ముఖ్యంగా స్నేహం విషయంలో.
రకరకాల నేపథ్యాల్లో... ఎప్పటికప్పుడు... అప్పటి పరిస్థితులను బట్టి, మన అవసరాలను బట్టి, మన ఆనందాన్ని బట్టి, మన జీవితాల్లో వచ్చే అనేక కష్టనష్టాలను బట్టి... మనం తీసుకునే నిర్ణయాలన్నింటికీ మనం కట్టుబడి ఉండలేం. ఇది సహజం.
ఇలాంటి పరిస్థితుల్లోనే ఒక నిజమైన ఫ్రెండ్ అవసరం తెలుస్తుంది.
ఎలాంటి హిపోక్రసీ లేకుండా, భయం లేకుండా - మనసు విప్పి మాట్లాడుకోడానికి ప్రతి ఒక్కరికీ జీవితంలో కనీసం ఒక ఫ్రెండ్ అయినా ఉండాలి. ఉండితీరాలి.
కట్ చేస్తే -
ఎంత అద్భుతమైన స్నేహాలయినా, ఎన్ని దశాబ్దాల స్నేహాలయినా... ఏదో ఒక సమయంలో... రెండే రెండు కారణాల వల్ల బ్రేకప్ అవుతాయి.
ఒకటి ఈగో.
రెండోది డబ్బు.
రెండోది డబ్బు.
స్నేహంలో డబ్బు ప్రసక్తి ఎంటరయిందంటే చాలు. అప్పటివరకూ ఉన్న పాజిటివ్ ఫీలింగ్స్ అన్నీ క్రమంగా నెగెటివ్‌గా మారిపోతాయి. నమ్మకం అనేది ఫేడ్ అవుట్ అయిపోతుంది. మునుపెన్నడూ లేనివిధంగా - ప్రతి కదలికా, ప్రతి మాటా తప్పుగానే కనిపిస్తాయి, వినిపిస్తాయి.
అప్పటివే కాదు... గతంలో వారి స్నేహం తొలిరోజులనుంచీ కలిసి మాట్లాడుకున్న ప్రతిమాటలోను, వేసిన ప్రతి అడుగులోనూ ఇప్పుడు వంద తప్పులు కనిపిస్తాయి.
డబ్బుకు అంత శక్తి ఉంది.
ఈగో కూడా అంతే. ఎక్కువగా ఇది కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల వస్తుంది. మరీ ఎక్కువగా ఇది ఆడ-మగ స్నేహాల్లో వస్తుంది.
ఒకసారి ఈగో హర్ట్ అయ్యిందా... ప్రపంచంలో ఏ ఫెవికాల్, ఏ కెమికల్, ఏ టెక్నాలజీ కూడా విరిగిన ఆ మనసు ముక్కల్ని మళ్ళీ అతికించలేదు.
స్నేహం బాగున్నప్పుడే ఈ రెండు విషయాల్లో జాగ్రత్త పడాలి. కాని, అలా జరగదు. అలా సాధ్యం కాదు. మానవమాత్రులం. వెంటనే అవతలి మనిషి మీద జడ్జ్‌మెంట్‌లు ఇచ్చేస్తాం.
ఈ ఆవేశాన్ని, తొందరను కంట్రోల్ చేసుకోగలిగే సామర్థ్యం అందరిలో ఉండదు.
ఈ ఆవేశాన్ని, తొందరను కంట్రోల్ చేసుకోగలిగే సామర్థ్యం అందరిలో ఉండదు.
కట్ చేస్తే -
ఒక ప్రోగ్రామ్ వేదిక పైనుంచి - వందలాదిమంది ఆహూతుల సమక్షంలో - యస్ పి బాలసుబ్రహ్మణ్యం గారు స్నేహం గురించి ఒక అద్భుతమైన విషయం చెప్పారు.
'సక్సెస్ సైన్స్' నేపథ్యంలో - ఒక "రాగ్స్ టు రిచెస్ స్టోరీ"గా - రామోజీరావు గారు ఒక ఐకాన్. అందులో ఎలాంటి సందేహం లేదు. ఆయన ఒకసారి స్నేహం విషయంలో బాలు గారితో ఒక మాట చెప్పారట:
"మీరు ఎవరైతోనైనా స్నేహం చేసేముందే ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. ఒకసారి స్నేహం చేశాక, ఆ వ్యక్తిలో మీకు చాలా తప్పులు కనిపించొచ్చు, కొన్ని అంశాలు మీకు నచ్చకపోవచ్చు. వీలైతే సరిదిద్దండి. మీకు అనుకూలంగా మార్చుకోండి. కుదర్లేదా... జన్మాంతం భరించండి" అని!
ఇట్లా నేను కొందరిని భరిస్తున్నాను. నన్ను కూడా కొందరు భరిస్తూ ఉండొచ్చు. అయినా సరే, మేం చాలా మంచి మిత్రులం. అందులో ఎలాంటి సందేహం లేదు.
హాపీ ఫ్రెండ్‌షిప్ డే!💐
- మనోహర్ చిమ్మని

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani