోరటి వెంకన్న ఇలాంటి డైరెక్టర్స్‌ జీవితాలు ఎందరివి చూసుండకపోతే ఆరోజు నాతో ఆమాట అనుంటారు?   

- మనోహర్ చిమ్మని            
          

Wednesday, 25 February 2026

Direction, Leverage, and Specific Knowledge: The Naval Way


If you’re a director, you aren’t just a "creative"—you are the CEO of a vision. 

Most people in the film industry trade their time for money, but The Almanack of Naval Ravikant teaches us how to build wealth and impact by escaping the "hourly rate" mindset.

For a filmmaker, these three Naval pillars are game-changers:

1. Specific Knowledge: Find Your "Uncopyable" Voice

Naval defines specific knowledge as the thing you do that feels like play to you, but looks like work to others.

  • The Director’s Take: Don't just "direct." Find the intersection of your unique obsessions—maybe it’s a specific sub-genre, a technical lighting style, or a way of coaxing performances that no one else can replicate. When you have specific knowledge, you aren't competing; you’re the only one who can do what you do.

2. Leverage: The Force Multiplier

In the "Cine field," we often get stuck in the grind. But Naval talks about three types of leverage: Labor, Capital, and Code/Media.

  • The Director’s Take: Media is the ultimate "permissionless" leverage. Every film you finish is a digital asset that works for you while you sleep. It’s a piece of code that broadcasts your talent to the world 24/7 without you needing to be in the room.

3. Judgment over Sweat

Naval says, "In an age of infinite leverage, judgment is the most important skill." As a director, you are paid for your decisions (the "calls"), not just for being the first person on set.

  • The Director’s Take: One great decision on a script or a casting choice is worth a thousand hours of "hustle." Protect your mind, stay curious, and focus on the high-leverage choices that move the needle.

"Build or buy equity in a business [or a project]... if you don’t own a piece of a business, you don’t have a path towards financial freedom." — Naval Ravikant

As a director, you aren't just making a movie; you are building your personal brand as an intellectual property. Use your "specific knowledge" to create "media leverage," and let your "judgment" guide your career.

- Manohar Chimmani 

Directing with Leverage: Lessons from The Almanack of Naval Ravikant


As a film director, I see cinema not just as art — but as leverage.

In The Almanack of Naval Ravikant, Naval Ravikant speaks about specific knowledge, leverage, accountability, and long-term games. These ideas apply powerfully to a director’s life.

Specific Knowledge is your voice — your lived experiences, your emotional depth. That’s your unfair advantage.

Leverage in cinema means creating stories that outlive you — films that travel across time and geography.

Accountability is when your name stands on the poster. That changes how you choose stories.

Cinema is not a one-film race.
It is a long-term game of reputation, relationships, and legacy.

A director who thinks like a philosopher doesn’t just make movies.
He builds freedom.

- Manohar Chimmani 

Tuesday, 24 February 2026

అసలు సినిమాలెందుకు ఆగిపోతాయి?


నా చిన్నప్పటినుంచీ వింటున్నాను... బోలెడన్ని సినిమాలు రిలీజ్ కాకుండా ప్రసాద్ ల్యాబ్‌లో కుప్పలుగా పేరుకుపోయి ఉన్నాయని. అది అబధ్ధమేం కాదు. 100% నిజం. 

ఇప్పుడయితే ల్యాబ్స్ అవసరం కూడా లేదు. డిజిటల్ హార్డ్ డిస్కులు... ప్రొడ్యూసర్ దగ్గరో, డైరెక్తర్ దగ్గరో ఒక డబ్బాలో వేసి పడుంటాయి.  

ప్రతి సంవత్సరం ప్రారంభమయ్యే 250+ సినిమాల్లో... కొన్ని సినిమాలు పూర్తికాకపోవటం, పూర్తయినా రిలీజ్ కాకపోవటం అనేది ఒక అత్యంత సర్వసాధారణమైన విషాదం. 

ఈ పరిస్థితి ఒక్క తెలుగు సినిమాలకే పరిమితం కాదు. హాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా అంతటా ఉన్నదే.

అన్నేసి కోట్లు కుమ్మరించి కూడా అసలెందుకీ పరిస్థితి? ఎందుకు సినిమాలు ఆగిపోతాయి? 

ఈ పరిస్థితికి సాధారణంగా 90 శాతం కారణం ఒక్కటే అయి ఉంటుంది... డబ్బు.  

* మనం ఎలాంటి కథతో సినిమా తీస్తున్నాం, దాని టార్గెట్ ఆడియెన్స్ ఎవరు, ఎవరితో తీస్తున్నాం, వారికి ఫీల్డులో ఉన్న మార్కెట్ ఏంటి, మనం ఆ మార్కెట్‌కు లోబడే ఖర్చు పెడుతున్నామా, మార్కెట్ పరిమితి దాటి రిస్కు తీసుకుంటున్నామా, కొత్తవాళ్ళతో తీసినప్పుడు మనం ఎదుర్కొనే రిస్కులేంటి, వాటికి సొల్యూషన్ ఏంటి... ఇవన్నీ అలోచిస్తే ఒక్క సినిమా కూడా మధ్యలో ఆగిపోదు.

* సినిమాలు ఆగిపోవడం ఎక్కువగా ముందు అనుకున్న బడ్జెట్ దాటిపోవటం వల్ల జరుగుతుంది. సగం సినిమా షూటింగ్ తర్వాత డబ్బులు అయిపోతే ఇంక చెయ్యడానికి ఏముంటుంది? 

* కొన్ని సినిమాలు పూర్తవుతాయి. కానీ, వాటిని కొని రిలీజ్  చేయడానికి డిస్ట్రిబ్యూటర్స్ ఎవరూ రారు. స్వంతంగా రిలీజ్ చేసుకొనే శక్తి నిర్మాతకి ఉండదు. 

* సినిమా బిజినెస్ అన్ని వ్యాపారాల్లా కాదు. ముందే ఒక ఖచ్చితమైన్ ప్లాన్‌తో, ప్రొడ్యూసర్-డైరెక్టర్‌ల మధ్య ఒక స్పష్టమైన అవగాహనతో... అనుకున్నది అనుకున్నట్టుగా చేస్తే ఎలాంటి సమస్యలు రావు. అలా కాకుండా ఓవర్‌కాన్‌ఫిడెన్స్‌తో ఎవరిదారిన వారు గుడ్డిగా వెళితే మాత్రం అంతిమ ఫలితం ఇలాగే ఉంటుంది.

* అరుదుగా కొన్ని సినిమాలు ఎవరో ఒకరి "ఈగో" సమస్య వల్ల కూడా ఆగిపోతాయి. 

సరిగ్గా చేసుకుంటే ఈ "షో బిజినెస్‌"ని మించిన బిజినెస్ లేదు.  డబ్బూ, డబ్బుతోపాటు ఓవర్‌నైట్‌లో మనం ఊహించనంత ఫేమ్ కూడా ఈ ఒక్క బిజినెస్‌లోనే సాధ్యం. 

ఒక్క హిట్ గానీ ఇచ్చామా... ఇంక అంతే. ప్రొడ్యూసర్ అయినా, డైరెక్టర్ అయినా... అప్పటివరకూ పడ్డ కష్టాలన్నీ హుష్ కాకి అయిపోతాయి! ఆ తర్వాత ఇంక మీరు ఏది అనుకుంటే అదే!! 

కానీ, ఆ హిట్టు రావడం అంత ఈజీ కాదు... 

- మనోహర్ చిమ్మని