ముందుగా మెచ్చుకోవాల్సింది హీరో సూర్యను... ఇలాంటి కొత్త కథను, డైరెక్టర్‌ను నమ్మి ఒప్పుకొన్నందుకు. సూర్య లుక్ & యాక్టింగ్ ఎప్పట్లాగే సింప్లీ సుపర్బ్.
వెంకీ అట్లూరి బహుశా ఈ కథను తెలుగు హీరోలకు చెప్పివుండకపోవచ్చు. చాలా సీన్లు, కథనం కొత్తగా, సింపుల్‌గా, అద్భుతంగా ఉన్నాయి.
రాధిక, మమిత బైజుల ఎన్నిక సూపర్బ్.
మమిత కాకుండా ఈ పాత్రలో ఇంకొకర్ని ఊహించలేం అన్నంత బాగా న్యాచురల్‌గా, విట్టీగా, క్యూట్‌గా యాక్ట్ చేసింది మమిత బైజు.
మమిత కాకుండా ఈ పాత్రలో ఇంకొకర్ని ఊహించలేం అన్నంత బాగా న్యాచురల్‌గా, విట్టీగా, క్యూట్‌గా యాక్ట్ చేసింది మమిత బైజు.
ఈమధ్య ఇంత మంచి ఫీల్‌గుడ్ సినిమా చూళ్లేదు. నరకడాలు, రక్తప్రవాహాల ప్యానిండియా సినిమాల రొద మధ్య అనుకోకుండా వచ్చిన చల్లటి ఫ్రెష్ బ్రీజ్... విశ్వనాథ్ & సన్స్.
- మనోహర్ చిమ్మని

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani