తెలుగులో ఒక టాప్‌స్టార్, టాప్ డైరెక్టర్ సినిమా ఒకటి పూర్తయ్యి రిలీజ్ కావడానికి 7 ఏళ్ళు పట్టింది. అది గ్రాఫిక్స్ లేని కాలం!
టాప్ స్టార్స్ నుంచి కొత్త హీరోల సినిమాల వరకు, ఏదో ఒక కారణం వల్ల సినిమాలు మధ్యలో ఆగిపోతాయి. ముఖ్య కారణం డబ్బు అయ్యుంటుంది. ఇంకో కారణం ఎవరో ఒకరి ఈగో సమస్య వల్ల!!
చాలా సినిమాలు ఎనౌన్స్‌మెంట్‌తోనే ఆగిపోతాయి. వీటిలో 80% సినిమాలు అనుకున్న బడ్జెట్ అందకపోవడం వల్ల ఆగిపోతాయి. ఇంకొన్ని మనసు మార్చుకోవడం వల్ల ఆగిపోతాయి.
అనుభవం ఉన్నదా లేదా అన్నదానితో సంబంధం లేకుండా, ఎప్పటికప్పుడు కొత్తరకం సమస్యలు ఎదుర్కోవటం అన్నది ప్రతి ఫిలిం డైరెక్టర్‌కు ఒక రెగ్యులర్ ఛాలెంజ్.
కట్ చేస్తే -
ప్రతి సినిమా ఒక బిజినెస్ ప్రపోజల్. ఒక బిజినెస్ ప్యాటర్న్. ఒక బిజినెస్ డీల్.
వీటిల్లో ఎప్పుడూ ఒక 5% డీల్స్ మాత్రమే గమ్యం చేరుతాయి. సక్సెస్ అవుతాయి.
- మనోహర్ చిమ్మని

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani