Sunday, 30 August 2026

నిత్య జీవితంలో పనికొచ్చే పుస్తకాలు కూడా పుస్తకాలే!


ఒక్క అమెజాన్‌లోనే, 2025లో, ప్రపంచవ్యాప్తంగా సుమారు 300 మిలియన్ల ప్రింటెడ్ బుక్స్ సేలయ్యాయి. 

ఈ 300 మిలియన్ల పుస్తకాల్లో 50% పుస్తకాలు కొని చదివింది అమెరికన్ పాఠకులే కావడం మనం గమనించాల్సిన ముఖ్యమైన అంశం. 

'కిండిల్ బుక్స్' లాంటి డిజిటల్ బుక్స్, ఆడియో బుక్స్ అంకెలు వేరే. 

కట్ చేస్తే -

ప్రపంచపటంలోని అభివృద్ధి చెందిన ఏ దేశాన్నయినా తీసుకోండి. ఆ దేశ ప్రజలు, పాలకులు, కంపెనీల సీఈవోలు... ఖచ్చితంగా మంచి పాఠకులైవుంటారు. పుస్తకప్రియులైవుంటారు. వీళ్ళల్లో చాలామంది రైటర్స్ కూడా ఉంటారు. 'న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్లర్' స్థాయిలో మంచి మంచి పుస్తకాలు రాసివుంటారు. 

అంతెందుకు, అమెరికా ప్రసిడెంట్ ట్రంప్ కూడా రచయితగా, సహరచయితగా ఒక డజన్ బుక్స్ రాశాడన్న విషయం మీకు తెలుసా? 2004-2017 వరకు, "ది అప్రెంటిస్" పేరుతో ట్రంప్ ఒక రియాలిటీ షో కూడా హోస్ట్ చేశాడు. అది వేరే విషయం. 

ట్రంప్ కూడా మంచి పాఠకుడే.  

పుస్తకాలు చదవటం అనే అలవాటు మనిషిలోని ఆలోచనా శక్తిని, విజువలైజేషన్ పవర్‌ను ఎప్పటికప్పుడు పెంపొందిస్తుంది. పాఠకుల్లో ఒక స్థాయి క్రమశిక్షణకు మూల కారణమవుతుంది. ఈ రెండూ ఉన్నప్పుడే ఎవరైనా ఏ ఫీల్డులోనైనా ఎదగగలుగుతారు. 

వ్యక్తుల ఉన్నతస్థాయి ఎదుగుదల, పరోక్షంగా వారి దేశ ఉన్నతికి ఉపయోగపడుతుంది.     

మనమెక్కడున్నాం మరి? 

యూట్యూబ్ కనిపెట్టిన దేశపౌరుల కంటే కంటే ఎక్కువగా మనదేశంలోని వ్యూయర్సే ఆ వీడియోల్ని పనీపాటా పక్కనపెట్టి ఎగబడి చూస్తున్నారు. యూట్యూబ్ ద్వారా వారికి భారీ ఆదాయం రావడానికి కారణమవుతున్నారు. 

యూట్యూబ్ వీడియోలు చూడటం తప్పు కాదు. ఎలాంటి వీడియోలు చూస్తున్నామన్నది పాయింట్. పనికిరాని టైం పాస్ వీడియోలు చూస్తూ, ఎంత టైం వృధా చేసుకుంటున్నామన్నది పాయింట్. 

యూట్యూబ్‌లోని వీడియోలు చూడ్దానికి అలవాటుపడటం ద్వారా... పరోక్షంగా మనలోని ఆలోచనా శక్తిని, ఊహాశక్తిని, విశ్లేషణాశక్తిని, విజువలైజేషన్ పవర్‌ను ఊహించని స్థాయిలో కోల్పోతున్నాం. 

పుస్తకాలే కాదు, అసలు చదివే అలవాటునే పూర్తిగా మర్చిపోతున్నాం.  
 
ఇది నిజం కాదా?

మనలో ఎంతమంది పెన్ను, పేపర్ పట్టుకొని గత 24 గంటల్లో ఏదైనా రాశారు? అసలు మనలో ఎంతమంది ఏదైనా ఒక పుస్తకం పట్టుకొని ఎన్నిరోజులైంది?

"ఇప్పుడంతా డిజిటల్ యుగం, పుస్తకాలు అవుట్‌డేటెడ్" అనే ముందు, ఈ పోస్టు ప్రారంభంలో నేను రాసిన అమెరికా ఉదాహరణ ఇంకోసారి చదవండి. 

మన దేశంలో పబ్లిషింగ్ వ్యవస్థ ప్రపంచస్థాయి ప్రమాణాల్లో ఎందుకు లేదు?... మన దేశంలో 99.99% రచయితలు ఎందుకు రాయటం ద్వారా కనీసం బ్రతికే అంత డబ్బు కూడా ఎందుకు సంపాదించుకోలేరు?... ప్రొఫెషనల్ రైటర్స్‌గా ఎందుకు బ్రతకలేరు?... 

ఇలాంటి కొన్ని ప్రశ్నలకు సమాధానం కూడా ఒక్కటే. 

మనం పుస్తకాలు చదవటం లేదు.     

పుస్తకాలంటే కేవలం కథలు, కవిత్వం, సాహిత్యం మాత్రమే కాదు. నిత్య జీవితంలో పనికొచ్చే పుస్తకాలు కూడా పుస్తకాలే. అవి కూడా ఎక్కువగా రావాలి. పాఠకులకు నిత్యజీవితంలో ఉపయోగపడాలి.  

ఫిక్షన్ కావచ్చు, నాన్-ఫిక్షన్ కావచ్చు... చదివించే గుణం ఉన్న పుస్తకాల్ని మాత్రం మన రచయితలు కూడా ఎక్కువగా రాయటం లేదు.  

బహుశా, అందుకే మనవాళ్ళు పుస్తకాలు కొనటం లేదు. 
తెలుగులో అయితే ఇది మరీ ఎక్కువగా ఉంది. 
ప్రచురణ కర్తలు మాత్రం ఏం చేస్తారు?  

Great nations are built by great minds.
And great minds are awakened by great books.

Every great nation has leaders who write, readers who think, and publishers who put ideas into people’s hands.

Because a nation is first built in silence—
not in noise, but in the turning of a page.

- మనోహర్ చిమ్మని   

No comments:

Post a Comment

Thanks for your time!
- Manohar Chimmani