ప్రొఫెషనల్స్‌తో పనిచేయడం వేరు, పనిమీద ఆసక్తిలేనివారితో పనిచెయ్యడం వేరు. ఈ ఇద్దరి పనితీరులో, యాటిట్యూడ్‌లో భూమ్యాకాశాల తేడా ఉంటుంది.
కట్ చేస్తే -
నా కొత్త సినిమా కథాచర్చలు అనుకోకుండా ఇవాళ వై-జంక్షన్ దగ్గరున్న ఒక 'మాల్'లో జరిగాయి.
ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు. ఫుల్ 'ఏసీ'లో ఎక్కడ సౌకర్యంగా ఫీలైతే అక్కడ కూర్చోవచ్చు. ఆకలైతే 'కేయఫ్సీ'లో చికెన్-పెప్సీ తీసుకొని తినొచ్చు. కావాలనుకున్నప్పుడు మంచి కాఫీ త్రాగొచ్చు. బోర్ కొడితే, చుట్టూ ఉన్న కలర్‌ఫుల్ యాంబియెన్స్‌లో కాసేపు అలా వాకింగ్ చేసిరావచ్చు.
నా మొదటి సినిమా కోడైరెక్టర్, రచయిత, డైరెక్టర్ వేణు గారు, నేను సుమారు మూడున్నర గంటలపాటు కూర్చున్నాం.
క్రియేటివ్ మీటింగ్స్‌కు ఇప్పుడు ది బెస్ట్ ప్లేస్... మాల్స్. నిజానికి, మాల్స్‌ను మించిన ఎకానమీ మీటింగ్ ప్లేసులు నా దృష్టిలో అసల్లేవు.
ఇక్కడ ఎవరూ ఎవర్ని పట్టించుకోరు. మన పని మనం హాయిగా చేసుకోవచ్చు.
ఇక్కడ ఎవరూ ఎవర్ని పట్టించుకోరు. మన పని మనం హాయిగా చేసుకోవచ్చు.
ఇంకేం కావాలి?
ఎప్పుడూ నాకు అది కావాలి, ఇది కావాలి అనేవాళ్ళూ... ఇదుంటేనే చేస్తా, అదుంటేనే చేస్తా అనేవాళ్ళూ... అసలు క్రియేటివిటీకి పనికిరారు.
ఇంకేం లేకపోయినా ఫరవాలేదు కాని, వీళ్ళు మాత్రం వద్దు.
ఎప్పుడూ నాకు అది కావాలి, ఇది కావాలి అనేవాళ్ళూ... ఇదుంటేనే చేస్తా, అదుంటేనే చేస్తా అనేవాళ్ళూ... అసలు క్రియేటివిటీకి పనికిరారు.
ఇంకేం లేకపోయినా ఫరవాలేదు కాని, వీళ్ళు మాత్రం వద్దు.
అసలు ఇండిపెండెంట్ సినిమాలకు ఫండ్స్ కొరత అనేది ఎప్పుడూ ఉంటుంది. ఇంకెన్నో ఇబ్బందులుంటాయి. హోటల్ రూమ్స్, గెస్ట్ హౌజ్‌లు, బాయ్స్, మేనేజర్స్... ఇవ్వన్నీ ప్రిప్రొడక్షన్ దశలో వృధా ఖర్చు. ఆ బడ్జెట్ అంతా మేకింగ్ దశలోనో, పోస్ట్ ప్రొడక్షన్ కోసమో, ప్రమోషన్ కోసమో ఉపయోగించుకోవచ్చు.
ఇండిపెండెంట్ సినిమాలు చేస్తూ... అన్నీ బాగుండాలి, అన్నీ మనం అనుకున్నట్టు ఉండాలి అనుకోవడం కంటే అమాయకత్వం లేదు.
అన్నీ బాగున్నపుడు అందరూ వస్తారు. క్యూ కడతారు. ఏం లేనప్పుడు మనక్కావల్సింది క్రియేట్ చేసుకోవడమే సిసలైన క్రియేటివిటీ.
- మనోహర్ చిమ్మని
.jpg)
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani