Tuesday, 17 June 2025

అందుకే వారు లెజెండ్స్ అవుతారు!


నేను 8 గంటలే పనిచేస్తాను... నేను రాత్రి 8 తర్వాత పనిచేయను... ఇలాంటి కండిషన్స్, రూల్స్, వర్కింగ్ లాజిక్స్ ఉన్నవాళ్ళు సినిమా ఫీల్డుకి అసలు పనికిరారు. 

కట్ చేస్తే -

పని గంటలు పెంచడం ద్వారా, చిన్న బడ్జెట్ సినిమా సెటప్స్‌కు కాస్త ఖర్చు కూడా తగ్గించుకొనే అవకాశం ఉండొచ్చు. కాని, భారీ బడ్జెట్ సినిమా సెటప్స్‌లో అసలు ఆ అవసరమే ఉండదు.  

ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ ఒక మూడ్‌లో బాగా పనిచేస్తున్నప్పుడు, అదే ఫ్లోలో మంచి అవుట్‌పుట్ రాబట్టుకొనే అవకాశం ఉంటుంది. సాధారణంగా చివరి ఒకటి రెండు గంటల్లోనే ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అలాంటి క్రియేటివ్ హైకి చేరుకుంటారు. అంత బాగా, అంత అద్భుతంగా పనిచేస్తుంటారు. ఇంతలో కాల్‌షీట్ టైమ్ అవుతుంది. యూనియన్ రూల్స్, ఆర్టిస్టుల కండిషన్స్ నేపథ్యంలో తప్పనిసరిగా డైరెక్టర్ "ప్యాకప్" చెప్పాల్సివుంటుంది... ఇష్టంలేకపోయినా.   

క్రియేటివిటీ ద్వారానే పైకి వచ్చి, బాగా పాపులర్ అయి, బాగా సంపాదించి, ఒక స్థాయికి వచ్చినవాళ్లే... అదే క్రియేటివిటీని చాలా ఈజీగా తీసుకోవడం ఏదైతే ఉందో... అది కూడా ఫీల్డులో మామూలు విషయమైపోయిందిప్పుడు. అదే విషాదం.

గతంలో అయినా, ఇప్పుడైనా, ఎప్పుడైనా... సినీఫీల్డులో లెజెండ్స్ ఎప్పుడూ ఇలా ఆలోచించరు. రెమ్యూనరేషన్ తీసుకోవడం ఒక్కటే కాదు, ఫిలిం మేకింగ్‌లో ప్రతి అంశాన్ని చాలా సీరియస్‌గా పట్టించుకుంటారు. బాధ్యతగా ఆలోచిస్తారు. అందుకే వారు లెజెండ్స్ అవుతారు.        

- మనోహర్ చిమ్మని

100 Days, 100 Posts. 60/100.  

No comments:

Post a Comment

Thanks for your time!
- Manohar Chimmani