హిట్ సినిమాలు తీయడం కష్టం.
హిట్ సినిమాలకు, బడ్జెట్‌కు తప్పక సంబంధం ఉంటుంది. అయితే, భారీ బడ్జెట్ ఉన్న సినిమాలు కూడా ఫెయిలవుతాయి కదా అన్నది లాజిక్. కాని, ఒక మంచి కమర్షియల్ సినిమా తీయడానికి బేసిగ్గా ఒక మినిమమ్ బడ్జెట్ అనేది తప్పనిసరి అన్నది ఎవరైనా ఒప్పుకొనితీరాల్సిందే.
ఇండిపెండెంట్ సినిమాలన్నింటికీ ప్రధాన సమస్య ఇదే...
మినిమమ్ బడ్జెట్.
మినిమమ్ బడ్జెట్.
కట్ చేస్తే -
హాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా, సినిమాల సక్సెస్ రేట్ కేవలం 5-7 శాతమే.
ఈ నంబర్ మన బుర్రలో ఉంటే చాలు. వొళ్ళు దగ్గరపెట్టుకొని సినిమాలు చేస్తాం. రిస్క్-ఫ్రీ బడ్జెట్‌లో సినిమాలు చేస్తాం. ఒకవేళ థియేటర్లో సినిమా కిందా మీదా అయినా, ఓటీటీలు కొంతవరకు ఆదుకుంటాయి.
మ్యాటర్ ఏంటంటే... భారీ బడ్జెట్ ప్యానిండియా సినిమాల గ్యాంబ్లింగ్‌ను తట్టుకొనే శక్తి భారీ ప్రొడక్షన్ హౌజ్ బ్యానర్లకు, ప్రొడ్యూసర్స్‌కు ఉంటుంది.
చిన్న బడ్జెట్లో చేసే ఇండిపెండెంట్ సినిమాలకు అంత రిస్క్ లేదు. కంటెంట్ విషయంలో కూడా, మన క్రియేటివిటీకి ఆకాశమే హద్దు.
- మనోహర్ చిమ్మని
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani