నాలుగు గోడల మధ్య ఉండి లోకజ్ఞానం తక్కువ, వివిధ విషయాలపైన అవగాహన తక్కువ అనుకుంటే వేరు. విషయం వ్యక్తిగతం అయినా, ఇంకేదైనా... స్వేచ్ఛ లాంటి మహిళల విషయంలో అలా జరక్కూడదు అన్నది నా హంబుల్ అభిప్రాయం. అలాంటి నిర్ణయం స్వేచ్ఛ తీసుకోకూడదు అన్నది నా స్థిరమైన అభిప్రాయం.
ఎలాంటి అంశంపైనైనా ఫైట్ చేసే శక్తి తనకుంది.
ఎందుకని చెయ్యలేకపోయింది?
ఎందుకని చెయ్యలేకపోయింది?
బయటపడితే ఎవరేమనుకుంటారో అన్న మైండ్‌సెట్ నుంచి తను కూడా ఎందుకని బయటపడలేకపోయింది?
కట్ చేస్తే -
పొద్దున లేచినప్పటినుంచి రాత్రి పడుకునేవరకు సోషల్ మీడియాలో ఎంతో కొంత సమయం వృధాచేసుకుంటున్నాం. అదే నిజం అనుకుంటున్నాం. కాని, అది నిజం కాదు.
ఎలాంటి మాస్కులు వేసుకోకుండా, మన మనసులోని మాటల్ని, మన జీవితంలోని మంచీ చెడుల్ని పంచుకోవాల్సిన మనవాళ్లకు మనం దూరమైపోతున్నాం.
మనకోసం నిజంగా ముందుకొచ్చే మంచి మనసుల్ని కూడా మనకు తెలీకుండానే దూరం చేసుకుంటున్నాం.
మనకోసం నిజంగా ముందుకొచ్చే మంచి మనసుల్ని కూడా మనకు తెలీకుండానే దూరం చేసుకుంటున్నాం.
బాధో సంతోషమో పంచుకోడానికి కనీసం ఒక్కరంటే ఒక్క స్నేహితుడో, ఒక ఆత్మీయురాలో లేకుండా బ్రతుకుతున్నాం. అలా బ్రతకడానికి అలవాటుపడిపోతున్నాం. అదే విషాదం.
Rest in peace, Swetcha...
Rest in peace, Swetcha...
- మనోహర్ చిమ్మని
100 Days, 100 Posts. 73/100.
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani