Wednesday, 25 June 2025

అతి తెలివి ఉన్నవాళ్ళంతా చేసే అతి కామన్ తప్పు


జీవితంలోని ప్రతిదశలోనూ ఎప్పటికప్పుడు వందలాది నిర్ణయాలు తీసుకుంటూవుంటాం మనం.

ఇష్టమైన పెన్ కొనుక్కోవడం నుంచి, పెళ్లిదాకా.
ఏదో ఓ కోర్స్ చదివి, మరేదో ఉద్యోగంలో చేరేదాకా.
ఏదో ఓ లోపల్లోపలి అతిచిన్న గోల్‌తో మరేదో ఇష్టంలేని ప్రొఫెషన్‌లో చేరి,
అందులోంచి బయటికి రావాలనుకొన్నా రాలేనంత 'పీకల లోతు' ఇరుక్కునేదాకా.

జీవితమంతా ఎన్నో నిర్ణయాలు.
చిన్నవీ, పెద్దవీ.

కానీ, మనం తీసుకొన్న ఒక నిర్ణయం తప్పని తర్వాత తెలిసినా, వెంటనే దాన్ని సరిచేసుకొనే మరో కొత్త నిర్ణయం తీసుకోలేనప్పుడే అసలు చిక్కంతా! 

కట్ చేస్తే -

తప్పో ఒప్పో, అసలు ఒక నిర్ణయమంటూ తీసుకోకుండా అలా ఉన్నచోటే ఆగిపోవడం మాత్రం అన్నిటికంటే పెద్ద తప్పు. 

అతి తెలివి ఉన్నవాళ్ళంతా చేసే అతి కామన్ తప్పు ఇదే. 

- మనూ    


100 Days, 100 Posts. 69/100.

No comments:

Post a Comment

Thanks for your time!
- Manohar Chimmani