Monday, 26 January 2026

ఒకే ఒక్క నిర్ణయానికి కట్టుబడి ఉండే రోజులు కావివి !!


మనిషి జీవితంలో ఇప్పుడున్నన్ని డిమాండ్స్ ఇంతకుముందెన్నడూ లేవు. 

ఈనేపథ్యంలో - ఒకే ఒక్క నిర్ణయానికి కట్టుబడి ఉండే రోజులు కావివి. 

మనిషి పూర్తిగా మరమనిషి అయ్యాడు. ది మెల్టింగ్ మ్యాన్ సినిమా క్లయిమాక్స్‌లో హీరో కొవ్వొత్తిలా కరిగిపోయినట్టు, తన ప్రమేయం లేకుండానే ఇప్పటి మనిషి మనసు అలా కరిగిపోయి ఎప్పుడో నేల మీద అలుక్కుపోయింది.    

పాడ్‌కాస్ట్ ప్రారంభించే ఆలోచనతో, ప్రాక్టీసు కోసం ఈమధ్య కొన్నిరోజులు యూట్యూబ్ వీడియోలు చేశాను. తర్వాత, పాడ్‌కాస్ట్ కోసం నేను ఎంచుకున్న టాపిక్కే "అసలు వద్దు" అనిపించింది. వెంటనే యూట్యూబ్ వీడియోలు ఆపేశాను. 

ఫేస్‌బుక్, ఎక్స్ నిజంగా బోర్ కొడుతున్నాయి. ఇన్‌స్టాగ్రామ్‌కు వచ్చేశాను. నా సోషల్ మీడియా ప్రజెన్స్‌కు ఇదొక్కటి చాలు. బ్లాగ్ ఎలాగూ ఉంది. నా బ్లాగ్ పోస్టులు ఇన్‌స్టాలో కూడా పోస్ట్ చేస్తున్నాను.  

 పనికిరాని విషయాల మీద ఒక్క నిముషం కూడా వృధాచేయడం ఇప్పుడు నాకిష్టం లేదు.  

కట్ చేస్తే - 

ఇంతకుముందులా ఇప్పుడు నాలుగైదు పడవల మీద కాళ్ళు పెట్టి పనిచేయాల్సిన అవసరం నాకిప్పుడు లేదు. 

ఇప్పుడు నాకోసం నేను బ్రతుకుతున్నాను. నాకోసం నేను పనిచేసుకుంటున్నాను. నా విలువైన సమయాన్ని తినేసే ప్రయోజనం లేని పనుల్ని నిర్దాక్షిణ్యంగా అలా పక్కకి తోసేస్తున్నాను. 

ఏది ఇష్టంగా చేయగలనో, అది మాత్రమే చేస్తున్నాను. అదిప్పుడు నాకు అవసరం కూడా. 

Confidence comes from crossing thresholds. That’s it.

- మనోహర్ చిమ్మని          

No comments:

Post a Comment

Thanks for your time!
- Manohar Chimmani