మొన్నటిదాకా నా బ్లాగ్‌కు ఉన్న కస్టమ్ డొమైన్‌ను తీసేసి, కొత్త డొమైన్ నేమ్‌కు మార్చే ప్రాసెస్‌లో ఎక్కడో స్టకప్ అయింది.
పాత డొమైన్ రావట్లేదు, కొత్తది కనెక్ట్ అవ్వలేదు. ఒరిజినల్ బ్లాగర్ డొమైన్ అయితే అలాగే ఉంది.
2, 3 గంటలు బుర్రబద్దలు కొట్టుకున్నాను. సెట్ చెయ్యలేకపోయాను. ప్రస్తుతానికి దాన్నలా వదిలేశాను. ఇప్పుడు ఎక్కడా నా బ్లాగర్ లింక్ ఇవ్వట్లేదు.
ఎక్కడో యు యస్ లో ఉన్న మా ప్రణయ్ ఇంట్లో లేని లోటుని... ఇదిగో... ఇలాంటి టెక్నికల్ గ్లిచెస్ వల్ల కూడా మొట్టమొదటిసారి ఫీలయ్యాను.
మా ప్రణయ్‌కి ఆ లాగిన్స్ పంపించో, లేదంటే ఇక్కడే ఎవరైనా టెక్కీని పక్కన కూర్చోపెట్టుకొనో, ఈ పని త్వరగా పూర్తిచెయ్యాలి.
కట్ చేస్తే -
సినిమా కావచ్చు, నాన్-సినిమా కావచ్చు... నేను చేసే అన్ని పనులకూ, ఇకనుంచి నా బ్లాగే ఒక సెంట్రల్ హబ్ కాబోతోంది.
- మనోహర్ చిమ్మని
100 Days, 100 Posts. 7/100.
మనోహర్ గారూ.. మీ బ్లాగుకి కస్టమ్ డొమైన్ సెట్ చేయడం చాలా తేలిక .. వివరాలకు https://www.hostinger.in/tutorials/how-to-point-a-domain-to-blogger
ReplyDeleteఒకసారి చూడండి .. కష్టం అనుకుంటే మీ నంబర్ నాకు మెయిల్ చేయండి .. srinivasrjy@gmail.com
ఇది నేను అంతకుముందు 2, 3 సార్లు చాలా ఈజీగా చేశానండి. ఇప్పుడే ఏదో ఎర్రర్ వస్తోంది. ఆల్రెడీ ఉన్న ఒక కస్టం డొమైన్ తీసేసి, ఇంకోటి పెట్టడం. (నా నంబర్ పంపిస్తాను మీకు.). Thanks.
Delete