Sunday, 2 August 2026

ప్రమోషన్ ప్లాన్ లేకుండా సినిమా తీయడం వృధా!


చాలా మందికి కొత్తవాళ్లతో తీసే చిన్న సినిమాలు మధ్యలోనే ఆగిపోతాయి... అసలు రిలీజ్ కావు... ఒకవేళ రిలీజ్ ఐనా హిట్టు కావు... హిట్ అయినా డబ్బులు రావు... అని ఇలా రకరకాల అభిప్రాయాలుంటాయి. 

సినిమా నిర్మాణం మీద, బిజినెస్ పైన ఖచ్చితమైన అవగాహన ఉండి, సినిమా తీయడం వేరు. ఏదో ఊపులో సినిమా తీయాలని తీయడం వేరు.

ఒకవేళ తెలియనప్పుడు, తెలిసిన సీనియర్స్ చెప్పేది వినడం చాలా అవసరం. అలా జరగనప్పుడే పై అపోహలు నిజమవుతాయి. నిర్మాతతోపాటు - ఆ సినిమాకు పనిచేసిన ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ కూడా ఎంతో నష్టపోతారు.

ఇవన్నీ ఒకెత్తు కాగా, సినిమా ప్రమోషన్ మొత్తం ఒకెత్తు.
 
ప్రమోషన్ ప్రాముఖ్యం తెలియనివాళ్లు అసలు సినిమా తీయకుండా ఉండటం బెటర్. ఈ వాస్తవం గుర్తించినవారెవ్వరికీ ఏ సమస్యా ఉండదు. చిన్న బడ్జెట్‌లోనే మంచి హిట్ ఇస్తారు. మరిన్ని మంచి సినిమాలు తీస్తారు. కోట్లల్లో డబ్బు సంపాదించుకుంటారు.

అలాంటి లైక్‌మైండెడ్ ఇన్వెస్టర్స్, కో ప్రొడ్యూసర్స్, ప్రొడ్యూసర్స్ పాతవాళ్లలో చాలా తక్కువగా ఉంటారు. కొత్తవారు దొరకడం అంత ఈజీ కాదు.

ఒక సినిమా ప్రారంభించే ముందు ఇలాంటివి ఎన్నో, ఎన్నెన్నో బాగా చూసుకోవాలి. సరైన అంచనాలు వేసుకోవాలి. 

ఎటొచ్చీ, సగం తెలిసి సగం తెలీనివాళ్ళతోనే సమస్యలన్నీ.   

అందుకే చిన్న సినిమాల ప్రారంభంలో పదే పదే ఆలోచనలూ, ఆలస్యాలూ.

నిజంగా ఒక బిజినెస్‌గా తీసుకుంటే, సినిమాను మించిన బిగ్ బిజినెస్ లేదన్న విషయం ఇక్కడ సక్సెస్ సాధించినవాళ్ళందరికీ బాగా తెలుసు. వీళ్ళే తమకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకుంటారు. ప్రమోషన్ లేకుండా బ్రాండ్ లేదన్న నిజం వీళ్ళకు మాత్రమే తెలుసు.     

దటీజ్ సినిమా. 

- మనోహర్ చిమ్మని   

No comments:

Post a Comment

Thanks for your time!
- Manohar Chimmani