ఇందాక ఒక చిన్న ఇంటర్వ్యూ బైట్ చూశాను. అది కలెక్షన్ కింగ్ ఇంటర్వ్యూ బైట్, ఓ నాలుగైదేళ్ళ కిందిది అనుకుంటాను. అందులో ఆయన చెప్పిన ఒకట్రెండు మాటలకు చాలా విలువుంది.
విషయం ముంబై నుంచి, ఇతర నార్త్ ఇండియా ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకునే హీరోయిన్స్‌కు సంబంధించింది.
సన్నగా, తెల్లగా ఉంటారని మనం ఎక్కడినుంచో ఎవరినో తెచ్చుకుంటున్నాం. బిజినెస్ క్లాస్ టికెట్స్ వేసి రప్పిస్తున్నాం. ఇక్కడ స్టార్ హోటల్స్‌లో ఉంచుతున్నాం. ఇదంతా ప్రొడ్యూసర్స్, కొంతమంది డైరెక్టర్స్ వల్ల జరుగుతున్న కాస్ట్‌లీ పొరపాటు.
ఆర్ట్‌కు భాష, ప్రాంత భేదాల్లేవు. కాని, వాళ్ళకి కోట్లల్లో రెమ్యూనరేషన్, ఇతర సౌకర్యాలు అలవాటుచెయ్యాల్సిన అవసరం లేదు. మన ప్రొడ్యూసర్స్ పుణ్యమా అని వీళ్ళంతా సంవత్సరం తిరిగే సరికి కోట్లు డిమాండ్ చేసే హీరోయిన్స్ అవుతున్నారు.
ఎవరికైనా రెమ్యూనరేషన్ ఇవ్వాల్సిందే. కాని, ఇక్కడి మన తెలుగు/దక్షిణాది హీరోయిన్స్‌తో సమానంగా ట్రీట్ చెయ్యాలి తప్ప, అంత స్పెషల్ ట్రీట్మెంట్ అవసరం లేదు.
ఇప్పుడు హీరోయిన్స్‌గా మనవాళ్ళూ బాగానే ముందుకు వస్తున్నారు. అన్ని విషయాల్లో ప్రొఫెషనల్‌గా ముంబై అమ్మాయిలతో పోటీపడుతున్నారు. నిజంగా ఇలా ఉన్నప్పుడు, డైరెక్టర్స్‌కు తెలుగు హీరోయిన్స్‌ను తీసుకోవడం అనేది భాష, ఎక్స్‌ప్రెషన్ విషయంలో ఒక మంచి అడ్వాంటేజే అవుతుంది.
What do you say?
- మనోహర్ చిమ్మని
What do you say?
- మనోహర్ చిమ్మని

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani